తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది.. 2011లో చింతమనేనిపై నమోదైన కేసును కొట్టివేసింది ప్రజా ప్రతినిధుల కోర్టు.. మహిళపై దాడి చేశారంటూ 2011లో చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే కాగా.. అయితే, అక్రమంగా కేసు నమోదు చేశారని చింతమనేని తరపు న్యాయవాదులు కోర్టు ముందు వాదనలు వినిపించారు.. ఇక, ఈ కేసులో సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కేసును కొట్టివేసింది ప్రజా ప్రతినిధుల కోర్టు… దీంతో ఆయనకు ఊరట లభించినట్టు అయ్యింది.
Read Also: Oil palm: సీజన్ ప్రారంభానికి ముందే ధరలు నిర్ణయం..!