Nirmala Sitharaman: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు.. వివిధ సంస్థల ఆఫీసులు కూడా రెడీ అవుతున్నాయి.. ఇక, ఆర్బీఐ సహా పలు జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా అమరావతిలో రానున్న రోజుల్లో తమ కార్యకలాపాల నిర్వహణ కోసం సిద్ధం అవుతున్నాయి.. వాటికి అనుగుణంగా ఇప్పుడు కొత్త భవనాలను నిర్మించనున్నారు.. ఎల్లుండి రాజధాని అమరావతిలో పర్యటించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రాజధాని అమరావతిలో RBI సహా 25 జాతీయ, ప్రయివేట్, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు సంబంధించిన నూతన భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.. అన్ని బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన చేయనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
Read Also: Tollywood: యంగ్ హీరోలు హిట్ కొట్టాలంటే బడ్జెట్ పెంచాల్సిందేనా..?
ఇక, నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో.. CRDA ప్రధాన కార్యాలయం వద్ద సభా వేదిక ఏర్పాటు చేయనున్నారు.. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారాయణ, నారా లోకేష్ హాజరుకానున్నారు. ఇప్పటికే వివిధ బ్యాంకులకు భూ కేటాయింపులు చేసింది CRDA.. బ్యాంకులతో పాటు.. అధికారుల నివాస భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.. ఇప్పటి వరకు కేవలం ఏపీ ప్రభుత్వం భవనాలు మాత్రమే నిర్మాణం జరుగుతుండగా.. ఇప్పుడు అన్ని ప్రధాన బ్యాంక్ కార్యాలయాల నిర్మాణం ప్రారంభం కాబోతుంది.. ఈ నేపథ్యంలో అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ముందుకు సాగుతోంది..