పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దేశంలో ఆమ్ఆద్మీ పార్టీ రెండో రాష్ట్రంలో పాలనా పగ్గాలను చేపట్టబోతుంది. ఇప్పటికే ఢిల్లీ పగ్గాలను అందుకున్న ఆప్.. ఇటీవల పంజాబ్‌లో గ్రాండ్ విక్టరీని దక్కించుకుంది. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఏకంగా 92 సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. ఆప్ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన భగవంత్ మాన్ సింగ్ ఇవాళ పంజాబ్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. Read also: What’s Today: ఈ రోజు […]
నేటి నుంచి కార్బివ్యాక్స్ వ్యాక్సినేషన్.. 12-14 ఏళ్ల మధ్య పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. టీకా కోసం కొవిన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని కేంద్రం సూచన. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్‌తో తలపడనున్న భారత్.. మౌంట్ మౌంగనుయ్ వేదికగా మ్యాచ్ ఈ రోజు మరోసారి జీ23 కాంగ్రెస్ నేతల సమావేశం నేడు పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భగవంత్ మాన్.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆమ్ఆద్మీ […]
మేషం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక వ్యవహారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారికి రావాల్సిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలుంటాయి. పెద్దమొత్తంలో స్టాక్ ఉంచుకునే విషయంలో జాగ్రత్త వహించండి. మీ అభిరుచికి […]
ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఎదురుచూస్తోన్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది హైకోర్టు.. ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీపై దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది.. దీంతో సినిమా విడుదలకు ఎలాంటి అడ్డుంకులు లేకుండా.. అన్నీ తొలగిపోయాయి.. కాగా, అల్లూరి సీతారామరాజు, కొమ్రంభీం చరిత్రను వక్రీకరించారంటూ అల్లూరి సౌమ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారాజు, కొమ్రంభీంలను దేశభక్తులుగానే చూపామని హైకోర్టుకు నివేదించారు ఆర్ఆర్ఆర్ మూవీ దర్శకనిర్మాతలు.. ఇక, […]
సవాళ్ల మధ్యే ఉక్రెయిన్ నుంచి 22,500 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామన్నారు విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్. ప్రధానమంత్రి సూచనతో ఆపరేషన్ గంగ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఉక్రెయిన్ లో మిలిటరీ యాక్షన్, ఎయిర్‌స్ట్రైక్స్, షెల్లింగ్ జరుగుతుండగానే తరలింపు ప్రక్రియ చేపట్టామన్నారు. మొత్తం 90 విమానాలు నడిపామన్న ఆయన.. అందులో 76 పౌర, 14 ఎయిర్‌ఫోర్స్ విమానాలు ఉన్నాయని.. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడి.. విద్యార్థుల తరలింపు ప్రక్రియకు మార్గాన్ని సుగమం చేసినట్టుతెలిపారు. Read […]
శివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించిన ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం.. ఇప్పుడు ఉగాది మహోత్సవాలకు సిద్ధమవుతోంది.. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.. ఇతర ప్రాంతాల నుంచి కూడా కొందరు మల్లన్న దర్శనానికి వస్తుంటారు.. ఉగాది మహోత్సవాలకు మాత్రం కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు.. పాదయాత్రగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.. ఈ సందర్భంగా వారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లపై దృష్టిసారించారు అధికారులు.. శ్రీశైలంలో ఈనెల 30వ తేదీ […]
సీఎం కేసీఆర్‌తో కొట్లాడాలనేదే తన విధానమని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ పార్టీ అవుతుందనుకుంటే ఇక్కడే ఉంటానని లేదంటే మరో పార్టీ గురించి ఆలోచిస్తానని చెప్పారు. కేసీఆర్‌కి వ్యతిరేకంగా ఎవరు కొట్లడితే వాళ్లతో ఉండాలని నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.. ఇక, తనకు బాధ్యత అప్పగిస్తే.. పదిమందిని గెలిపిస్తానని చెప్పారు. అదే సమయంలో నాకు పదవి కూడా అక్కర లేదన్న ఆయన.. పది మందిని గెలిపించూ అని బాధ్యత ఇస్తే గెలిపిస్తా అన్నారు… మరోవైపు, పీసీసీ […]
వరుస పరాజయాలు కాంగ్రెస్ ప్రతిష్టను పాతాళానికి నెట్టాయి. కాంగ్రెస్ పూర్తిగా రెండు వర్గాలుగా చీలిపోయింది. ఓ వర్గం సోనియా గాంధీ కుటుంబాన్ని సమర్థిస్తుండగా… పార్టీలో సమూల సంస్కరణలు జరగాల్సిందేనని మరో వర్గం వాదిస్తోంది. ఆదివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ ఏమీ తేల్చలేదు. సోనియా గాంధీనే అధ్యక్షురాలుగా ఉండాలని తాత్కాలికంగా తీర్మానించారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మరికొందరు నేతలన్నారు. పార్లెమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాక… మరోసారి CWC మీటింగ్ జరగనుంది. ఇక బుధవారం నాడు […]
ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో రూపకల్పన చేసిన జగనన్న విద్యా దీవెన మరో విడత మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధం అయ్యారు.. రేపు సచివాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఎకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. Read Also: AICC: కాంగ్రెస్ ప్రక్షాళన.. అధిష్టానం కీలక ఆదేశాలు […]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చాయి… అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు రాకపోవడం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురిచేసే అంశం కాగా… బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.. ఇక, ఈ ఫలితాలను సీరియస్‌గా తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పటికే జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ రాజీనామాకు సిద్ధపడ్డారు.. కాంగ్రెస్ పార్టీ కోసం అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రటించారు. రాజీనామా […]