బాలీవుడ్ డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ తెలుగువాళ్ళకు సుపరిచితుడే! పలు హిందీ, మరాఠీ చిత్రాలను డైరెక్ట్ చేసిన ఆయన పదిహేనేళ్ళ క్రితం గోపీచంద్ ‘ఒక్కడున్నాడు’ మూవీతో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి అడపా దడపా తెలుగు సినిమాలు చేస్తూనే ఉన్నాడు. చిత్రం ఏమంటే ఆయన హిందీలో డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాలు తెలుగులో ఫ్రీ మేక్ కూడా అయిపోయాయి. అయితే ఆ మధ్య ఆయన రూపొందించిన మరాఠీ సినిమా ‘నట సమ్రాట్’ను కృష్ణవంశీ ఇప్పుడు […]
అనుకున్నంతా అయ్యింది! ఇటీవలి కాలంలో ఏ సినిమా కూడా అనుకున్న తేదీకి జనం ముందుకు రాలేదు. వర్మ ‘డేంజరస్’ మూవీ విషయంలోనూ అదే జరిగింది. అయితే మరీ దారుణంగా రిలీజ్ కు ఒక్క రోజు ముందు ఇలా జరగడం మాత్రం చిత్రంగానే ఉంది. పైగా గత పది రోజులుగా రామ్ గోపాల్ వర్మ తన హీరోయిన్లు నైనా గంగూలీ, అప్సరా రాణీ ని వెంటబెట్టుకుని దేశమంతా విమానంలో చక్కర్లు వేసొచ్చారు. ఇవాళ వర్మ పుట్టిన రోజు. అదే […]
గుబురుగా నల్లని గడ్డం పెంచి, తెల్లని పంచె కట్టి యంగ్ హీరో నాని “లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ జర్నీ…” అంటున్నాడు. అరె… డైలాగ్ బాగుందే… గెటప్ అదిరిందే! ఏ సినిమాలోదో? అనుకుంటే పొరబాటే! ‘మినిస్టర్ వైట్’ బ్రాండ్ కు నాని బ్రాండ్ అంబాసిడర్ గా అలా కనిపిస్తున్నారన్న మాట! లుంగీలు, పంచెలు, షర్ట్స్ ఉత్పాదనలో ‘మినిస్టర్ వైట్’ సాగుతోంది. ఈ బ్రాండ్ తో నాని కూడా పయనం సాగిస్తున్నారు. అందుకే ‘జీవితం అందమైన ప్రయాణం లాంటిది’ […]
ఈ మధ్య ‘ఎఫ్.ఐ.ఆర్.’ సినిమాతో సందడి చేసిన తమిళ హీరో విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’ చేయబోతున్నాడు. ఈ తాజా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదలయింది. మంగళవాయిద్యాలతో శుభకరంగా ఈ పిక్ మొదలవుతుంది. ‘వీరా వెడ్స్ కీర్తి’ అనీ కనిపిస్తుంది. ఓ వైపు పెళ్ళితంతు, మరోవైపు కుస్తీ పోరుకు సంబంధించిన ఇమేజెస్. చివరలో ‘మట్టి కుస్తీ’ టైటిల్ దర్శనమిస్తుంది. ‘ఎఫ్.ఐ.ఆర్.’ చిత్రానికి మాస్ మహారాజా రవితేజ సమర్పకునిగా వ్యవహరించారు. ఈ సినిమాకు కూడా రవితేజ సమర్పకుడు […]
బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి ‘కలియుగ్’ తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కునాల్ ఖేము. సినిమాలతో పాటు వెబ్ సీరిస్ తోనూ నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకుంటున్నాడు కునాల్. తాజాగా అతను నటించిన ‘అభయ్’ వెబ్ సీరిస్ సీజన్ త్రీ జీ 5లో ఈ నెల 8 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. విశేషం ఏమంటే… హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ దీన్ని డబ్ చేస్తున్నారు. తెలుగు వర్షన్ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో కునాల్ ఖేముతో […]
