Charmme Kaur @ 20 Years : ఇరవై ఏళ్ళ ఛార్మి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఛార్మి తొలి చిత్రం ‘నీ తోడు కావాలి’కి 20 ఏళ్ళు)
అందాల భామ, ప్రముఖ నిర్మాత ఛార్మి మార్చి 28తో ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అరె… ఛార్మి వయసు అంతేనా? అనుకుంటున్నారా? నటిగా ఛార్మి వయసు అది. ఆమె తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ‘నీ తోడు కావాలి’. ఈ సినిమా 2002 మార్చి 28న జనం ముందు నిలచింది. కేవలం పదిహేనేళ్ళ వయసులోనే కెమెరా ముందు నిలచి, నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఛార్మి. అందం, అభినయం కలబోసుకున్న ఛార్మి కౌర్ కొన్ని సార్లు చిందులతోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం నటనకు దూరంగా జరిగినా, చిత్రసీమలోనే నిర్మాతగా కొనసాగుతోంది ఛార్మి.
భీమనేని శ్రీనివాసరావు నిర్మించి, దర్శకత్వం వహించిన ‘నీ తోడు కావాలి’తో ఛార్మి నటిగా వెలుగు చూసింది. దీపక్ హీరోగా తెరకెక్కిన ‘నీ తోడు కావాలి’లో మానస పాత్రలో భలేగా నటించి ఆకట్టుకుంది ఛార్మి. తరువాత హిందీ, తమిళ, మళయాళ, కన్నడ సినిమాల్లోనూ సాగింది. కానీ, నటిగా ఆమెకు గుర్తింపు సంపాదించి పెట్టినవి తెలుగు చిత్రాలే అని చెప్పాలి. కృష్ణవంశీ ‘శ్రీఆంజనేయం’లో ఛార్మి అందం ఆ నాటి కుర్రకారుకు గంధం పూసింది.
Also Read
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
‘మాస్’లో నాగార్జునతో మజాగా చిందేసింది. ‘అల్లరి పిడుగు’లో బాలకృష్ణతో తకధిమితై అంటూ ఆడింది. ‘లక్ష్మీ’లో వెంకటేశ్ తో పసందుగా సాగింది. టాప్ స్టార్స్ తో నటించి, విజయాలను చూసినా, వారి చిత్రాల్లో ఛార్మి సైడ్ హీరోయిన్ గానే వెలిగింది తప్ప, సోలో హీరోయిన్ గా మురిపించలేకపోయింది. కృష్ణవంశీ తెరకెక్కించిన ‘చక్రం, రాఖీ’ చిత్రాలతోనూ నటిగా మంచి మార్కులు సంపాదించింది. ప్రభాస్ ‘పౌర్ణమి’లో ఛార్మి మరపురాని పాత్రనే ధరించింది. కొన్ని చిత్రాలలో అతిథి పాత్రల్లోనూ మురిపించింది, ప్రత్యేక గీతాల్లోనూ అలరించింది. లేడీ ఓరియెంటెండ్ మూవీస్ “మంత్ర, మంగళ, అనుకోకుండా ఒక రోజు”లలో తనదైన బాణీ పలికించింది ఛార్మి. హిందీలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘బుడ్డా… హోగా తేరా బాప్’లో అమితాబ్ బచ్చన్ తోనూ కలసి నటించింది. ‘మంత్ర’గా తనదైన అభినయంతో ఉత్తమనటిగా నంది అవార్డును సొంతం చేసుకున్న ఛార్మి ఆపై కూడా కొన్ని చిత్రాలలో ముద్దు ముద్దుగా మురిపించింది. కృష్ణవంశీ ‘చందమామ’లో కాజల్ కు ఛార్మి గాత్రం కూడా అందించింది.
ఛార్మి అందం మందమైనా, ఆమెలోని చలాకీ తనాన్ని ఇప్పటికీ ఇష్టపడేవారు ఎందరో ఉన్నారు. పూరి జగన్నాథ్ ‘జ్యోతిలక్ష్మి’ లో వైవిధ్యమైన పాత్రలో ఆకట్టుకుంది ఛార్మి. ఈ సినిమాతోనే నిర్మాణభాగస్వామిగా తన రూటు మార్చింది. పూరి జగన్నాథ్ తో ఏర్పడిన పరిచయంతో ‘పూరి కనెక్ట్స్ ‘ బ్యానర్ లో ఛార్మి కూడా నిర్మాణభాగస్వామిగా కొనసాగుతోంది. ఈ బ్యానర్ తో మరికొందరు నిర్మాతలతోనూ కలసి చిత్రాలను నిర్మించింది. బాలకృష్ణ ‘పైసా వసూల్’, రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, పూరి తనయుడు ఆకాశ్ నటించిన ‘మెహబూబా’ చిత్రాల నిర్మాణంలో ఛార్మి భాగస్వామి. విజయ్ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వంలో హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతోన్న ‘లైగర్’ నిర్మాణంలోనూ ఛార్మి పాలు పంచుకుంది. భవిష్యత్ లో తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మిస్తానని అంటున్న ఛార్మి, మళ్ళీ ఎప్పుడు తెరపై తళుక్కుమంటుందో చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి అదెప్పుడు సాధ్యమవుతుందో చూడాలి!
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!