iBomma Ravi: సైబర్ క్రైమ్ విచారణలో ఐబొమ్మ వ్యవస్థాపకుడు రవిపై కీలకమైన ఆధారాలు బయటపడ్డాయి. రవి ఉపయోగించిన మెయిల్స్, డొమెయిన్స్, అంతర్జాతీయ మనీ ట్రాన్సాక్షన్స్ మొత్తం పోలీసులు ట్రాక్ చేసినట్లు తెలుస్తోంది. విచారణలో ముఖ్య విషయాలు వెలుగు చూశాయి.. రవి ఉపయోగించిన ఇమెయిల్స్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు ట్రేస్ చేశారు. ప్రతి డొమెయిన్కి ప్రత్యేక కోడ్‌ను జోడించినట్లు గుర్తించారు. ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ అయ్యే వెంటనే బెట్టింగ్ యాప్స్‌కు రీడైరెక్ట్ అయ్యేలా వ్యవస్థ రూపొందించినట్టు ఆధారాలు దొరికాయి. డొమెయిన్స్‌ను USD ద్వారా కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అంతర్జాతీయ నెట్‌వర్క్ – రవికి వెనుక భారీ ప్లాన్ ఉందంటున్నారు.. పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు రవి అనేక కంపెనీలు సృష్టించినట్లు బయటపడింది. అమెరికాలో ఏర్పాటు చేసిన ER Infotech పేరుతో ప్రధానంగా నెట్‌వర్క్ నడిచినట్లు విచారణలో తేలింది. US లోని ఆ కంపెనీ కూడా రవికే చెందినదని పోలీసులు నిర్ధారించారు. విచారణలో మొదట రవికి మెయిల్ చేసినప్పుడు, US కోర్టు ఆర్డర్ తీసుకురావాలని రవి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత అనుమానం వచ్చిన రవి 20 రోజులపాటు ఇమెయిల్స్‌ను మానిటర్ చేసినట్లు చెప్పాడు. పోలీసుల నుంచి మెయిల్ వచ్చిన వెంటనే యూరప్‌లోని 6 దేశాలు తిరిగాడు. నెదర్లాండ్స్‌లో ఉండగా ఎవరైనా తనను ఫాలో చేస్తున్నారని అనుమానం రావడంతో పోలాండ్, ఇంకా రెండు దేశాలు తిరిగాడు. ఎవరూ ఫాలో చేయడం లేదని నిర్ధారించుకున్న తర్వాతే స్వదేశానికి వెళ్లాడని రవి విచారణలో పేర్కొన్నాడు.
అరెస్ట్ సమయంలో రవి ఏం చేశాడంటే..?
అరెస్ట్ సమయంలో గంటపాటు బయటకు రాకుండా తలుపులు మూసుకుని కూర్చొన్నాడు రవి.. బాత్‌రూమ్‌లో కూర్చుని చాలా డేటాను డిలీట్ చేసినట్లు రవి పోలీసులకు చెప్పాడు. లాప్‌టాప్‌ను బాత్రూమ్‌లో, హార్డ్‌డిస్క్‌లను డ్రెస్సింగ్ టేబుల్ కింద దాచినట్లు సమాచారం.
రవి గురించి షాకింగ్ విషయలు చెప్పిన భార్య..! చేసిన షాకింగ్ వ్యాఖ్యలు
రవిని విచారించిన సమయంలో అతని భార్య చేసిన కొన్ని వ్యాఖ్యలు పోలీసులకు షాక్ ఇచ్చాయి.. ఆయన ఇంట్లో ఎప్పుడూ ఒంటరిగానే ఉండేవాడు.. ఎవరితో మాట్లాడేవాడు కాదు… ఒక్కడే పని చేసుకునేవాడు.. సైకోలా తన రూమ్‌లో ఉండేవాడు… రూమ్‌లోకి వెళ్తే కొట్టేవాడు.. బిడ్డతో వెళ్లినా కూడా కొట్టేవాడు అని పేర్కొందట.. అయితే, రవిపై జరుగుతున్న విచారణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డిజిటల్ నెట్‌వర్క్, అంతర్జాతీయ డొమెయిన్‌లు, బెట్టింగ్ కనెక్షన్లు — ఇవన్నీ పోలీసుల దృష్టిని మరింత ఆకర్షిస్తున్నాయి. ఐబొమ్మ వ్యవహారం ఇంకా ఎన్నో మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.