Konda Vishweshwar Reddy: బీజేపీలో చేరనున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..! ఈసారి పక్కా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం మరోసారి తెరపైకి వచ్చింది.. గత కొంతకాలంగా విశ్వేశ్వర్‌రెడ్డి చేరికపై వార్తలు వస్తూనే ఉన్నాయి.. అధిష్టానం నుంచి పెద్ద లీడర్లు ఎవరు రాష్ట్రానికి వచ్చినా.. ఆయన సమక్షంలో కొండా బీజేపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం సాగుతూ వచ్చింది.. ఈ మధ్య పాదయాత్రలో ఉన్న బండి సంజయ్‌ని కలిశారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చిన నేపథ్యంలో.. ఆయన బీజేపీలో చేరడం ఖాయమనే చర్చ సాగింది.. ఇక, కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేసిన తర్వాత.. అనేక సార్లు బీజేపీ నేతలు ఆయన్ను కలుస్తూ వచ్చారు.. ఇవాళ బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో సమావేశం అయ్యారు.. బీజేపీలో చేరాలని ఆహ్వానించారు.
ఇక, ఆయన బీజేపీలో చేరేందుకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.. హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనుండగా.. ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. అయితే, జులై 2వ తేదీన జేపీ నడ్డా సమక్షంలో.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. కొండా సానుకూలంగా స్పందించినట్టు బీజేపీ వర్గాలు చెబుతుండగా.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది.. అయితే, మంచి రోజు చూసుకుని పార్టీ కండువా కప్పుకుంటానని హామీ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుండగా.. ఎల్లుండి ఆయన బీజేపీలో చేరతారా? మరికొంత సమయం తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.. కానీ, ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడం మాత్రం ఖరారైనట్టు చెబుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?