ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్‌కు నిరాశ ఎదురైంది. 10-21, 15-21 తేడాతో టాప్‌సీడ్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. 53 నిమిషాల పాటు జరిగిన తుది పోరులో అక్సెల్సెన్కు దీటైన పోటీనివ్వడంలో విఫలమయ్యాడు. ఇటీవల జరగిన జర్మనీ ఓపెన్‌లో ఈ డెన్మార్క్ షట్లర్‌ను మట్టికరిపించిన సేన్.. మరోమారు ఆ స్థాయి ప్రదర్శన కనబరుస్తాడని ఆందరూ ఊహించారు. కానీ, అక్సెల్సన్ ఎక్కడా అవకాశమివ్వకుండా చెలరేగాడు. తన అనుభవన్నంతా రంగరిస్తూ డ్రాప్ షాట్లు, పదునైన స్మాష్‌లతో […]
పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. పెగాసెస్ వ్యవహారంపై చేసిన కామెంట్లు ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పుట్టించాయి.. ఇప్పటికే ఈ వ్యవహారంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. అయితే, ఏపీ అసెంబ్లీలోనూ పెగాసెస్ ప్రస్తావన వచ్చింది… చంద్రబాబు పెగాసెస్ స్పై వేర్‌ను వినియోగించారన్న మమతా బెనర్జీ కామెంట్లపై చర్చకు సిద్ధమైంది అధికార వైసీపీ.. అయితే, పెగాసెస్ పై చర్చకు నోటీసివ్వాలన్న స్పీకర్ తమ్మినేని సూచించగా… ఇప్పటికే నోటీసు ఇచ్చినట్టు చీఫ్ విప్ […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనడం.. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం నిత్యం జరుగుతోంది.. ఇక, ఇవాళ కూడా జంగారెడ్డిగూడెం మరణాల అంశంపై సభలో చర్చకు పట్టుపట్టారు ప్రతిపక్ష సభ్యులు.. స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు.. జంగారెడ్డి గూడెం మరణాలపై జుడీషియల్ విచారణకు డిమాండ్ చేశారు.. అయిలే, మార్షల్స్ సహకారంతో సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లేటట్లు చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. కానీ, బల్లలు చేరుస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆందోళనల మధ్య కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రతీ రోజు శాసన సభలో టీడీపీ సభ్యులు ఆందోళన చేయడం… వారిని సభ నుంచి సస్పెండ్ చేయడం నిత్యం కొనసాగుతోంది.. అయితే, ఈ మధ్య త్వరలోనే తెలుగు దేశం పార్టీ బండారం బయట పెడతా? అంటూ అసెంబ్లీలో ప్రకటించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఇక, ఇవాళ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇవాళే టీడీపీ బండారం బయటపెడతానని ప్రకటించారు.. ఎన్టీఆర్ తీసుకుని వచ్చిన మద్యపాన నిషేదాన్ని […]
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి కోల్పోయే ప్రమాదం ఉన్న ఆయన భారత ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఖైబర్ ఫక్తూన్వాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఇమ్రాన్ ఖాన్.. భారత ఆర్మీ భేషుగ్గా పని చేస్తుందని మెచ్చుకున్నారు. భారత ఆర్మీ.. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదన్నారు. ఇక భారత్.. ఏ ఒత్తిళ్లకూ తలొగ్గని దేశమని, విధానాలు సక్రమంగా ఉండటం వల్లే తటస్థ వైఖరి అవలంభిస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇక, భారత్ ఎప్పుడూ స్వతంత్ర విదేశాంగ […]
కేంద్రంపై మరోసారి పోరుకు సిద్ధమైంది టీఆర్ఎస్ పార్టీ.. టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై చర్చించనున్నారు. యాసంగి ధాన్యాన్ని వందశాతం కేంద్రం ప్రభుత్వం సేకరించేలా ఒత్తిడిచేసేందుకు చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అటు పార్లమెంట్లో కూడా ఏం చేయాలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. Read Also: […]
సర్పంచ్ అంటే ఊరిలోని ప్రజలందరికీ రక్షణగా నిలవాల్సిన వ్యక్తి.. కానీ, అతడే వేధింపులకు పాల్పడుతున్నాడు.. ఒకే కుటుంబంలోని ముగ్గురు బాలికలను వేధింపులకు గురిచేశాడు.. ఇక, తమను వేధిస్తున్నాడని అతని ఇంటిముందు నిరసనకు దిగిన యువతి ముక్కు కోసిన దారుణమైన ఘటన బీహార్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుపౌల్ జిల్లా లోధ్లో గ్రామ సర్పంచ్ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ముగ్గురు యువతులు ఆరోపించారు. అతని ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీంతో కోపంతో ఊగిపోయిన సర్పంచ్ ఓ […]
తెలంగాణలో కొలువుల జాతర ప్రారంభం కాబోతోంది.. రాష్ట్రవ్యాప్తంగా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయబోతున్నామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. ఒకేసారి 91 వేలకుపైగా ఉద్యోగాల భర్తీని ప్రకటించిన ఆయన.. వరుసగా నోటిఫికేషన్లు ఉంటాయని వెల్లడించారు.. ఇక, పలు జిల్లాల్లో నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నారు.. ఆరు నెలలు సినిమాలకు, సోషల్ మీడియాకు, మొబైల్ ఫోన్లకు.. దూరంగా ఉండడం.. కష్టపడండి.. మీ తల్లిదండ్రుల కలను […]
వ్యాపారం ఏదైనా అంబానీల తర్వాతే.. ఏ వ్యాపారం చేసినా.. దానిని లాభాల బాట పట్టించడంలో ముఖేష్ అంబానీ ముందు వరుసలో ఉంటారు.. తన సోదరుడు కొన్ని వ్యాపారాల్లో విఫలం అయినా.. ముఖేష్ మాత్రం పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా సాగుతోంది.. అదే ఆయనను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలోనూ చేర్చింది.. తాజాగా, మరో దిగ్గజ సంస్థ రిలయన్స్ చేతికి వచ్చింది.. ప్రీమియం లోదుస్తుల రిటైల్ సంస్థ క్లోవియాలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. […]