Heroine Megha Akash Turned to Producer. బుల్లి తెర నుండి వెండితెరపైకి వచ్చిన అవికా గోర్ ఇప్పుడు తాను ఏ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఆ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉంటోంది. బహుశా ఆ స్ఫూర్తితోనే కావచ్చు మరో యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మేఘా ఆకాశ్ సైతం అదే బాటలో సాగుతోంది. అయితే తన పేరు కాకుండా చిత్ర సమర్పకురాలిగా తన తల్లి బిందు ఆకాశ్ పేరును పెడుతోంది మేఘా. తాజాగా బిందు […]
Aishwarya Rajinikanth New Movie Oh Saathi Chal Updates. ధనుష్ తో విడాకుల తర్వాత కెరీర్ పై మరింతగా ఫోకస్ పెంచింది రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య. ధనుష్ తో 18 సంవత్సరాల వైవహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న ఐశ్వర్య ఇటీవల తన దర్శకత్వంలో ఓ మ్యూజిక్ వీడియో విడుదల చేసింది. దీనికి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ కూడా పని చేశారు. ఆ వీడియోకు ధనుష్ ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా ఐశ్వర్య బాలీవుడ్ లో […]
Famous Actor Anupam Kher In Sankalp Reddy Movie. ప్రస్తుతం భారతీయ చిత్రసీమ మాత్రమే కాదు… అన్ని పొలిటికల్ పార్టీలూ మాట్లాడుకుంటున్న సినిమా ఒక్కటే… ‘ద కశ్మీర్ ఫైల్స్’. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సినిమాను చూసి వినోదపు పన్ను రాయితీ ఇస్తే, ఆ పార్టీని వ్యతిరేకించే తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి వారు ‘ద కశ్మీర్ ఫైల్స్’ సమాజంలో రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే చిత్రమని అభివర్ణిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నాలుగు […]
(మార్చి 22తో ‘కంచుకోట’కు 55 ఏళ్ళు పూర్తి)విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, నటరత్న యన్.టి.రామారావు అత్యధిక జానపద చిత్రాలలో కథానాయకునిగా నటించి అలరించారు. ఆయన నటించిన అనేక జానపదాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక పంపిణీదారులకు, ప్రదర్శనశాలల వారికి యన్టీఆర్ జానపద చిత్రాలే కామధేనువుగా నిలిచాయి. ఆ రోజుల్లో ఏ థియేటర్ లోనైనా సినిమా లేకపోతే, వెంటనే యన్టీఆర్ జానపద చిత్రం వేసుకొనేవారు. సదరు చిత్రాలు రిపీట్ రన్స్ లోనూ విశేషాదరణ చూరగొనేవి. రిపీట్ రన్ లోనూ ఓ జానపద […]
(మార్చి 22న సుమ కనకాల పుట్టినరోజు)కోటలు దాటే మాటలు అంటారు కానీ, మాటలతో కోటలు కట్టిన మేటి మాటకారి సుమ కనకాల. తెలుగునాట వ్యాఖ్యాతలు సైతం సెలబ్రిటీ స్టేటస్ చవిచూస్తారని నిరూపించిన ఘనత సుమ సొంతం. నటి కావాలని పాతికేళ్ళ క్రితం బయలు దేరిన సుమ, వెండితెరపై అంతగా వెలగలేదు. కానీ, వందలాది చిత్రాలు వెండితరపై వెలగబోయేముందు జరిగే ఉత్సవాలలో మాత్రం సుమ గాత్రం విజయనాదం చేస్తూనే ఉంది. ఆమె వ్యాఖ్యానంతో సాగిన సినిమా ఉత్సవాలు, విజయోత్సవాలు […]
