ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే డీఎస్సీ నోటిఫకేషన్ విడుదల కాబోతోంది.. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయనగరం జిల్లా రాజాం ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు
సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే చెందాలని స్పష్టం చేశారు.. దీనిని కలెక్టర్లు సమగ్రంగా పర్యవేక్షించాలన్నారు.. ఇప్పటికే ఇది అమల్లో ఉంది. సమగ్ర పర్యవేక్షణ ద్వారా మరింత సమర్థవంతంగా అమలు అవుతుంది అన్నారు.
సీఎం వైఎస్ జగన్ అంటే వణుకు అనుకున్నా.. జగన్ తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ అన్నా వణుకే అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి ఆర్కే రోజా.. కానీ, వాలంటీర్ వ్యవస్థ వెంట్రుక కూడా పికలేవు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
సునకానందం కోసం కొందరు తనకు అనారోగ్యం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కొడాలి నాని.. నేను అనారోగ్యానికి గురైనట్టు సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు.. టీడీపీ దిగజారుడు తనానికి ఇది నిదర్శనం, నాకు క్యాన్సర్ అంటూ ఐ-టీడీపీ ద్వారా టీడీపీ ఇలాంటి ప్రచారాలు చేయిస్తోందని దుయ్యబట్టారు.
ఇక, పది వేల లోపు ఉన్న అర్చకులకు 10 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని వెల్లడించారు ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. అర్చకులకు న్యాయం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,146 మంది అర్చకులకు జీతాలు పెరుగుతున్నాయని వెల్లడించారు.
Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతూనే ఉన్నాయి.. పవన్ కామెంట్లపై మరోసారి మండిపడ్డారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ కట్యాణ్ మాటలు పిచ్చివాడిలా ఉన్నాయన్న ఆయన.. చంద్రబాబు అనే శనిగాడు పవన్ నెత్తిమీద ఉన్నాడు.. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. వాలంటీర్లు మన పిల్లలే ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు .. మన ఇంట్లో వాళ్లే […]