జనసేన నేతలకు క్లాస్ పీకిన పవన్ కల్యాణ్.. అది సమయం వృథా..!
జనసేన నేతలకు క్లాస్ తీసుకున్నారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాయలంలో జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశం వేదికగా పార్టీ నేతలకు సున్నితంగా చురకలు అంటించారు పవన్.. నా చుట్టూ తిరిగితే నాయకులు అవరన్న ఆయన.. కలిసిన వారినే కలవటం అంటే నాకు సమయం వృథా అని వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే మాత్రమే లీడర్స్ అవుతారని స్పష్టం చేసిన ఆయన.. ప్రతి విషయానికి నేనే రావాలని కాదు.. మీరు రెస్పాండ్ అవ్వాలి.. డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, త్రికరణ శుద్ధిగా పనిచేయండి.. ప్రతి పక్ష పార్టీపై మనం పోరాటం చేయాలి.. తప్ప మన పక్కనే ఉన్న వాళ్లని ఇబ్బంది పెట్టడం సరికాదని హితవుపలికారు. ఇక, విశాఖలో జరగనున్న వారాహి విజయ యాత్రకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని సూచించారు పవన్ కల్యాణ్.. విశాఖలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదన్న ఆయన.. విశాఖ ఎంపీని చితక్కొట్టి నా పోలీస్ వ్యవస్థ చూస్తూ ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో ఖాళీ జాగాలు, కొండలు కనపడకూడదు అనే విధంగా విశాఖ పరిస్థితి ఉందన్నారు పవన్. మరోవైపు.. బ్రో సినిమాలో ఓ క్యారెక్టర్‌పై జనసేన వర్సెస్ వైసీపీగా మాటల యుద్ధం నడుస్తోంది.. ముఖ్యంగా మంత్రి అంబటి రాంబాబు ఈ సినిమాపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.. ఆ అంశాలపై స్పందించిన పవన్ కల్యాణ్.. టీవీ డిబేట్స్ లో మహిళల అదృశ్యం, పోలవరం, చిన్నారుల ట్రాఫికింగ్.. ఇల అంశాలపై నేతలు మాట్లాడాలి.. కానీ, సినిమా గురించి, నన్ను తిట్టడం గురించి చర్చలు ఎందుకు? వాటిపై పార్టీ నేతలు డిబేట్స్ ఎందుకు అని ప్రశ్నించారు. నన్ను తిట్టినా నాకు ఏం కాదు.. నేనే ఆ సినిమా గురించి వదిలేశాను.. వాళ్లు కావాలని డైవర్ట్ చేస్తే మీరు కూడా మళ్లీ దానిపై మాట్లాడటం సరికాదని సూచించారు. సినిమాను నేతలు రాజకీయాల్లోకి తీసుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
చందమామకు చేరువగా చంద్రయాన్-3
భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంపై ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది.. 2023 జులై 14న LVM3 M4 రాకెట్ ద్వారా గగనతలంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 ఇప్పటికే మూడింట రెండు వంతుల దూరాన్ని అధిగమించి చంద్రునికి చేరువైందని ఇస్రో ప్రకటించింది.. ఆగస్టు 23వ తేదీన చంద్రునిపైన మూన్ మిషన్ ల్యాండ్ అవుతుందని ఇస్రో పేర్కొంది.
పుంగనూరులో చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు..
పుంగనూరు పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తన పర్యటనలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, టీడీపీ-వైసీపీ వర్గాల ఘర్షణలు, ఆ తర్వాత జరిగిన విధ్వంసంపై సీరియస్‌గా స్పందించిన చంద్రబాబు.. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందోచూశారుగా.. పిల్లి కూడా రూమ్‌లో పెట్టి కొడితే పులి అవుతుందన్నారు. మీరు కర్రలతో వస్తే.. మేం కర్రలతో వస్తాం.. మీరు యుద్ధం చేస్తే.. నేనూ యుద్ధం చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. నన్ను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుంది.. పుంగనూరులో అదే జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ రోజు జరిగిన విధ్వంసాన్నికి కారణం మంత్రి పెద్దిరెడ్డియే అన్నారు చంద్రబాబు.. ఈ రోజు ఘటనపై విచారణ జరపాలి, బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది పెద్దిరెడ్డి తాత జాగీరా..? పెద్దిరెడ్డి పెద్ద పుండింగా..? ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో చూశారుగా..? ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు నరకాన్ని చూసారు.. పిల్లి కూడా రూమ్ లో పెడితే కొడితే పులి అవుతుంది… పుంగనూరులో అదే జరిగిందన్నారు.. దెబ్బలు తగిలిలా.. తలలు పగిలినా.. భయపడకుండా ఉన్నారు. పెద్దిరెడ్డికి చల్లా బాబుకు సరైనా మొగుడు దోరికాడు అన్నారు. మంచివాడు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో చూపించారని వ్యాఖ్యానించారు.