(మార్చి 20న శోభన్ బాబు వర్ధంతి)సినిమా రంగాన్ని నమ్ముకుంటే ఎవరినైనా చిత్రసీమ తల్లిలా ఆదరిస్తుందని ఎందరో చెబుతూ ఉంటారు. చిత్రసీమలోనే నటునిగా నిలదొక్కుకోవడానికి నటభూషణ శోభన్ బాబు దాదాపు పుష్కరకాలం శ్రమించారు. 1959లో యన్టీఆర్ ‘దైవబలం’లో ఓ చిన్న పాత్ర ద్వారా తెరపై తొలిసారి కనిపించిన శోభన్ బాబు, తారాపథం చేరుకోవడానికి దాదాపు 12 ఏళ్ళు కష్టపడ్డారు. ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ సక్సెస్ తో శోభన్ బాబు కూడా స్టార్ హీరో అయిపోయారు. అంతకు ముందు ఆయన […]
(మార్చి 19న ‘సీతారత్నంగారి అబ్బాయి’కి 30 ఏళ్ళు)కొన్నిసార్లు కొన్ని కాంబినేషన్లను జనం భలేగా ఆదరిస్తారు. వినోద్ కుమార్, రోజా జంటను అప్పట్లో ప్రేక్షకులు మెచ్చారు. వారు నటించిన చిత్రాలను బాక్సాఫీస్ వద్ద సక్సెస్ రూటులో సాగేలా చేశారు. అలా వారు నటించిన ‘సీతారత్నం గారి అబ్బాయి’ చిత్రాన్ని విజయపథంలో పయనింప చేశారు. 1992 మార్చి 19న విడుదలైన ‘సీతారత్నంగారి అబ్బాయి’ మంచి విజయం సాధించి, వినోద్ కుమార్, రోజా జోడీకి మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ […]
(మార్చి 19న శ్రీనివాస్ అవసరాల పుట్టినరోజు)తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ చిత్రసీమలో సాగిపోతున్నారు నటదర్శక రచయిత శ్రీనివాస్ అవసరాల. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అవసరాల మెగాఫోన్ పట్టి డైరెక్షన్ చేస్తున్నాడు. చదువుకొనే రోజుల్లోనూ, ఆ తరువాత ప్రిన్స్ టన్ ప్లాస్మా ఫిజిక్స్ లాబోరేటరీలో పనిచేసిన అవసరాల శ్రీనివాస్ మనసు మాత్రం సినిమాపైనే ఉండేది. దాంతో అమెరికాలో పనిచేస్తున్న సమయంలోనే లీ స్ట్రాస్ బెర్గ్ థియేటర్ అండ్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో చేరి శిక్షణ తీసుకున్నాడు. ‘బ్లైండ్ […]
(మార్చి 19న నటనిర్మాత మోహన్ బాబు పుట్టినరోజు)విలక్షణమైన అభినయానికి మారుపేరుగా నిలిచారు డాక్టర్ ఎమ్.మోహన్ బాబు. ఆయన కెరీర్ గ్రాఫ్ లో ఉవ్వెత్తున ఎగసి, ఉస్సూరుమని కూలిన కెరటాలు కనిపిస్తాయి. పలు ఎత్తులు, పల్లాలు చూశారాయన. అసలు తెలుగునాట అలాంటి ఆటుపోట్లు మరో స్టార్ కు ఎదురు కాలేదని చెప్పవచ్చు. అన్నిటినీ చిరునవ్వుతో గెలుచుకుంటూ ముందుకు సాగారు మోహన్ బాబు. 500పై చిలుకు చిత్రాల్లో నటించి, ఈ నాటికీ నటించడానికి ఉత్సాహం ప్రదర్శిస్తూనే ఉన్నారాయన. ఆయన అభినయంలోని […]
భారతీయ చిత్రసీమలో తండ్రికి తగ్గ తనయుడు, అన్నలకు తగ్గ తమ్ముడు అనిపించుకున్న నటుడు ఎవరు అంటే శశి కపూర్ పేరు ముందుగా వినిపిస్తుంది. మూకీల నుండి టాకీల ఆరంభం దాకా తనదైన బాణీ పలికించిన మహానటుడు పృథ్వీరాజ్ కపూర్ చిన్నకొడుకు శశి కపూర్. ఆయన అన్నలు రాజ్ కపూర్, షమ్మీ కపూర్ సైతం హిందీ చిత్రసీమలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆ ఇద్దరూ రొమాంటిక్ హీరోస్ గా జయకేతనం ఎగురవేశారు. వారి బాటలోనే పయనిస్తూ శశి […]