Nivetha Pethuraj: ‘బ్లడీ మేరీ’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కథానాయిక నివేదా పేతురాజ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘బ్లడీ మేరీ’. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను అందించే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చందు మొండేటి డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం డైరెక్ట్ చేశాడు. వీరిద్దరికీ ఇది ఫస్ట్ ఓటీటీ మూవీ కావడం విశేషం. మంగళవారం ఈ సినిమాలో టైటిల్ పాత్రలో నటించిన నివేదా పేతురాజ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే పవర్ ఫుల్, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది. నివేదా పేతురాజ్ పదునైన కత్తిని పట్టుకుని భయంకరమైన ఓ రూపంతో ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నిలుచుని ఉంది. ఇందులో ఆమెకు వైకల్యం ఉన్నప్పటికీ ఆమె తనకు ఎదురు కాబోయే సమస్యను ఎదుర్కొనేంత ధైర్యంగా కనిపిస్తోంది.
మేరీ తన వారిని రక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళుతుందనే విషయం స్పష్టమవుతోంది. కిరిటీ దామరాజు, రాజ్ కుమార్ కశిరెడ్డి, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈయన దీనికి ముందు సై ఫై థ్రిల్లర్ ‘కుడి ఎడమైతే’ను నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించిన ‘బ్లడీ మేరీ’కి కాల భైరవ సంగీత సారథ్యం వహించారు. త్వరలోనే ఈ మూవీ ఆహాలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
తాజావార్తలు
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!