ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త వ్యవహారం సంచలనంగా మారిపోయింది… నిత్యం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ.. సోషల్‌మీడియాలోను ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడుతుంటాడు సాయి గణేష్… వచ్చే నెల నాలుగో తేదీన పెళ్లి జరగాల్సి ఉంది.. కానీ, ఇంతలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి గణేష్ చనిపోవడంతో.. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సాయి గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి […]
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరపనున్నారు. పార్టీ 22వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ఇతర మండలస్థాయి ప్రతినిధులకు ఆహ్వానం ఉంటుంది. ఇటు ప్రత్యేక ఆహ్వానితులుగా.. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. Read Also: COVID 19: కరోనాకు కొత్త మందు.. స్ప్రేతో […]
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తి స్థాయిలో కోలేకోలేదు.. కొన్ని దేశాల్లో తగ్గుముఖం పట్టినా.. మరికొన్ని దేశాల్లో దాని విజృంభణ కొనసాగుతూనే ఉంది.. కఠిన ఆంక్షలు, లాక్డౌన్లతో సామాన్యులు అల్లాడిపోతూనే ఉన్నారు.. అయితే, కరోనాను కట్టడి చేసేందుకు రకరాల వ్యాక్సిన్లు, పౌండర్లు.. ఇలా అందుబాటులోకి వచ్చాయి… సింగిల్ డోస్, డబుల్ డోస్.. బూస్టర్ డోస్ వేయించుకోవాల్సిన పరిస్థితి.. ఇప్పుడు కొత్తగా ఓ స్ప్రేను రూపొందించారు.. ఆ స్ప్రేను పీలిస్తే చాలు.. కరోనా దరిచేరదని చెబుతున్నారు […]
మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులతో ఓ యువకుడు ప్రాణాలు తీసుకోవడం ఖమ్మం జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి.. దీనిపై సీరియస్‌గా స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మంత్రి పువ్వాడ, బాధ్యులైన పోలీసులు, నాయకులపై హత్య కేసు నమోదు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.. మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయకపోవడం సిగ్గు చేటన్న ఆయన.. సీఎంవో నుండి వచ్చిన ఆదేశాలవల్లే కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు.. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు.. నమ్మిన సిద్ధాంతం […]
యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టిస్తోంది.. రెండు రోజుల క్రితం అదృశ్యమైన సస్పెన్షన్‌కు గురైన హోంగార్డు రామకృష్ణ మృతదేహమై కనిపించడంతో కుటుంబసభ్యులు షాక్ తిన్నారు.. అయితే, రామకృష్ణ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది… కొన్ని నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న రామకృష్ణ.. రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు.. అయితే, రామకృష్ణని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు.. Read […]
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంతబుతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, ఆదివారం దినఫలాలు.. ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంది..? ఎవరు తమ పనుల్లో ముందుకు సాగొచ్చు..? ఎవరు వాయిదా వేసుకుంటే బెటర్..? ఏ రాశివారికి ఆదివారం రోజు ఎలా ఉంటుంది..? లాంటి వివరాలను తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=D83nJUn3JXI
తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. ఉమ్మడి ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. మరోవైపు.. హైదరాబాద్ సహా మరికొన్ని జిల్లాల్లో వాతావరణం మారిపోయింది.. వర్షాలు కురుస్తున్నాయి.. ఎండలు, ఒక్కపోత నుంచి ఉపశమనం కలిగిస్తూ.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. […]
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది.. కొలంబియా పోలీస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రం కొలంబియా సిటీలోని ఓ షాపింగ్ మాల్‌లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.. అయితే, ఈ కాల్పుల్లో ఎవరూ చనిపోలేదని, అయితే మొత్తం 12 మందికి గాయాలయ్యాయని.. బాధితుల వయస్సు 15 మరియు 75 మధ్య ఉంటుందని.. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం […]
హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి స్ట్రీట్ ఫైట్ వ్యవహారం కలకలం సృష్టించింది… ఈ సారి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని అంధేరి గల్లీలో మసీదు నుంచి తిరిగి వెళ్తున్న ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది.. ఈ ఘర్షణలో 15 ఏళ్ల నవాజ్ అహ్మద్ అనే యువకుడు మృతి చెందాడు… స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.. ఇక, యువకుడి […]
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు.. వివిధ వస్తువల ధరలు, వంటనూనె ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.. అన్నింటి పెరుగుదలపై పెట్రో ధరల ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట… పెట్రో ధరలు పైకి ఎగబాకడంతో.. రవాణా ఛార్జీలు పెరిగి.. దాని ప్రభావం అన్నింటిపై పడుతుందని వెల్లడిస్తున్నారు.. అయితే, ఈ నెలలో ఇంధన వినియోగం బాగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగడమే ఇందుకు కారణంగా విశ్లేషిస్తున్నారు.. మార్చి 2022 […]