ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. రాజధాని ఇక్కడి నుంచి కదలదు అని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గుంటూరు జిల్లా ఇప్పటం వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారవు.. సీఎంలు మారినప్పుడల్లా పాలసీలు మారవు అని స్పష్టం చేశారు… పాలసీల్లో తప్పొప్పులు ఉంటే.. సరిచేసుకుంటూ ముందుకెళ్లాలి కానీ, పాలసీలు మార్చేందుకు మీరెవరు? అని ప్రశ్నించారు. ఇప్పుడు 3 రాజధానులు అంటున్న నేతలు… ఆరోజు గాడిదలు కాస్తున్నారా? […]
గుంటూరు జిల్లా ఇప్పటం వేదికగా నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోమని ప్రకటించిన ఆయన.. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తామంది.. దానికోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఇక, రాజకీయ ప్రయోజనాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చే పార్టీలతో పొత్తులపై ఆలోచిస్తామని వెల్లడించారు.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే జనసేన పార్టీ టార్గెట్ అన్నారు […]
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తాజా మూవీ ఆర్ఆర్ఆర్.. ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఇక, ప్రభుత్వం సినిమా టికెట్ల వివాదానికి తెరదింపుతూ కొత్త జీవోను విడుదల చేసిన నేపథ్యంలో.. ఇవాళ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు దర్శకుడు రాజమళి, నిర్మాత డీవీవీ దానయ్య.. సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాజమౌళి, దానయ్య.. మీడియాతో మాట్లాడారు.. సీఎం వైఎస్ జగన్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్ […]
తెలుగు ప్రేక్షకులతో పాటు దేశంమొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీ ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది.. ఇక, ఏపీలో ఇప్పటి వరకు టికెట్ల వివాదం కొనసాగగా.. తాజాగా ప్రభుత్వం ఆ వివాదానికి తెరదింపుతూ.. జీవో విడుదల చేసింది.. అందులో కొన్ని షరతులు కూడా పెట్టింది.. ఇప్పటికే చిరంజీవి సహా టాలీవుడ్ ప్రముఖులతో కలిసి సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన దర్శకుడు రాజమౌళి.. ఇవాళ ఆర్ఆర్ఆర్ మూవీ నిర్వాత డీవీవీ దానయ్యతో కలిసి.. సీఎం వైఎస్ […]
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధికారికంగా ఎయిర్ ఇండియా ఛైర్మన్‌గా నియమితులయ్యారు.. చంద్రశేఖరన్‌ను అపాయింట్మెంట్ను కన్ఫామ్ చేస్తూ బోర్డు ప్రకటన విడుదల చేసింది. సాల్ట్-టు-సాఫ్ట్వేర్ టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి ఐదు సంవత్సరాల పదవీకాలానికి తిరిగి నియమితులైన విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు జరిగిన బోర్డు సమావేశం అనంతరం ఆయన ఎయిరిండియా ఛైర్మన్‌గా నియమితులయ్యారు. చంద్రశేఖరన్ ప్రస్తుతం టాటా సన్స్ […]
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. 238 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించిన భారత జట్టు.. టెస్ట్ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 447 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు కుప్పకూలింది.. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ కరుణరత్నే సెంచరీతో మెరవగా.. జట్టును గెలిపించలేకపోయారు.. ఇక భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా 3, […]
అక్రమ లేఅవుట్లని తరచూ క్రమబద్దీకరించుకునే అవకాశాన్ని కల్పించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఇవాళ విచారణ జరిగింది.. దువ్వాడు సాగర్ రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటీషన్ పై విచారణ సాగింది.. తెలంగాణలో అక్రమ “లేఅవుట్లు”లో ప్లాట్ల రిజస్ట్రేషన్‌ను అనుమతిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది.. తెలంగాణలో అక్రమ లేఅవుట్లను క్రమబద్దీకరించాలని 20 లక్షల 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు న్యాయస్థానం దృష్టికి […]
సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే పనిలో టీఆర్ఎస్ పార్టీ పడిపోయిందని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యులు, కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధమే నడిచింది.. ఆ తర్వాత మీడియా పాయింట్‌కు వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. ప్రభుత్వం.. ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారిని టార్గెట్ చేశారు.. నన్ను కాంట్రాక్టర్ అని పిలిచినా మంత్రి తెలంగాణ ఉద్యమంలో అయన పాత్ర ఏంటి..? ఇప్పుడు ఆయన స్థానం ఎక్కడ ఉంది..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అప్పటి సీఎం […]
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మారబోతోంది.. జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు రీ షెడ్యూల్ కావడంతో.. ఆ ప్రభావం తెలంగాణలో జరగనున్న ఇంటర్ పరీక్షలపై పడినట్టు వెల్లడించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై ఇవాళ లేదా రేపు స్పష్టత వస్తుందని తెలిపారు. జేఈఈ షెడ్యూల్ మారిన కారణంగా.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా మార్చక తప్పని పరిస్థితి వచ్చిందని వెల్లడించారు మంత్రి సబిత.. కాగా.. జేఈఈ మెయిన్ మొదటి విడత […]
ఆంధ్రప్రదేశ్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సంబంధించిన శాఖలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కేటాయించింది ప్రభుత్వం… ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో… గౌత్రెడ్డి శాఖలను ఇతర మంత్రులుకు కేటాయించిన విషయం తెలిసిందే.. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పబ్లిక్ ఎంటర్ప్రైజేస్, […]