రెచ్చ గొట్టి, దాడికి ఉసిగొల్పింది బాబే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది.. దాడులు, ప్రతిదాడులు, పోలీసుల లాఠీచార్జ్, బాష్పవాయువు ప్రయోగం.. విధ్వంసం ఇలా టెన్షన్ వాతావరణాన్ని నెలక్పొంది. అయితే, పుంగనూరు ఘటన విషయంలో చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబువి వికృతమైన ఆలోచనలు, అధికారం కోసం దిగజారుతాడు.. రాజకీయ పార్టీగా శాంతి భద్రతలను కాపాడకుండా రెచ్చ గొట్టింది చంద్రబాబే అన్నారు. పుంగనూరు దాడి వెనుక ముందుగానే కుట్ర ఉన్నట్టు సాక్ష్యాలున్నాయి.. దానికి జీపుల్లో రాళ్లు, తుపాకులు ఉండటమే నిదర్శనం అన్నారు. పుంగనూరులో రెచ్చ గొట్టి, దాడికి ఉసిగొల్పింది చంద్రబాబు అని ఆరోపించిన సజ్జల.. చంద్రబాబు సానుభూతి నాటకం పుంగనూరులో బయటపడిందన్నారు. ఆయనే రెచ్చ గొట్టి దాడులకు ఉసి గొల్పి సానుభూతి పొందే నాటకం చేస్తారని. కానీ, చంద్రబాబు నాటకం రక్తి కట్టకపోగా.. ఆయన అసలు స్వరూపం బయటపడిందన్నారు. అయితే, పుంగనూరు ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్తాం అని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో 23 సీట్లతో తెలుగుదేశం పార్టీని కొన ఊపిరితో వదిలిన ప్రజలకు.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని భూ స్థాపితం చేయాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
చంద్రబాబు మొదటి ముద్దాయి..! కేసు నమోదు చేయాలి
పుంగనూరు ఘటనపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. చంద్రబాబు రౌడీ మూకలను రెచ్చగొట్టారన్న ఆయన.. డబుల్ బ్యారెల్ గన్స్ కూడా పెట్టుకుని వచ్చారని ఆరోపించారు. చంద్రబాబు మాటలకు రెచ్చిపోయి పోలీసు వాహనాలపై వారు దాడి చేశారు. ఒక పద్ధతి ప్రకారం మొత్తం చేశారు. చంద్రబాబుకు దిగజారుడు తనం, నిరాశా నిస్పృహతో ఇలాంటి చర్యలకు ఒడికట్టారని విమర్శించారు. చంద్రబాబు నాయుడును మొదటి ముద్దాయిగా కేసు నమోదు చేయాలని సూచించారు. దౌర్జన్యానికి పాల్పడిన వారి వీడియోలు కూడా స్పష్టంగా ఉన్నాయన్న ఆయన.. కావాలనే చంద్రబాబు రెచ్చ గొట్టారని ఆరోపించారు. నిన్న రాత్రి చంద్రబాబు పుంగనూరు లోపలికి రారు, బైపాస్‌లో వెళ్తారని ప్రెస్‌స్టేట్‌మెంట్ ఇచ్చారు.. కానీ, ఆ తర్వత కావాలనే పుంగనూరు లోపలి వెళ్లి రచ్చ చేయాలని చూశారని ఫైర్ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి.. ఇక, చంద్రబాబు మానసిక స్థితి సరిగ్గా లేకపోయి ఉండాలి లేదా నిరాశ నిస్పృహతో ఇలా వ్యవహరించి ఉండాలన్నారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలతో ఇక గెలవలేను అని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. మంచి డాక్టర్‌కు చూపించుకుని, ప్రజాస్వామ్యం పద్ధతిలో ఎన్నికల్లో పోటీ పడాలన్నారు. గతంలో 60 లక్షల దొంగ ఓట్లతో చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు. ఈ రోజు పుంగనూరు ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి, వారిని రెచ్చగొట్టిన చంద్రబాబును మొదటి ముద్దాయిగా కేసు నమోదు చేయాలని వ్యాఖ్యానించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారు
