ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని చుట్టేసే పనిలో పడిపోయారు.. నిత్యం ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తున్నారు.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటారు.. ఇక, ఇవాళ కర్నూలు జిల్లాకు వెళ్తున్నారు సీఎం వైఎస్ జగన్.. ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. దీని కోసం ఇవాళ ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కర్నూలు పర్యటనకు బయలుదేరనున్నారు సీఎం జగన్… అక్కడి నుంచి గుమ్మటం తండా వద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యుబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు(గ్రీన్‌కో) వద్దకు చేరుకోనున్న ఆయన.. అనంతరం గ్రీన్‌కో ప్రాజెక్టు పనులకు శంకుస్ధాపన చేయనున్నారు.. ఆ తర్వాత మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
Read Also: High Court: ఇదే తొలిసారి.. వాట్సాప్ ద్వారా కేసు విచారణ..
తన పర్యటనలో సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో మరో భారీ పవర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేయనున్నారు.. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్ (పంప్డ్ స్టోరేజీ) విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ.. ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు) ఏర్పాటు చేయబోతున్నారు.. గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా 5,230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. కాగా, ప్రపంచంలో మూడు విభాగాల ద్వారా ఒకే యూనిట్ నుంచి ఇన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిచేసే తొలి ప్రాజెక్టు ఇదే కావడం విశేషం.. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో ఏర్పాటుచేస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్‌ను ఉత్పత్తిచేసే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుగా అవతరించబోతోంది. ఈ భారీ పవర్ ప్రాజెక్టు ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి 3,000 మెగావాట్లు, విండ్ 550 మెగావాట్లు, హైడల్ పవర్ 1,680 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు.. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే ఐదేళ్లలో పూర్తిచేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.. దీనికోసం ఏపీ సర్కార్ 4,766.28 ఎకరాల భూమిని కేటాయించగా.. ఇప్పటికే 2,800 ఎకరాలను కంపెనీకి అప్పగించారు.