Hardik Patel: నిన్న కాంగ్రెస్‌కు గుడ్‌బై.. నేడు ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ నిన్న రాజీనామా చేసిన హార్దిక్ పటేల్.. ఇవాళ ఆ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. రాజీనామా చేసిన మరుసటి రోజే కాంగ్రెస్ ‘అత్యంత కులతత్వ పార్టీ’ అంటూ మండిపడ్డారు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘అతిపెద్ద కులతత్వ పార్టీ’ కాంగ్రెస్ అని పేర్కొన్నారు.. రాష్ట్ర పార్టీలో తనకు ఎటువంటి విధులు కేటాయించలేదని ఆరోపించారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు కాగితాలపైనే ఉన్నాయని.. రెండేళ్లుగా నాకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదని మండిపడ్డారు.
మరోవైపు.. కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో బీజేపీలో చేరతారా? అనే ప్రచారం కూడా సాగుతున్న విషయం తెలిసిందే కాగా.. తాను భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరుతానన్న చర్చలను హార్దిక్ పటేల్ తోసిపుచ్చారు. బీజేపీలో చేరే విషయమై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ గురించి హెచ్చరించిన పాటిదార్ నేతలకు క్షమాపణలు చెప్పారు. నేను సీనియర్ పాటిదార్ నాయకులు మరియు స్నేహితులకు క్షమాపణలు చెబుతున్నాను. వారు నన్ను కాంగ్రెస్‌లో చేరవద్దని హెచ్చరించారు.. నేను ఈ రోజు ఆ విషయాన్ని గ్రహించానన్నారు.
Also Read
- PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
ఇక, కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు పాటిదార్ నేత హార్దిక్ పటేల్.. రాహుల్ గాంధీ దాహోద్ ఆదివాసీ సత్యాగ్రహ ర్యాలీలో దాదాపు 25 వేల మంది హాజరయ్యారని, అయితే 70 వేలకు బిల్లు పెట్టారని, కాంగ్రెస్‌లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. రాహుల్ గాంధీ గుజరాత్‌లో పర్యటించినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఒక్క అంశంపై కూడా చర్చ జరగలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తే ఏ చికెన్ శాండ్‌విచ్ ఇవ్వాలో, ఏ డైట్ కోక్ ఇవ్వాలో కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. కుల రాజకీయాలు తప్ప మరేమీ జరగదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!