మంగళవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం కొత్త రికార్డులు సృష్టించింది.. ఏప్రిల్‌లో 15.08 శాతంగా ఉన్న టోకు ధరల సూచీ… మే నెలలో రికార్డు స్థాయిలో 15.88 శాతానికి ఎగబాకింది. ఇంధన, ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.. Read Also: Honour killing: పరువు పోయిందని.. నవదంపతుల దారుణ హత్య.. ఇక, ఆహార వస్తువులు మరియు ముడి చమురు ధరలు […]
అభివృద్ధిలో.. టెక్నాలజీతో పోటీ పడుతూ అంతా పరుగులు పెడుతున్నా.. ఇంకా మతం, కులం లాంటివి అడ్డుగోడలుగా నిలిస్తున్నాయి.. పరువు తీశారని.. ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.. కులాంతర వివాహం చేసుకున్నా.. మతాంతర వివాహం చేసుకున్నా జీర్ణించుకోలేక వెంటాడి వెంబడించి చంపేస్తున్నవారు కొందరైతే.. నమ్మించి గొంతుకోసే దారుణమైన మనుషులు కూడా ఉన్నారు.. తాజాగా, తమిళనాడులో జరిగిన డబుల్ మర్డర్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. Read Also: Presidential poll: దీదీ సమావేశానికి కేసీఆర్ దూరం.. కారణం […]
ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ సాగుతోంది.. ఓవైపు ఎన్డీఏ తరఫున అభ్యర్థిని నిలిపేందుకు భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తుండగా… విపక్షాలు సైతం ఒకే అభ్యర్థిని పోటీకి పెట్టాలన్న ప్లాన్‌లో ముందుకు సాగుతున్నాయి.. అందులో భాగంగా రేపు ఢిల్లీ వేదికగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కీలక భేటీ జరగబోతోంది. మరోవైపు.. ఎన్డీఏ అభ్యర్థి నితీష్ కుమారే అంటూ ప్రచారం సాగుతోంది.. బీహార్ సీఎంను.. ఎన్డీఏ తమ రాష్ట్రపతి అభ్యర్థిగా […]
రాష్ట్రపతి ఎన్నికల తరుణంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఓవైపు థర్డ్ ఫ్రంట్, కొత్త పార్టీ ఏర్పాటు వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తుంటే.. మరోవైపు.. ఎన్డీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో పడిపోయారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. దీనికోసం ఈ నెల 15న ఢిల్లీ వేదికగా కీలక సమావేశం నిర్వహించనున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని విపక్షాలకు పిలుపునిచ్చిన దీదీ.. తాను ఏర్పాటు చేసే సమావేశానికి రావాల్సిందిగా 22 […]
కొన్ని సార్లు మంచి చేసే ఉద్దేశంతో ఏదైనా చేసినా.. అది కొందరికి నచ్చక పోవచ్చు.. అది నేరం కూడా కావొచ్చు.. మరోవైపు, మనం చేసే పని ఇరుగు పొరుగువారికి నచ్చకపోయినా చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదు.. అందుకు ఉదాహరణే అమెరికాకు చెందిన ఓ 70 ఏళ్లు దాటిన వ్యక్తికి ఎదురైన అనుభవం.. ఇంతకీ ఆయన చేసిన నేరం ఏంటంటే.. తన ఇంటి దగ్గర పక్షుల ఆహారం పెట్టడమే.. అదే అతడిని జైలుకు వెళ్లేలా చేసింది.. ఈ వ్యవహారం […]
మళ్లీ పంజా విసురుతోంది కరోనా మహమ్మారి.. దానికి వ్యాక్సినేషన్‌తోనే చెక్ పెట్టాలని అనేక పరిశోధనలు తేల్చాయి.. దీంతో, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.. భారత్‌లోనూ భారీ సంఖ్యలో వ్యాక్సిన్ల పంపిణీ జరిగింది.. కొన్ని దేశాల్లో మందకొడిగానే ఉంది. మరోవైపు, కొత్త వేరియంట్లు, కొత్త వేవ్‌లో పుట్టుకొస్తూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. కరోనా వేవ్‌లు, బూస్టర్ డోస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్.. 4-6 నెలలకు ఒక […]
సహజీవనానికి సంబంధించిన కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. సహజీవనం చేసిన జంటకు కలిగిన సంతానం విషయంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ఓ జంట.. భార్యాభర్తల్లా దీర్ఘకాలం పాటు కలిసి సహజీవనం చేశారంటే వారిద్దరూ మ్యారేజ్ చేసుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. Read Also: Bus Charges: చార్జీలు పెంచండి.. ఏపీఎస్ ఆర్టీసీకి టీఎస్ ఆర్టీసీ రిక్వెస్ట్ కేరళకు చెందిన ఓ జంట సుదీర్ఘకాలం పాటు సహజీవనం […]
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టి.. లాభాల బాట పట్టించేందుకు టీఎస్ ఆర్టీసీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది… వినూత్న తరహాలో కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే.. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా సంస్థపై భారం పడకుండా చార్జీలను కూడా వడ్డిస్తోంది.. అయితే, ఇది ఏపీఎస్ ఆర్టీసీకి కలిసివచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.. టీఎస్ ఆర్టీసీ సర్వీసుల్లో చార్జీలు పెరడంతో.. ప్రయాణికులు క్రమంగా ఏపీ ఆర్టీసీ సర్వీసులను ఆశ్రయిస్తున్నారట.. దీంతో, ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని […]
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి భారత్‌లో మరోసారి విజృంభిస్తోంది.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రూపంలో.. వివిధ వేరియంట్లుగా ప్రజలపై దాడి చేసిన మహమ్మారి.. మరోసారి పంజా విసిరుతోంది.. గత కొంతకాలంగా వెలుగు చూస్తోన్న రోజువారి పాజిటివ్ కేసులను పరిశీలిస్తే మళ్లీ టెన్షన్ మొదలైనట్టే కనిపిస్తోంది. థర్డ్ వేవ్ తర్వాత వందలకు పరిమితమైన కేసులు.. ఇప్పుడు మళ్లీ వేలను దాటేశాయి.. 10 వేల వైపు పరుగులు పెడుతోంది కరోనా రోజువారి కేసుల సంఖ్య.. […]