నేడు ( శుక్రవారం ) ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది అని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ అన్నారు. ఈనెల 6న గాంధీ ఐడియాలోజీ సెంటర్ లో కూడా మీటింగ్ ఉంటుంది అని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగల సినిమా చూపిస్తామన్నాడు. కేసీఆర్, నరేంద్ర మోడీ తెరవెనుక తెరముందు ఎట్లా అనేది చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీని ఐదేళ్లుగా మాఫీ చేయకుండా ఇప్పుడు చేస్తామని ప్రకటించారు.. ఐదేళ్ల మిత్తి మాఫీ అయ్యింది అని ఆయన పేర్కొన్నారు. పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని మధుయాష్కీగౌడ్ తెలిపారు. తెలంగాణాలో దోపిడీ జరుగుతోంది.. అన్ని వర్గాలను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి మోసం చేస్తున్నారు.. తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారు.. రేపు రాష్ట్రానికి ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ రానున్నారు అని మధుయాష్కీ అన్నారు. పార్లమెంట్ అడ్వైజరీ సభ్యులు కూడా వస్తారని తెలియజేశాడు. సత్యమేవ జయతే.. రాహుల్ విషయంలో సత్యం గెలిచింది అని ప్రచార కమిటీ ఛైర్మన్ తెలిపారు. సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం సంతోషకరం.. రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం అణిచివేయాలని చూసింది.. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ.. ఇలా కుట్రలు చేసి కాదు.. కేంద్ర విచారణ సంస్థలను ఉసిగొల్పి కాంగ్రెస్ నేతలను, సానుభూతి పరులను వేధిస్తున్నారు అని మధుయాష్కి విమర్శించారు. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ పార్లమెంట్లో ఎందుకు మాట్లాడం లేదు అని అడిగారు.
సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ కీలక వ్యాఖ్యలు.. నా దారి క్లియర్గానే ఉందంటూ ట్వీట్
రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఈ పరిణామంపై రాహుల్ గాంధీ సైతం స్పందించారు. ఏది వచ్చినా.. తన కర్తవ్యం ఇలాగే ఉంటుందని, భారత ఆలోచనను రక్షించడమే తన ఆలోచనని.. ట్వీట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు కాకుంటే రేపు అయినా నిజం గెలుస్తుందని తెలిపారు. ఏం జరిగినా నా రూట్ క్లియర్‌గా ఉందన్నారు. తానేం చేయాలి.. తన పనేంటనే విషయంలో క్లారిటీ ఉందన్నారు. తనకు మద్దతు తెలిపిన వారికి, ప్రేమ చూపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు ఈ తీర్పుపై స్పందించారు. అటు ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ సభా నేత అధిర్ రంజన్ చౌదరి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ స్పందించగా.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ తీర్పుపై స్పందించారు. సత్యం ఒకటే గెలుస్తుందని ఖర్గే ట్వీట్ చేయగా.. ఎట్టకేలకు న్యాయం జరిగిందని, ప్రజాస్వామ్యం నెగ్గిందన్నారు. రాహుల్‌ను బీజేపీ వేటాడటం పూర్తిగా బహిర్గతమైందన్నారు. విపక్షాలను లక్ష్యంగా చేసుకునే దుర్మార్గపు ఆలోచనలను ఆపేయాలని ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఇదో రకం హనీ ట్రాప్.. డేట్ కి తీసుకెళ్ళి బిల్ కట్టకపోతే కుర్రాడిపై లైంగిక దాడి?
ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో, తాను చెల్లించలేని బిల్లుపై గొడవ జరిగిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అంతేకాదు అతన్ని కిడ్నాప్ చేసి బౌన్సర్లు లైంగిక దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. ఓ వ్యక్తిని బిల్లు కట్టలేదని రెస్టారెంట్ యజమాని, ఇద్దరు బౌన్సర్లతో కలిసి ఆ వ్యక్తిని తన కారులో కిడ్నాప్ చేసి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మురాద్‌నగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ యువకుడిపై అత్యాచారం చేయడమే కాకుండా అతడికి సంబంధించిన అశ్లీల వీడియోను కూడా రికార్డు చేయడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. వెంటనే 50,000 భారీ మొత్తంలో చెల్లించకపోతే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని నిందితులు బెదిరించారు..
దోస పంటలో అధిక దిగుబడి పొందాలంటే ఇలా చెయ్యాల్సిందే..
మన దేశంలో అధికంగా పండించే కూరగాయలలో దోసకాయ కూడా ఒకటి.. ఈ పంటను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు.. తీగజాతి కూరగాయల్లో దోస చాలా తక్కువ సమయంలో చేతికొచ్చే పంట.మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే ఒక మాదిరి ఉష్ణోగ్రతలు వుండే వాతావరణ పరిస్థితులు దోస సాగుకు అనుకూలం. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే దోసలో మగపూల శాతం పెరిగి దిగుబడి క్షీణిస్తుంది. లోతైన గరప నేలలు, ఒండ్రు నేలలు , దోస సాగుకు అనుకూలం… ఈ పంట గురించి మరిన్ని వివరాలు.. ఎకరాకు ఒకటి నుంచి 1.4 కిలోలు, హైబ్రిడ్ రకాల్లో ఎకరాకు 250గ్రా. విత్తనం అవసరం.. విత్తన శుద్ధి చెయ్యడం అవసరం.. ఇక నేలను తయారు చేసుకోవాలి.. పొలాన్ని బాగా దుక్కి చేసి మూడు అడుగుల వెడల్పుతో ఎత్తు బోదెలు చేయాలి. బోదె మధ్యలో గాడి చేసి అందులో ఎకరానికి 5 టన్నుల చొప్పున పశువుల ఎరువు, 200 కిలోల సూపర్ ఫాస్ఫెట్, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 20 కిలోల మెగ్నీషియం సల్ఫేట్, 10 కిలోల బోరాన్ వేసి గాడిని మట్టితో నింపి బోదె పైభాగాన్ని చదును చేయాలి.. అప్పుడే తెగుళ్ల నుంచి బయట పడవచ్చు.. గింజలు మొలకెత్తే వరకు వెంట వెంటనే నీరు పారించాలి. ఆ తర్వాత నేల స్వభావాన్ని, కాలాన్ని బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో నీరు ఇవ్వాలి.
పామును ప్రేమగా చూస్తూ.. ఓ ముద్దుపెట్టిన ఎద్దు
తన ముందు ఉన్న పామును ఓ ఎద్దు ప్రేమగా చూస్తూ అలానే నిలబడి పోయింది. సామాన్యంగా ఎద్దులను చూసిన పాములు వాటి దగ్గరకు రాకుండా దూరంగా వెళ్తుంటాయి.. ఎందుకంటే వాటి కాళ్ల కింద పడితే నుజ్జునుజ్జు అవుతాయని భయానికి దరిదాపుల్లో ఉండవు. కానీ ఇక్కడ కనపడే అరుదైన దృశ్యాన్ని చూస్తే.. అసలు ఇది నిజమేనా..? అని అనిపిస్తుంది. ఆ వీడియోలో నాగుపాముతో ఓ ఆవు కాసేపు చెలిమి చేసింది. అంతేకాకుండా.. పాము పడగకు ముద్దు పెట్టింది. అయినప్పటికీ ఆ పాము ఆవును కాటేయలేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వర్ణించడం కష్టం అని క్యా్ప్షన్ ఇచ్చారు. ప్రకృతిలో ఇది నిజమైన ప్రేమ అని పేర్కొన్నారు. ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన 15 గంటల్లోనే మూడున్నర లక్షల మంది వీక్షించారు. 5 వేల మంది లైక్ చేశారు. అంతేకాకుండా కొందరు నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేశారు. ప్రకృతిని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు అని ఓ యూజర్ పేర్కొన్నాడు. ఆ స్నేహబంధం అద్భుతమని మరో యూజర్ రాసుకొచ్చాడు. నంది నాగదేవ్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోందని.. మరొక వినియోగదారు రాశారు.
