(మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే)ఈ నాటి నటవారసుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు రామ్ చరణ్. తండ్రి చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకుంటూనే, తనదైన బాణీ పలికిస్తున్నారు చరణ్. నటనిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటున్నారు. తండ్రి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’తో నిర్మాతగా మారిన రామ్ చరణ్, తరువాత తండ్రితోనే ‘సైరా…నరసింహారెడ్డి’ సినిమాను అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు. ఇప్పుడు నాన్నతో కలసి నటిస్తూ ‘ఆచార్య’ చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. […]
(మార్చి 26న ప్రకాశ్ రాజ్ పుట్టినరోజు)భయపెట్టాడు… నవ్వించాడు… కవ్వించాడు… ఏడ్పించాడు… ఏది చేసినా తనదైన బాణీ పలికించారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. వందలాది చిత్రాలలో తనదైన అభినయంతో అలరించిన ప్రకాశ్ రాజ్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య జరిగిన ‘మా’ ఎన్నికల సమయంలోనూ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుల జాబితాలో ఆయన పేరు చోటు చేసుకోవడంతోనూ ప్రకాశ్ రాజ్ గురించిన చర్చలు సాగుతున్నాయి. ప్రకాశ్ రాజ్ 1965 మార్చి 26న […]
ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి దిన పత్రికల మాజీ సంపాదకులు, ప్రముఖ రచయిత, జాతీయవాది ఎం.వి.ఆర్. శాస్త్రి తాజాగా సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను ‘నేతాజీ’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. దానిని ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో విడుదల చేశారు. అయితే ఆ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హాజరు కావాల్సి ఉంది. కానీ అదే సమయంలో ముందుగా అంగీకరించిన కార్యక్రమం కారణంగా పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో పాల్గొనలేదు. కానీ ఆ పుస్తకం విడుదలైన వెంటనే […]
‘ట్రిపుల్ ఆర్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్ ఇటీవలే దేశంలోని నాలుగు మూలలు చుట్టివచ్చారు. అంతేకాదు… వివిధ భాషల్లోని ఛానెల్స్ కు ఇంటర్వ్యూలూ ఇచ్చారు. అలా మలయాళ ప్రేక్షకుల కోసం ఇచ్చిన ఇంటర్వూలో ఎన్టీయార్… ‘ఇటీవల కాలంలో తన ఫోన్ లో ఎక్కువ సార్లు విన్న పాట ‘ఆశా పాశం’ మని చెప్పారు. ‘కేరాఫ్ కంచర పాలెం’లోని ఆ పాట అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన ఎన్టీయార్ ఆ […]
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృతోత్సవ్’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. పలు మీడియా సంస్థలు ఈ సందర్భంగా అన్ సంగ్ హీరోస్ గురించి వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అయితే మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు అండమాన్ లో ఆజన్మాంత ఖైదీగా జీవితాన్ని గడిపారు వినాయక్ దామోదర సావర్కర్. ఆయన చరిత్రను రకరకాల కారణాల వల్ల ఎవరికి తోచిన విధంగా వారు అన్వయిస్తున్నారు. హిందుత్వ వాది అయిన కారణంగా వీర సావర్కర్ ను గత ప్రభుత్వాలు […]
(మార్చి 23న కంగనా రనౌత్ పుట్టినరోజు)కంగనా రనౌత్ అందాల అభినయానికి జనం జేజేలు పలికారు. కానీ, ఇప్పుడు కంగన పేరు వినగానే ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ముందుగా గుర్తుకు వస్తుంది. ఆ దూసుకుపోయే మనస్తత్వమే కంగనాను ఆ స్థాయికి తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. భారతదేశంలో అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న నటిగా కంగనా రనౌత్ పలుమార్లు వార్తల్లో నిలచింది. ఫోర్బ్స్ మేగజైన్ లోనూ వరుసగా చోటు సంపాదించింది. వివాదాలతో విశేషాలకు తావివ్వడమే కాదు, నటనతోనూ నేషనల్ అవార్డ్స్ […]
(మార్చి 23న శ్రీకాంత్ పుట్టినరోజు)సినిమా రంగం అంటే ఎంతోమందికి మోజు. అక్కడ రాణించాలని, తారాపథంలో సాగిపోవాలని ఎంతోమంది కలలుకంటూ ఉంటారు. ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. ఏదైనా సినిమా చూసి, అందులో తనకు నచ్చిన పాత్రను తానయితే ఇలా చేస్తాననీ కలల్లో తేలిపోతారు. అయితే స్వప్నాలను సాకారం చేసుకొనేవారు కొందరే ఉంటారు. చిత్రసీమలో అలాంటివారికి కొదువలేదు. వారిలో నిన్నటి హీరో, నేటి కేరెక్టర్ యాక్టర్, విలన్ శ్రీకాంత్ కూడా ఉన్నారు. బిట్ రోల్స్ లో మొదలైన శ్రీకాంత్ సినీ […]
కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని అంటారు. అలా ఒక్కోసారి ఊహించని కష్టాలు సినిమా వాళ్ళకూ వస్తుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె సోకాల్డ్ బోయ్ ఫ్రెండ్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. కోలీవుడ్ సమాచారం మేరకు వీరు నిర్వహిస్తున్న రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థపై సోషల్ యాక్టివిస్ట్ కన్నన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడట. సంస్థ పేరులోని రౌడీ అనే పదాన్ని తొలగించాలని, అలాంటి అభ్యంతరకరమైన […]
Nadigar Sangam Meet CM MK Stalin. నడిగర్ సంఘం ఎన్నికల్లో రెండో సారి జయకేతనం ఎగురవేసింది పాండవర్ బృందం. 2019లో జరిగిన ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆదివారం ఓట్ల లెక్కింపు జరిపి, విజేతలను ప్రకటించారు. దాంతో కొత్తగా నడిగర్ సంఘానికి ఎన్నికైన అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ తదితరులు మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ ఎన్నికల్లో స్టాలిన్ తనయుడు […]