తెలంగాణ హైకోర్టుకు నియమితులైన పది మంది కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం పూర్తి అయ్యింది.. హైకోర్టు హాల్లో 10 మంది నూతన జడ్జీలతో ప్రమాణస్వీకారం చేయించారు హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ.. దీంతో హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది.. ప్రస్తుతం 19 మంది జడ్జీలు సేవలు అందిస్తుండగా.. వారికి కొత్త న్యాయమూర్తులు 10 మంది అదనంగా వచ్చిచేరారు.. నూతన న్యాయమూర్తులుగా కాసోజు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, కుచాడి శ్రీదేవి, ఎన్. […]
ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం… తమ వక్రబుద్ధి మార్చుకోవడం లేదు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత… బాలికల విద్యకు ప్రాధాన్యత ఇస్తామని హమీ ఇచ్చింది. తమ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించడం కోసం… పలు సంస్కరణలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించారు. ఆక్రమణ తర్వాత అనేక నిబంధనలతో బాలికలు చదువుకు దూరమయ్యారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవడంతో… తాలిబన్లు మాట మార్చేశారు. బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించబోమని.. ఆరో తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు ప్రకటించారు. Read […]
పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. తన టీమ్‌తో కలిసి వరుసగా వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో సమావేశాలు అవుతూ.. రాష్ట్రంలో ఉన్న సదుపాయాలు.. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు వివరించి.. పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు.. ఇప్పటికే వివిధ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందు రాగా.. తాజాగా, తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రాబోతోంది.. తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ఫిష్ ఇన్ (FishInn) కంపెనీ సిద్ధమైంది.. ప్రపంచంలోనే అత్యధికంగా […]
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఇవాళ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు వెళ్లనున్నారు.. కుటుంబ సభ్యులతో కలిసి కొల్హాపూర్ వెళ్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఫ్యామిలీ బయల్దేరనుంది.. ఇక, కుటుంబసభ్యులతో కలిసి కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు.. మహలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం కేసీఆర్.. ఆ తర్వాత సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.. కాగా, ఇప్పటికే దేశంలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు కేసీఆర్… […]
పశ్చిమ బెంగాల్లో మరోసారి హింస జరిగింది.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింస చోటు చేసుకుంది.. దీనిపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.. ఇక, ఇప్పుడు బీర్భూం జిల్లా రామ్‌పుర్ హాట్ రాజకీయ హింసపై, అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. పట్టణ శివారులోని బోగ్టూయి గ్రామంలో ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై ఇద్దరు చిన్నారులతో పాటు ఎనిమిది మంది సజీవ దహనం కావడం విషాదం నింపింది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన […]
పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై వ్యతిరేకత తీవ్రమైంది. అధికార కూటమి నుంచి ప్రధాన భాగస్వామ్య పార్టీలు తప్పుకోనున్నాయి. ప్రతిపక్షంలో చేరి ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. నాలుగేళ్ల ఖాన్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఎక్కువ కావడంతో మిత్రపక్షాలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేపు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనున్నారు ఇమ్రాన్ ఖాన్. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రాజీనామా చేయనని ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. తనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ […]
అంతరిక్షంలో తరచూ కొన్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.. కొన్ని గ్రహశకలాలు భూమిపైకి దూసుకొస్తాయి.. కొన్ని సార్లు ప్రమాదం జరిగినా.. చాలా సార్లు ప్రమాదాలు తప్పాయి.. అయితే, అంతరిక్షం నుంచి మరో ప్రమాదం రాబోతోంది.. ఒక గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది. ఈ గ్రహశకలం 450 మీటర్ల వెడల్పు ఉందని చెప్పింది. మిగతా గ్రహశకలాలతో పోలిస్తే దీని సైజు అంత భయపడాల్సినది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఇది ప్రయాణించే […]
కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ సర్కార్‌పై రెండు వైపుల నుంచి ఒత్తిడి చేస్తోంది తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ… ఓవైపు ధాన్యం, బియ్యం సేకరణపై ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి.. ఒత్తిడి తెచ్చే ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు.. గల్లీలోనూ బీజేపీపై పోరు సాగిస్తోంది.. గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలపై నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. […]
నేడు కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో తెలంగాణ మంత్రులు, ఎంపీల భేటీ, మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం.. ధాన్యం సేకరణపై చర్చ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలుపు, నేడు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నేడు ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న పంజాబ్ సీఎం భగవంత్‌మాన్… తొలిసారి మర్యాదపూర్వకంగా ప్రధానితో భేటీ నేటి నుంచి హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2022 షో, నాలుగు రోజుల పాటు పలు రకాల […]