మావోయిస్టుల కోసం నిరంతరం వేట కొనసాగుతూనే ఉంది.. కూంబింగ్ నిర్వహిస్తూ అడవులను జల్లెడ పడుతూ.. మావోయిస్టులను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.. కొన్ని సందర్భాల్లో వారి నుంచి ప్రతిఘటన కూడా తప్పడంలేదు.. కాల్పులు, ఎదురు కాల్పులు, ఎన్‌కౌంటర్లు.. ఇలా నిత్యం ఏదో ఒక ఘటన వెలుగు చూస్తూనే ఉంది.. అయితే, మావోయిస్టులను పట్టిస్తే భారీగా నజరానాలు ఇస్తామని ప్రకటించింది ఎన్‌ఐఏ.
Read Also: Viral: మహిళను తొక్కి చంపిన ఏనుగు.. అంత్యక్రియలు కూడా అడ్డుకొని..!
ఎన్‌ఐఏ.. కొందరు నేతలపై కోటి రూపాయలకు వరకు రివార్డులు ప్రకటించింది.. మావోయిస్టు పార్టీ నేతలపై జాతీయ దర్యాప్తు సంస్థ రివార్డులు చూస్తే.. ఛత్తీస్‌గఢ్‌లో 2013లో జరిగిన జీరం ఘట్టి దాడిలో ప్రమేయమున్న 21 మందిపై రూ. 1.25 కోట్లకుపైగా రివార్డులు ప్రకటించింది.. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ను పట్టిస్తే అత్యధికంగా రూ .50 లక్షలు రివార్డ్.. కమాండర్ హిడ్మాని పట్టిస్తే రూ .25 లక్షలు ఇస్తామని ఎన్‌ఐఏ తెలిపింది. మావోయిస్టు పార్టీ అగ్ర నేతలుగా ఉన్న తెలుగు మావోయిస్టు అగ్రనేతలు గణపతిపై రూ. కోటి రివార్డు ప్రకటించగా.. బస్వరాజ్ కటకం సుదర్శన్, మల్లోజుల వేణుగోపాల్రావుపై రూ. కోటి చొప్పున రివార్డు ఇవ్వనున్నారు.. ఇక, కేంద్ర కమిటీ సభ్యుడు, కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి, పాక హన్మంతు అలియాస్ ఊకే గణేష్‌పై రూ . 7 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది ఎన్‌ఐఏ.