తెలంగాణలో ప్రియాంకా గాంధీని రంగంలోకి దిపుతోంది కాంగ్రెస్ అధిష్టానం.. తెలంగాణ మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు ఆమెకు అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. ప్రస్తుతానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన పూర్తిస్థాయి బాధ్యతలను ఆమె అప్పగించనున్నారు.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ అధిష్టానం.. దీంతో, ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాగూర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తారనే చర్చ సాగుతోంది.
Read Also: Komatireddy Venkat Reddy: సారీ కాదు.. సస్పెండ్ చేయాల్సిందే..!
మునుగోడు ఎన్నికకు ముందే మాణిక్యం ఠాగూర్ స్థానంలో ప్రియాంక గాంధీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. వారం రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు జరుగుతుందనే చర్చ సాగుతోంది.. దీనిపై ఓ సీనియర్ నేత దగ్గర చర్చ సాగినట్టు ప్రచారం సాగుతోంది. అయితే, తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ దాదాపు ఒకే పరిస్థితి కొనసాగుతూ వస్తోంది… కర్ణాటకలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య పోసకడం లేదు.. కొన్నిసార్లు పరిస్థితి సర్దుకున్నట్టుగా కనిపించినా.. మళ్లీ అదే పరిస్థితి వస్తుంది.. ఇక, తెలంగాణలో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కొందరు సీనియర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ఈ మధ్యే కాంగ్రెస్‌ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. రేవంత్‌ను టార్గెట్ చేయగా.. దాసోజు శ్రవణ్ కుమార్ కూడా పార్టీని వీడుతూ.. రేవంత్‌పై ఆరోపణలు చేశాడు.. ఇప్పుడు పార్టీలోనే ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పీసీసీ చీఫ్‌పైనే గురిపెట్టారు.. అయితే, తెలంగాణలో పార్టీ నేతల మధ్య సఖ్యత కుదుర్చడంలో.. వారిని సమన్వయం చేయడంలో ఠాగూర్ విఫలం అయ్యారని భావిస్తోన్న అధిష్టానం.. దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు ప్రియాంకకు అప్పగించనున్నారని తెలుస్తోంది.