నాగచైతన్యకు విడాకులు ఇవ్వకముందే గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’కు సైన్ చేసింది సమంత. ఆ తర్వాత కొద్దిరోజులకే నాగచైతన్య, సమంత ఇద్దరూ తమ వివాహ బంధాన్ని తెంచుకుంటున్నట్టు విడివిడిగా ప్రకటించారు. ఆ తర్వాత సమంత నటిగా కొనసాగుతుందా? లేదా? అనే ప్రశ్న చాలామందిలో ఉదయించింది. వాటికి చెక్ పెడుతూ సమంత మరో పాన్ ఇండియా మూవీ ‘యశోద’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హరి – హరీశ్ సంయుక్త దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న […]
ప్రముఖ తైవాన్ నటుడు జిమ్మీ వాంగ్ యు కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు జాకీచాన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘ఇది షాకింగ్ న్యూస్. మరో మార్షల్ ఆర్ట్స్ హీరో మనల్ని వీడాడు. కుంగ్ ఫూ సినిమాలకు మీరు అందించిన సహకారం, యువ తరాలకు పలికిన మద్దతు, అందజేసిన జ్ఞానం పరిశ్రమలో ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. మీ సినిమాలు అభిమానుల హృదయాల్లో ఎప్పుడూ నిలిచి ఉంటాయి. మేము నిన్ను మర్చిపోలేము’ అన్నారు. జిమ్మి వాంగ్ వయసు 79 […]
ఓ టాప్ హీరో సినిమా అంటే చాలు… ట్రైలర్ లో కావలసినంత కాల్పులు, లెక్కలేనన్ని కత్తులు కటార్లు, పొడుచుకోవడం, చంపుకోవడం, రక్తసిక్తం- ఇలాంటి అంశాలన్నీ దర్శనమిస్తూ ఉంటాయి. ఈ మధ్య ఇది కామన్ అయిపోయింది. తమిళ టాప్ స్టార్ విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ ట్రైలర్ కూడా ఇలాగే రూపొందింది. కొత్తదనమేమీ కనిపించదు. మూడు రోజుల క్రితం తమిళంలో సందడి చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు తెలుగులోనూ అనువాదపు పలుకులతో అలరించే ప్రయత్నం చేస్తోంది. విజయ్ హీరోగా […]
తెలుగులో సీనియర్ హీరోలే కాదు యువ కథానాయకులు కూడా ఇప్పుడు వెబ్ సీరిస్ లో నటించడానికి ముందుకొస్తున్నారు. ఇటీవలే సుశాంత్ ఓ వెబ్ సీరిస్ లో నటిస్తున్నట్టు ప్రకటించాడు. తాజాగా మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ సైతం వెబ్ సీరిస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. జీ 5 ఒరిజినల్ వెబ్ సీరీస్ ‘అహ నా పెళ్ళంట’లో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ గా శివానీ రాజశేఖర్ నటిస్తోంది. గతంలో ‘ఏబీసీడీ’ చిత్రాన్ని డైరెక్ట్ […]
వచ్చే వారం వివిధ భాషలకు చెందిన, మూడు విభిన్న కథా చిత్రాలు వెండితెరపై వెలుగులు విరజిమ్మబోతున్నాయి. ఇళయ దళపతి విజయ్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘బీస్ట్’ ఏప్రిల్ 13న అంటే బుధవారం రాబోతోంది. ఆ రోజుకో ప్రత్యేకత ఉంది. ఏప్రిల్ 15 గుడ్ ఫ్రైడే. దానికి ముందు వచ్చే బుధవారాన్ని క్రైస్తవులు ‘హోలీ వెడ్ నెస్’ గా భావిస్తారు. అందుకే తన ‘బీస్ట్’ చిత్రాన్ని శుక్రవారానికి రెండు రోజుల ముందే ప్రపంచవ్యాప్తంగా విజయ్ విడుదల చేయబోతున్నాడు. […]