బంధాలు, అనుబంధాలు ఏమవుతున్నాయి..? శారీరకవాంఛలు ఎటువైపు దారి తీస్తున్నాయి..? వావివరసలు కూడా లేకుండా చేస్తుందా..? చిన్నా పెద్ద తేడా లేనే లేదా..? అంటే.. జరుగుతోన్న కొన్ని ఘటనలు చూస్తే.. సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.. కన్న కూతురిపై, చెల్లిపై, అనే తేడా లేకుండా లైంగిక దాడి ఘటనలు వెలుగు చూస్తుండగా.. తాజాగా జరిగిన ఓ ఘటన షాక్‌కు గురిచేస్తోంది… తన పేగు తెంచుకు పుట్టిన కొడుకునే ఓ మహిళ పెళ్లి చేసుకుందనే షేకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను చుట్టేస్తోంది..
Read Also: LPG prices hiked: మళ్లీ పెరిగిన గ్యాస్ ధర..
ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాజ్‌పూర్‌లో ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.. భార్య, తన కొడుకునే పెళ్లి చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.. అంతే కాదు.. ఇద్దరూ కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు.. ఇంట్లో ఉన్న రూ. రూ.20,000 తీసుకెళ్లారని ఫిర్యాదులో రాసుకొచ్చాడు. ఇక, ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. కానీ, ఉధమ్‌సింగ్ నగర్‌లోని బాజ్‌పూర్‌లో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది..