దేశంలో ప్రైవేటీకరణల పర్వం కొనసాగుతూనే ఉంది.. కొన్ని సంస్థలు, బ్యాంకులను విలీనం చేసిన ప్రభుత్వం.. మరికొన్ని సంస్థలను, బ్యాంకులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది.. ఇక, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ), ప్రభుత్వ భాగస్వామ్యంలోని ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం.. అందులో భాగంగా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి రోడ్ షోలు నిర్వహించనున్నట్లు ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కరడ్ వెల్లడించారు.. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు గతేడాది మేలోనే ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ […]
నవజ్యోత్ సింగ్ సిద్ధూ పీసీసీ చీఫ్‌గా ఉన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.. అధికారంలో ఉన్న పార్టీ.. ఏ మాత్రం గట్టి పోటీ ఇవ్వలేని పరిస్థితి.. దీంతో.. అధిష్టానం ఆదేశాలతో తన పదవికి రాజీనామా చేశారు సిద్ధూ.. మరోవైపు.. సిద్ధూను ఓ పాత కేసు వెంటాడుతోంది… 34 ఏళ్ల నాటి కేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూను కేవలంలో రూ. 1000 జరిమానాతో విడిచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను విచారణకు […]
మేషం : ఈ రోజు ఈ రాశివారికి మీ లక్ష్య సాధనలో ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారస్తులు దస్త్రం వ్యవహారంలో క్షణం తీరిక ఉండదు. అధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. విద్యార్థులకు అతి ఉత్సాహం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయనాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. అక్కౌంట్స్ […]
దేశవ్యాప్తంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై పెద్ద చర్చ సాగుతోంది.. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన కాశ్మీరీ పండిట్ల బాధను చెప్పే ఈ చిత్రంపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా లేకపోలేదు.. దాదాపు 12 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూలు చేసింది.. ఈ చిత్రంపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రశంసలు కురిపించారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సినిమాపై మండిపడ్డారు.. ఇవాళ తెలంగాణ భవన్లో […]
బోధన్ ఇష్యూ ఇప్పుడు చర్చగా మారింది.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బంద్ వరకు వెళ్లింది పరిస్థితి.. దీంతో 144 సెక్షన్ విధించిన పోలీసులు.. స్థానికేతరులను ఎవ్వరినీ బోధన్‌లోకి రానివ్వకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి.. తనిఖీలు చేస్తున్నారు.. అయితే, బోధన్ అల్లర్ల వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఆ అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని తేల్చారు పోలీసులు.. శివసేనకు చెందిన గోపి అనే వ్యక్తి హస్తం ఉన్నట్టుగా గుర్తించారు. Read Also: Muralidhar Rao: తెలంగాణ […]
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, ఎంఐఎం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీధర్‌రావు.. బోధన్‌లో నెలకొన్ని పరిస్థితులు, బంద్.. తదితర అంశాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ.. భారత దేశంలో ఉందా..? లేక పాకిస్థాన్‌లో ఉందా..? అని నిలదీశారు.. కేసీఆర్ తన మహారాష్ట్ర పర్యటనలో ఛత్రపతి శివాజీని పొగిడారు.. కానీ, నిన్న బోధన్‌లో శివాజీ విగ్రహం అంశంలో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి హిందువులపై దాడి చేశాయని ఆరోపించారు.. ఇక, దాడులకు […]
కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేయడం.. ఆస్తి పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు చేయడం.. ఇలా పలు రకాల పన్నుల విషయంలో.. అధికారులు తీసుకుంటున్న చర్యలు కొత్తకాకపోవచ్చు.. కానీ, చెత్త పన్ను, ఆస్తి పన్ను పేరిట అధికారుల వేధింపులు పెరిగిపోయాయని.. పన్నుల వసూలు పేరిట జనం పట్ల అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారని.. చెత్త పన్ను కట్టలేదంటూ కర్నూలు జిల్లాలో దుకాణాల ముందు చెత్త వేయడం.. ఆస్తి పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు చేస్తామంటూ ప్రచారం చేయడం.. కరెంట్ […]
ఉక్రెయిన్‌లోని ఎయిర్ పోర్టులు, షిప్ యార్డులపైనే కాదు ప్రజల ఇళ్లు, ఆసుపత్రులు, స్కూళ్లపైనా రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా మరిమాపొల్లోని ఓ ఆర్ట్ స్కూల్‌పై బాంబులతో దాడి చేశాయి. దాదాపు 400 మంది తలదాచుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. అయితే ఇలాంటివన్నీ యుద్ధ నేరాలేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. యుద్ధంలో తొలిసారిగా మొన్న ఓ ఆయుధాగారంపై కింజాల్ హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా.. నిన్న సైతం […]
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నెలకొంది.. రోజు రోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. దిగుమతులు చేసుకోలేని దుస్థితికి చేరుకోవడంతో కొలంబలో పేపర్ నిల్వలు అయిపోయాయి. దీంతో ప్రభుత్వం కనీసం విద్యార్థులకు పరీక్షలు కూడా నిర్వహించలేకపోతోంది. నేటి నుంచి జరగాల్సిన టర్మ్ పరీక్షలను నిరవధికంగా వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నా పత్రాల తయారీకి సరిపడా పేపర్, ఇంక్‌ను దిగుమతి చేసుకోవడానికి విదేశీ మారకద్రవ్యం లేని కారణంగా పరీక్షలను నిర్వహించలేకపోతున్నామని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో దేశంలోని మొత్తం 45 […]