భారతదేశ అంతరిక్ష పరిశోధణ సంస్థ (ఇస్రో) చంద్రునిపైకి తన తాజా మిషన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది.. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న చంద్రయాన్-3 మిషన్‌ను జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగించనుంది.
కేబినెట్ భేటీలో అజెండాలోని అంశాలపై చర్చ తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం వైఎస్ జగన్.. ఎన్నికలకు సిద్ధంకండి అంటూ మంత్రులకు సూచించారు.. మరో 9 నెలల్లో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేసిన ఆయన.. జగనన్న సురక్షా క్యాంపైన్ ను మంత్రులు పర్యవేక్షించాలని తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది.. దాదాపు మూడున్నర గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేబినెట్.. 55 అంశాలతో కేబినెట్ సమావేశం జరిగింది.
ఛార్జిషీట్ గురించి ప్రశ్నించినప్పుడు ఓ జాతీయ మీడియా రిపోర్టర్‌తో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ అనుచితంగా ప్రవర్తించారు.. బ్రిజ్ భూషణ్ సింగ్ ను.. టైమ్స్ నెట్వర్క్ రిపోర్టర్ లైంగిక వేధింపులకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలతో సహా అతనిపై నమోదు చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రశ్నలు అడిగారు.. దీంతో, టైమ్స్ నెట్వర్క్ కరస్పాండెంట్ తేజ్శ్రీతో దురుసుగా ప్రవర్తించాడు బ్రిజ్ భూషణ్.