పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నాకు ఝలక్ ఇచ్చుడు కాదు.. నేనే ఝులక్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నాకు ఝలక్ ఇచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పుకుంటున్నాడు.. ఈ పరిణామంతో నన్ను మరింత హట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నాకు రాజకీయ ఝలక్ రేవంత్ ఇచ్చుడు కాదు.. నేను ఇస్తా అని ప్రకటించారు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మజా ఇంకో పార్టీలో ఉండదన్న ఆయన.. రేవంత్ పై బురద జల్లే […]
కొన్ని దేశాలు మినహా మెజార్టీ దేశాలు తనపై ఆంక్షలు విధిస్తున్నా యుద్ధంపై వెనక్కి తగ్గడం లేదు రష్యా.. 25 రోజులకు పైగా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది.. ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్నా.. ఇక యుద్ధానికి పులిస్టాప్ అంటూ కొంత ప్రచారం సాగుతున్నా.. ఉక్రెయిన్‌పై పట్టుకోసం రష్యా బలగాలు చెమటోడుస్తూనే ఉన్నాయి.. ఉక్రెయిన్ సైన్యం నుంచి కూడా ఇంకా తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు. అయితే, ఇదే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ ప్రేయసిని చిక్కుల్లోకి […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హీట్ పుట్టించిన జగ్గారెడ్డి ఇష్యూ చల్లబడినట్టే అనిపించింది.. అయితే, జగ్గారెడ్డి పదవులకు కోత విధిస్తూ తెలంగాణ పీసీసీ తీసుకున్న నిర్ణయంతో.. మరోసారి పార్టీలో కాక రాజేసినట్టు అయ్యింది.. ఇక, ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మరోవైపు పీసీసీ చర్యపై మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నారు జగ్గారెడ్డి.. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ప్రతినిధులు ఓసారి జగ్గారెడ్డిని ప్రశ్నించారు.. ప్రస్తుతం నాతో భట్టి, ఉత్తమ్ సహా ఎవరూ మాట్లాడట్లేదన్న ఆయన.. […]
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు… దేశవ్యాప్తంగా దుమారం రేపాయి.. రైతులు నెలల తరబడి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగారు.. దీంతో.. కేంద్రం వెనక్కి తగ్గింది. అయితే, ఈ చట్టాలపై సుప్రీం ధర్మాసనం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక బహిర్గతమైంది. సాగు చట్టాలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నందున… వాటిని రద్దు చేయవద్దంటూ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీయడంతో.. వీటిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఈ […]
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత.. పార్టీలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. ఇదే సమయంలో.. ఆయను టార్గెట్ చేసే బ్యాచ్ కూడా పెద్దదే.. క్రమంగా అందరితో కలిసిపోయే ప్రయత్నాలు జరుగుతున్నా.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై డైలాగ్స్ పేల్చడంలో… జగ్గారెడ్డి ముందు వరుసలో ఉన్నారు.. పార్టీ వ్యక్తిగత ఇమేజ్ కోసం రేవంత్ పని చేస్తున్నారంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. సీనియర్స్ సమావేశం తర్వాత… ఏకంగా రేవంత్‌కే సవాల్ విసిరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి […]
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు బైడెన్.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్లో బిజినెస్ లీడర్ల సమావేశంలో మాట్లాడిన బైడెన్.. రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాల తరహాలో భారత్.. రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయలేకపోతోందని, వణుకుతోందని అన్నారు. రష్యా వ్యతిరేక కూటమిలో భారత్‌ను మినహాయించినట్టేనని పేర్కొన్నారు. స్థిరమైన నిర్ణయాలు, అభిప్రాయాలు భారత్‌లో కనిపించట్లేదని చెప్పారు. క్వాడ్‌లో సభ్యత్వం […]
మహిళలపై వరుసగా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.. రోజూ ఏదో ఒక చోటు ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఇక, తమిళనాడులో ఓ వైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది.. తనతో ఉన్న స్నేహితుడిపై దాడి చేసి బెదిరించిన ఆటో డ్రైవర్లు.. ఆ తర్వాత యువ డాక్టర్‌పై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన సంచలనంగా మారింది.. వేలూరు సత్‌వచ్చారిలో జరిగిన ఈ ఘటన విస్మయానికి గురిచేస్తోంది. Read Also: COVID 19: ఆ వేరియంట్‌తో మళ్లీ ముప్పు.. […]
విలయం సృష్టించిన కరోనా మహమ్మారి.. క్రమంగా తగ్గుముఖం పడుతోంది.. ఇదే సమయంలో చైనా సహా మరికొన్ని దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం.. కట్టడా చేసేందుకు లాక్డౌన్ లాంటి చర్యలకు పూనుకోవడం మళ్లీ కలకలం రేపుతోంది.. ఇదే సమయంలో.. కోవిడ్ మహమ్మారిపై అమెరికాలోని శ్వేతసౌధం ముఖ్య ఆరోగ్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.. ఒమిక్రాన్‌కు చెందిన ఉప వేరియంట్ బీఏ.2 కారణంగా అమెరికాలో మరోసారి కరోనా విజృంభిస్తుందని.. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా […]
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా.. కుల మతాలకు అతీతంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. కుల జాఢ్యం ఇంకా వేధిస్తూనే ఉంది.. కులం మత్తులో ఇంకా కొంతమంది ప్రాణాలు తీస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా జరిగిన పరువు హత్య కలకలం సృష్టించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లికి చెందిన గొల్ల నరేంద్ర.. అదే గ్రామంలోని బోయ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు.. వారి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోడంతో.. వారిని ఎదిరించి రెండేళ్ల […]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలతో పాటు.. వంట గ్యాస్ ధరలకు బ్రేక్ పడింది.. అయితే, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో.. భారత్‌లో ఎప్పుడైనా పెట్రో, గ్యాస్ ధరలు పెరుగుతాయనే విశ్లేషణలు ఉన్నాయి. దానికి తోడు.. అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగియడంతో.. ఇక, త్వరలోనే వడ్డింపు అంటూ అనేక వార్తలు వచ్చాయి.. వాటిని నిజం చేస్తూ.. చమురు సంస్తలు భారీ వడ్డింపునకు పూనుకున్నాయి.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగిపోయాయి.. దాదాపు 5 నెలల […]