రోజుకో కొత్త తరహాలో డ్రగ్స్‌ను తరలిస్తున్నారు స్మగ్లర్లు.. ప్యాసింజర్ విమానాల్లో డ్రగ్స్ తరలిస్తూ వరుసగా దొరికిపోతున్న ఘటనలు చాలా ఉండగా.. ఉప్పుడు.. కార్గోను ఎంచుకున్నారు.. అది కూడా పసిగట్టిన డీఆర్ఐ అధికారులు.. ఢిల్లీ అంతర్జాతీయ కార్గోలో భారీగా డ్రగ్స్ పట్టివేశారు.. రూ.434 కోట్ల విలువ చేసే హెరాయిన్ సీజ్ చేశారు డీఆర్ఐ అధికారులు.. ఉగాండా నుండి ఢిల్లీ వచ్చిన ఓ భారీ పార్శిల్లో హెరాయిన్‌ను గుర్తించారు. తెల్లటి హెరాయిన్‌ను ట్రాలీ బ్యాగ్‌ల కింద దాచి తరలించే ప్రయత్నం […]
యూరప్ పార్లమెంట్లో జరిగిన ఓ ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది.. యురోపియన్స్తో పాటు.. నెటిజన్లు ఆ వీడియోపై అక్కడ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు.. ఐరోపా భవిష్యత్ ఇదేనా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ.. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇంతకీ పార్లమెంట్లో ఏం జరిగిందనే విషయానికి వస్తే.. యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయంలోని ఐరోపా పార్లమెంట్లో ఇటీవల 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు.. దేశ భవిష్యత్‌పై చర్చించారు.. అయితే, సమావేశాల చివరి రోజైన […]
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ క్రమంగా తీరం వైపు దూసుకొస్తుంది.. అయితే, అసని కదలికలో వేగం తగ్గింది.. నెమ్మదిగా కదులుతోందని విపత్తుల సంస్థ ప్రకటించింది.. అసని తుఫాన్‌పై తాజా బులెటిన్ విడుదల చేశారు ఏపీ విపత్తుల సంస్థ డైరెక్టర్ డా. బీఆర్ అంబేద్కర్.. అసని రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడుతుందని పేర్కొన్నారు.. గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదిలిందని.. మూమెంట్ నెమ్మదిగా ఉందన్నారు.. ప్రస్తుతం మచిలీపట్నానికి 40 కిలోమీటర్లు, నరసాపురంకు […]
భార్యతో బలవంతపు శృంగారం నేరమా? మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)ని నేరంగా పరిగణించాలా? అనే విషయం ఢిల్లీ హైకోర్టు భిన్న తీర్పును వెలువరించింది.. భార్యతో బలవంతపు శృంగారం నేరమే అవుతుందని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ రాజీవ్ షక్దేహర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే, బెంచ్‌లోని మరో న్యాయమూర్తి జస్టిస్ హరిశంకర్ మాత్రం ఆ ఆదేశాలతో విభేధించారు.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21లను సెక్షన్ 375(మినహాయింపు 2) ధిక్కరిస్తుందనడానికి ఎలాంటి మద్ధతు కనిపించడం […]
దేశంలో కరోనా నాలుగో వేవ్ రాకపోవచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వైరస్ సోకడంతో ప్రజలకు సహజ రోగనిరోధక శక్తి లభించింది. ఐఐటీ కాన్పూర్ సూత్ర మోడల్ ప్రకారం… 90 శాతం మంది భారతీయులకు ఈ సహజ నిరోధకత లభించినట్లు వెల్లడించింది. ఇటీవల కేసులు పెరిగినా… ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొత్త వేరియంట్ వెలుగులోకి వస్తే, నాలుగో వేవ్‌కు అవకాశం ఉంటుంది. అంతేకానీ… వైరస్ తీవ్రతను తగ్గించుకునేందుకు టీకా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. Read Also: […]
ఉక్రెయిన్‌పై రష్యా… 70 రోజులకుపైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. సైనిక చర్య పేరుతో దండయాత్ర మొదలుపెట్టిన క్రెమ్లిన్… ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతోంది. క్షిపణుల వర్షం కురిపిస్తుండటంతో… భవనాలు నేలమట్టమవుతున్నాయి. వాటి కింద ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్ ప్రధాన నగరాల్లో ఒకటైన ఖర్కివ్‌లో రెండు నెలల క్రితం రష్యా ఓ భవనంపై బాంబులు వేసింది. శిథిలాల తొలగిస్తున్న ఉక్రెయిన్ సైన్యం…44 మృతదేహాలను ఆలస్యంగా గుర్తించింది. Read Also: Mahmood Ali : 3 నెలల్లో […]
శ్రీలంకలో నిరసనకారులను అణిచివేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ప్రజా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే వారిపైనా, హాని కలిగించే వారిపైనా కాల్పులు జరిపేందుకు భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఎలాంటి వారెంట్లు లేకుండా అరెస్ట్ చేసేందుకు అనుమతినిచ్చింది. ఎమర్జెన్సీ గుప్పిట్లో కొనసాగుతున్న శ్రీలంకలో సైన్యానికి, పోలీసులకు మరిన్ని అధికారాలు కల్పించారు. ఆందోళనకారులు హింసాత్మక సంఘటనలకు పాల్పడడం పట్ల శ్రీలంక ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. శ్రీలంకలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభంతో మండిపడుతున్న ప్రజలు… […]
తనకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి లేఖ రాశారు టీడీపీ ఏపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.. సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్లు, ఇతర క్రిమినల్స్‌తో తనకు ప్రాణాపాయం ఉందని లేఖలో పేర్కొన్న అచ్చెన్న… ప్రస్తుతం తనకు కల్పిస్తున్న 1+1 భద్రతను 4+4 కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.. ఇక, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టే క్రమంలో తాను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నానన్న అచ్చెన్నాయుడు… రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా, టీడీఎల్పీ ఉప నేతగా వ్యవహరిస్తున్నందున […]
అసని తుఫాన్ ఏపీపై విరుచుకుపడుతోంది… ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. తీరం వైపు అసని దూసుకొస్తుండడంతో ఆ ఎఫెక్ట్ తీర ప్రాంతాలపై పడుతోంది.. ఇక, రేపు తీరం దాటనున్న నేపథ్యంలో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది.. ప్రస్తుతం కాకినాడకు ఆగ్నేయ౦గా 210 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది అసని తీవ్ర తుఫాన్.. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ముందుకు […]