Sharan Navaratri 2022: కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి నదీ విహారానికి బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసర శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు దశకు చేరుకున్నాయి.. ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు.. అయితే, కృష్ణానదిలో నిర్వహించే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారానికి ఈ సారి బ్రేక్ పడింది.. కానీ, నది ఒడ్డున హంస వాహనాన్ని ఉంచి.. దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు పూజలు నిర్వహించనున్నారు.. దీనికి ప్రధానం కారణంలో కృష్ణా నదిలో వరద ఉధృతే.. ఎందుకంటే… ప్రకాశం బ్యారేజీకి పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు వస్తోంది… దీంతో, నదీ విహారం సాధ్యపడదని జల వనరుల శాఖ కలెక్టర్‌కు నివేదిక ఇచ్చింది…
Read Also: Chidambaram Nataraja Temple: చిదంబర ఆలయ సంపద వివాదం.. ప్రభుత్వంపై పురోహితులు ఫైర్
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో.. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారం నిర్వహించడం సాధ్యం కాదని వెల్లడించారు కలెక్టర్ ఢిల్లీరావు, ఇరిగేషన్ అధికారి కృష్ణమూర్తి.. కృష్ణానదిలో ప్రవాహం కారణంగా నదీ విహారం చేపట్టలేకపోతున్నామని.. కేవలం దుర్గాఘాట్‌లో హంస వాహనంపై స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ఉంచి పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. మరోవైపు.. ఈ పూజాది కార్యక్రమాలు తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం.. ప్రకాశం బ్యారేజ్, పున్నమిఘాట్, దుర్గాఘాట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. వేలాది మంది భక్తులు తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వస్తారు కాబట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాగా, ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు తుది దశకు చేరుకున్నాయి… జై భవానీ నామస్మరణతో దుర్గమ్మ ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలు.. చివరి దశకు చేరినవేళ భక్తుల తాకిడి ఎక్కువైంది. శ్రీ మహిషాసుర మర్ధనీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు దుర్గమ్మ… రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసుర మర్ధనిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది అమ్మారు.. ఇక, మహిషాసుర మర్ధనిని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశించి, సాత్విక భావం ఏర్పడుతుంది అనేది భక్తుల నమ్మకం.. సర్వదోషాలు పటాపంచలై ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!