Godavari Floods: బీడుభూములకి పచ్చని రంగు అద్దాలన్న, పండిన పంటని నాశనం చెయ్యాలన్న ఒక్క వర్షానికే సాధ్యం అనేలా ఉంది పరిస్థితి, అయితే అతి వృష్టి లేకుంటే అనావృష్టి, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వళ్ల పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు..
Read Also: Suicide: ఉరి వేసుకుని యువతి సూసైడ్.. హాస్పటల్ దగ్గర ఉద్రిక్తత
రంపచోడవరం నియోజక వర్గం పరిధిలోని ఎటపాక, చింతూరు, కూనవరం, విఆర్ పురం మండలాల్లో పర్యటించిన సీపీఎం బృందం.. వరద బాధితుల కష్టాలను తెలుసుకుంది.. వారి దీనస్థితిని సీఎం వైఎస్ జగన్ దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లారు శ్రీనివాసరావు. గతంలో గోదావరికి సాధారణంగ 4 లేక 5 సంవత్సరాలకి ఒకసారి వరదలు వచ్చేవి.. కానీ, ప్రస్తుతం వరుసగా వరదలు వస్తున్నాయి, దీనికి కారణం బ్యాక్ వాటర్ రావడం, 35 అడుగుల నీరు భద్రాచలం దగ్గర ఉన్నప్పుడే నీళ్లు గ్రామాలని చుట్టుముట్టాయి, 10 నుండి 12 అడుగుల నీళ్లు ఊరు చుట్టూ చేరడంతో ప్రజలు బయటకి రాలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఏక్షణం లో ఎం జరుగుతుందో అని భయాందోళనలకు గురి అవుతున్నారని, 12 రోజులు అయినా వాళ్ళకి ఎలాంటి సహాయం అందలేదని 12 రోజుల తర్వాత కలెక్టర్ కి విన్నవించుకున్నాక ఒక బోట్ పంపించారని 45 కాంటూరులో ఉండేటువంటి అనేక గ్రామాలు 32వ కాంటూరులోనే మునిగిపోయాయని, ఊర్లోకి నీరు రాకపోయినా చుట్టూ నీరు చేరిన అలాంటి ప్రాంతాలని కూడా మునక ప్రాంతం కిందనే గుర్తించాలని లేఖలో పేర్కొన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు.