టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూర్ జయరాం.. కర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కలియుగ రావణాసురులు చంద్రబాబు, లోకేష్ అంటూ మండిపడ్డారు.. రాష్ట్రంలో కొందరిని శూర్పణఖలను తయారు చేసిన ఘనత చంద్రబాబుదేనంటూ ఎద్దేవా చేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్ అని ఎస్పీ విచారణలో తేలిందని స్పష్టం చేసిన మంత్రి.. అయినా, ఆ వ్యవహారంలో ఇంకా వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబుకు అమ్మాయిలను రాజకీయంగా వాడుకోవడం తెలుసు తప్ప ఆదుకోవడం తెలియని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి జయరాం.. చంద్రబాబు రాజకీయాలకు అమ్మాయిలు బలికావొద్దు అని విజ్ఞప్తి చేశారు.. కాగా, ఎంపీ గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో కాల్ లీక్ వ్యవహారం.. ఏపీ నుంచి ఢిల్లీకి చేరిన విషయం తెలిసిందే.. ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్లగా.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది.
Read Also: Karthikeya 2 Movie Review : కార్తికేయ -2 రివ్యూ