బ్రహ్మాజీ హీరోగా బేబీ 2.. సాయి రాజేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
బేబీ అనే సినిమాని చిన్న బడ్జెట్ తో తీసి హిట్ కొట్టాడు డైరెక్టర్ సాయి రాజేష్. గతంలో హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్ గా విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కించిన ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. వాస్తవానికి ఈ సినిమా మీద విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతానికి సినిమా యూనిట్ అంతా ప్రమోషన్స్ చేస్తూనే ఉంది. ప్రస్తుతానికి విజయ యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఇదిలా ఉండగా బేబీ 2 సినిమాలో బ్రహ్మాజీ లీడ్ యాక్టర్ గా నటిస్తున్నాడు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అయితే అసలు విషయం ఏమిటంటే ఒక నెటిజన్ బ్రహ్మాజీని ట్విట్టర్లో టాగ్ చేస్తూ బేబీ లాంటి సినిమాని మీరు లీడ్ యాక్టర్ గా ఎందుకు చేయకూడదు అని ప్రశ్నిస్తే దానికి రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టిన బ్రహ్మాజీ డైరెక్టర్ సాయి రాజేష్ ను టాగ్ చేశారు. వెంటనే సాయి రాజేష్ బ్రహ్మాజీ ట్వీట్ కి రిప్లై ఇస్తూ బేబీ 2 సినిమా చేసేద్దామా అన్న అంటూ కామెంట్ పెట్టారు. ఇక దానికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బేబీ 2 సినిమాలో వైష్ణవి మోసం చేసినట్లుగా కాకుండా ఇక్కడ బ్రహ్మాజీ ఒక ఇద్దరు పాపలను మోసం చేస్తాడేమో అని కామెంట్ పెట్టారు. మరొక నెటిజన్ బ్రహ్మాజీ అన్న మీకు విరాజ్ క్యారెక్టర్ బాగా సెట్ అవుద్దేమో అని మరో కామెంట్ పెట్టారు.
జర్నలిస్టులపై బేబీ నిర్మాత ఏస్కేన్ దౌర్జన్యం.. అసలు విషయం ఏంటంటే?
బేబీ సినిమా నిర్మాత ఎస్‌కేఎన్ సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారు. బేబీ సినిమా ప్రమోషన్‌స్లో భాగంగా భీమవరానికి వెళ్లిన ఆయనకు అక్కడి జర్నలిస్టులకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా ప్రతినిధులకు, ఎస్‌కేఎన్ మధ్య కాస్త రసాభాస జరిగినట్టుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చుట్టూ ఉన్న బౌన్సర్లు మీడియాను ప్రతిఘటిస్తుండగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ అవగా ఈ ఘటనలో ఓ జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడినట్లు ప్రచారం జరిగింది. అయితే అసలు విషయం ఏమిటి అనే అంశం మీద ఎస్‌కేఎన్ స్పందించారు. సినిమా వాళ్ళు వస్తున్నారు అంటే మామూలుగానే జనం ఎక్కువగా వస్తారు, వారితో లోకల్ మీడియా వాళ్ళు కూడా వచ్చారు. జనం మా దగ్గరకు వచ్చేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్న సమయంలో బౌన్సర్లు ముందుగా మా టీము వాళ్ళని సేవ్ చేయడానికి చూస్తారని ఆయన అన్నారు. అంత క్రౌడ్ ఒక్కసారిగా మీద పడితే మామూలుగా ఉండదు, అందుకని బౌన్సర్లు అలా వచ్చిన క్రౌడ్ ని కొంచెం నెట్టారు అంతే అని చెప్పుకొచ్చారు నిర్మాత ఎస్‌కేఎన్.