స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దిశగా చర్యలు చేపట్టాకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. రాజమండ్రిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… ఆజాదీ కా అమృత మహోత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహిస్తోందన్నారు.. మహనీయులను స్మరించడం మానుకొని, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా సొంత ప్రచారం చేసుకుంటున్నారు.. ఇప్పటికైనా మానుకోవాలని సూచించిన ఆయన.. అనవసరమైన వాటికి రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తోందని.. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మంత్రి ఆర్కే రోజా తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు..
Read Also: Asia Cup 2022: భారత్, పాక్ జట్లకు కష్టాలు..!
ఇక, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవడంలేదని విమర్శించారు జీవీఎల్.. తెలుగు భాషా అభ్యున్నతికి కృషి చేసిన రాజరాజనరేంద్రుడిని, శ్రీకృష్ణదేవరాయులను గుర్తించాలని డిమాండ్ చేశారు.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ దిశగా చర్యలు చేపట్టాకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు జీవీఎల్.. మహనీయులను స్మరించకపోతే తెలుగు భాషా చరిత్ర కనుమరుగు చేసేలా కుట్ర జరుగుతుందని భావిస్తున్నాం అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే కేంద్రంతో తట్టిలేపుతాం అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కాగా, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనేది భారతదేశాని కి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావడాన్ని స్మరించుకొనేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాల శ్రేణి కి పెట్టిన పేరు. ఈ మహోత్సవాన్ని ప్రజల భాగస్వామ్య భావనతో ఒక జన ఉత్సవం రూపంలో నిర్వహించడం జరుగుతోన్న విషయం తెలిసిందే.