ఈ మధ్యకాలంలో టాలీవుడ్ నుండి పాన్ ఇండియా మూవీస్ ‘పుష్ప, రాధేశ్యామ్, ఆర్.ఆర్.ఆర్.’ విడుదల అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర వాటి జయాపజయాల మాట ఎలా ఉన్నా, విడుదలకు ముందు సూపర్ బజ్ క్రియేట్ చేశాయని చెప్పవచ్చు. ఇక కన్నడ నుండి త్వరలో రాబోతున్న ‘కేజీఎఫ్ -2’ చిత్రానికీ దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు లభిస్తున్న ఆదరణ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమౌతుంది. పై చిత్రాలతో పోల్చుకున్నప్పుడు విజయ్ […]
ప్రముఖ కథానాయిక నివేదా పేతురాజ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘బ్లడీ మేరీ’. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను అందించే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చందు మొండేటి డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం డైరెక్ట్ చేశాడు. వీరిద్దరికీ ఇది ఫస్ట్ ఓటీటీ మూవీ కావడం విశేషం. మంగళవారం ఈ సినిమాలో టైటిల్ పాత్రలో నటించిన నివేదా పేతురాజ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమా ఫస్ట్ లుక్ […]
సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. మహేష్ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. మంగళవారం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ “సుధీర్ బాబు హీరోగా ‘శమంతకమణి’ తర్వాత మా సంస్థలో చేస్తున్న చిత్రమిది. ఏప్రిల్ 23 వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఇందులో […]
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ (వెంకటేశ్), సిద్ధు ముద్దతో కలిసి నిర్మించిన సినిమా ‘గని’. గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఉన్నా, దానితో సంబంధం లేకుండా ‘అల్లు బాబీ కంపెనీ’ అనే బ్యానర్ లో ‘గని’ సినిమాను ఆయన నిర్మించారు. ఈ చిత్రం జయాపజయాలకు పూర్తి బాధ్యత తనదేనని, అందుకే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశానని బాబీ అన్నారు. తొలిసారి చిత్ర నిర్మాణంలోకి […]
ప్రిన్స్ మహశ్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘పోకిరి, బిజినెస్ మ్యాన్’ తర్వాత మూడో సినిమాగా ‘జనగణమన’ రావాల్సింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనను పూరీ జగన్నాథ్ 2016 ఏప్రిల్ 28న చేశాడు. అది ‘పోకిరి’ రిలీజ్ డేట్! ‘పోకిరి’ని మించి క్రూరంగా, ‘బిజినెస్ మ్యాన్’ను మించి పవర్ ఫుల్ గా ఇందులో మహేశ్ బాబు క్యారెక్టర్ ఉంటుందని పూరి జగన్నాథ్ ఆ టైమ్ లో చెప్పాడు. అయితే చూస్తుండగానే ఐదేళ్ళు గడిచిపోయాయి. […]
చైతన్యరావ్, అనన్య శర్మ జంటగా నటించిన ’30 వెడ్స్ 21′ సీజన్ 2 ప్రస్తుతం యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ వెబ్ సీరిస్ లోని 7వ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. సింగపూర్ లో ఉద్యోగం సంపాదించుకున్న పృధ్వీ ఆ విషయం భార్య మేఘనకు చెప్పడానికి సతమతమౌతుంటాడు. ఉద్యోగంతో బిజీ అయిపోయి తనను పట్టించుకోని మేఘనను సింగపూర్ తీసుకెళ్ళిపోతే తమ వివాహ బంధం మరింత బలోపేతం అవుతుందని పృథ్వీ భావిస్తాడు. అయితే ఆ విషయాన్ని మేఘనతో […]
నూతన తారలు గౌతమ్ రాజ్ , సాయి విక్రాంత్ హీరోలుగా , మధుప్రియ, లావణ్య శర్మ, సిరి మరియు అంబిక హీరోయిన్స్ గా పానుగంటి మహంకాలమ్మ, యాదయ్య గౌడ్ సమర్పణలో మానస క్రియేషన్స్ పతాకంపై టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వంలో బృందాకర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం “అమ్మ నాన్న మధ్యలో మధురవాణి”. ఈ చిత్రం మార్చి 28న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల మధ్య ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో, హీరోయిన్స్ పై చిత్రీకరించిన […]
(ఛార్మి తొలి చిత్రం ‘నీ తోడు కావాలి’కి 20 ఏళ్ళు)అందాల భామ, ప్రముఖ నిర్మాత ఛార్మి మార్చి 28తో ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అరె… ఛార్మి వయసు అంతేనా? అనుకుంటున్నారా? నటిగా ఛార్మి వయసు అది. ఆమె తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ‘నీ తోడు కావాలి’. ఈ సినిమా 2002 మార్చి 28న జనం ముందు నిలచింది. కేవలం పదిహేనేళ్ళ వయసులోనే కెమెరా ముందు నిలచి, నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఛార్మి. అందం, […]
(మార్చి 28న చిత్తూరు వి.నాగయ్య జయంతి)మహానటుడు చిత్తూరు వి.నాగయ్య పేరు వినగానే ఆయన బహుముఖ ప్రజ్ఞ ముందుగా మనల్ని పలకరిస్తుంది. నటునిగా, గాయకునిగా, సంగీత దర్శకునిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా ఇలా తనలోని ప్రతిభను చాటుకుంటూ సాగారు నాగయ్య. ఆ రోజుల్లో తెలుగునాటనే కాదు, యావద్భారతంలోనూ అంతటి ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన నటులు మరొకరు కనిపించలేదు. తెలుగు చిత్రసీమలో తొలిసారి ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్న ఘనత నాగయ్య సొంతం. మన దేశంలో ఒక్కో సినిమాకు లక్ష రూపాయల పారితోషికం […]