పర్యావరణం, పరిశుభ్రతపై ప్రభుత్వం, సంస్థలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి.. అయితే, ప్రజల రద్దీ ఉండే ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించకపోవడంపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి.. అయితే, ఓ ఆలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్.. ఆ ఆలయానికి ఈవోగా ఉన్న వ్యక్తితో ఫ్యాన్ తుడిపించారు.. ఈ ఘటన కోనసీమ జిల్లాలో జరిగింది.. Read Also: RK Roja: జగన్ చరిత్ర తిరగరాస్తున్నారు.. వారి బాక్స్‌లు బద్దలు కావాలి..! పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ద్రాక్షరామలో శ్రీ మాణిక్యంబ సమేత […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ చరిత్రను తిరగరాస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి ఆర్కే రోజా.. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెళ్లేరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్నని విమర్శించే ఆ బ్లడీ ఫూల్స్ అందరికీ బాక్సులు బద్దలయ్యేలా ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేయండి అంటూ పిలుపునిచ్చారు.. ఈ రాష్ట్రాన్ని 15 మంది ముఖ్యమంత్రులు పాలించారు.. కానీ, వారందరి చరిత్రను తిరగరాస్తున్న చరిత్రకారుడు వైఎస్ జగన్ […]
ఫిట్నెస్ గురించి రకరకాల చాలెంజ్‌లు విసురుకున్నారు.. కేంద్ర మంత్రుల నుంచి బాలీవుడ్ స్టార్ట్స్, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొనడం.. మరికొందరికి సవాల్ విసరడం.. ఆ మధ్య తెగ ట్రెండ్ అయ్యింది.. అయితే, ఇప్పుడు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ఎంపీకి విసిరిన చాలెంజ్ చర్చగా మారింది.. బరువు తగ్గాలని సూచించిన గడ్కరీ.. కిలోకి వెయ్యి కోట్ల చొప్పున ఇస్తానంటూ ఆ ఎంపీకి సవాల్ చేశారు.. దీంతో, తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు […]
గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అంతర్గత విభేదాలు మరోసారి గరంగరంగా మారుతున్నాయి.. వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా.. పాత శత్రువులు మిత్రులుగా మారుతుండగా.. వారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు వల్లభనేని వంశీ.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వల్లభనేని వంశీ.. యార్లగడ్డ పై నిప్పులు చెరిగారు.. గన్నవరం ప్రజలకు తెలుసు నేను విలనో, మంచి వాడినో తెలుసన్న ఆయన.. యార్లగడ్డది ఏమైనా మహేష్ బాబు ముఖమా..? అంటూ ఎద్దేవా చేశారు.. యార్లగడ్డ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. […]
కరోనా మహమ్మారి వెలుగు చూసిననాటి నుంచి దానిపై అనేక అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి.. మహమ్మారి సోకినవారిలో జరిగే పరిణామాలు.. కోవిడ్ నుంచి కోలుకున్నతర్వాత వచ్చే మార్పులు.. ఇలా అనేక రకాలుగా పరిశోధనలు చేశారు.. చేస్తూనే ఉన్నారు.. అయితే, కోవిడ్ బారినపడిన తర్వాత చాలామంది పిల్లల్లో ప్రాణాంతక మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్-సీ) కనిపించినట్టు మరో కొత్త స్టడీ తేల్చింది. ఇది, వ్యాక్సినేషన్ వేసుకోని పిల్లలతోపాటు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కూడా కనిపించిందని చెబుతున్నారు.. Read Also: […]
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లాలో పరిణామాలు తలనొప్పిగా మారుతున్నాయి.. నేతల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు బహిర్గతం అవుతున్నాయి.. బహిరంగ విమర్శలు, ఆరోపణలతో.. ఓ వైపు బందరు పంచాయతీ నడుస్తుండగా.. మరోవైపు గన్నవరంలో రచ్చగా మారుతున్నాయి.. అంతేకాదు గన్నవరంలో కొత్త ఈక్వేషన్ మొగ్గ తొడుగుతున్నాయి.. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా.. రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు యార్లగడ్డ వెంకట్రావ్… దుట్టాకి చెందిన కొత్త ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమానికి యార్లగడ్డ హాజరు కావడం చర్చగా మారింది.. స్థానిక […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సీబీఐపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ప్రతీ అంశంపై సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇచ్చే సాయిరెడ్డి.. ఇవాళ చంద్రబాబు సీబీఐ కామెంట్స్ పై సెటైర్లు వేశారు.. అధికారంలో ఉన్నప్పడు రాష్ట్రంలోకి సీబీఐ రావొద్దంటూ ఆంక్షలు పెట్టి, ఇప్పుడు సీబీఐ లేకపోతే దేశాన్ని ఎవరు రక్షిస్తారు అంటాడు..! అని మండిపడ్డ ఆయన.. రెండు నాలుకల నాసిరకం రాజకీయ నాయకుడు (నారా) నాయుడు బాబు.. […]
టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహణకు సిద్ధం అవుతుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 12వ తేదీన టెట్ నిర్వహించనున్నారు.. అదే రోజు ఆర్ఆర్బీ పరీక్ష ఉండడంతో టెట్ వాయిదా వేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. అయితే, టెట్ అనుకున్న ప్రకారం 12వ తేదీన నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది సర్కార్.. ఆదివారం రోజు టెట్ నిర్వహించనుండడంతో.. డైరెక్టర్, SCERT మరియు కన్వీనర్ TS-TET-2022 కీలక ప్రకటన చేశారు. మొత్తం 33 జిల్లాల్లో రెండు సెషన్లలో టెట్ జరుగుతుంది.. […]
వినాయక చవితి తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తారు.. గణేష్ చవితి అనగానే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడే… ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకునే ఆ మహాగణపతి.. ఈ ఏడాది భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధం అవుతున్నాడు.. అందులో భాగంగా ఇవాళ ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర మహా గణనాథుడి విగ్రహ నిర్మాణ పనులు కర్ర పూజతో ప్రారంభించారు.. నిర్జల ఏకాదశి పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతికి కర్రపూజ నిర్వహించింది గణేష్ ఉత్సవ కమిటీ.. ప్రభుత్వ […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహణకు సిద్ధం అవుతుంది.. ఈ నెల 12వ తేదీన టెట్ నిర్వహిస్తామని నోటిఫికేషన్ ద్వారానే కాదు.. ఆ తర్వాత కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే, అదే రోజు ఆర్ఆర్బీ పరీక్ష ఉండడంతో… విద్యార్థి, యువజన సంఘాలతో పాటు.. విపక్షాలు కూడా టెట్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి.. తాజాగా, ఈ వ్యవహారంపై స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. Read Also: Surprise Gift: […]