సూపర్ స్టార్స్ సినిమాల మధ్య పోటీలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా వంటి పండగ సమయాల్లో ఈ పోటీలు అనివార్యం! సమ్మర్ సీజన్ లోనూ అడపాదడపా ‘టైటాన్స్ క్లాష్’ జరుగుతూ ఉంటాయి. ఈ సమ్మర్ లో మెగాస్టార్ సినిమాతో, సౌత్ లేడీ సూపర్ స్టార్ మూవీ పోటీకి సై అనడం ఇక్కడ విశేషం! మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ చిత్రానికి […]
ఎవరైనా ఇద్దరు ఓ విషయంలో వాదించుకుంటూ, పక్కనే ఉన్నవారిని “మీరైనా చెప్పండి..” అని అడిగితే, అందులో తలదూర్చడం ఇష్టం లేనివారు- “ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి..” అనడం సహజం. అవే మాటలను బ్రహ్మానందం నోట పలికించి, ఆ మాటలకు విశేషమైన ప్రాచుర్యం కలిగించిన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా చూసినవారెవరైనా అందులో చారి పాత్రధారి బ్రహ్మానందం పలు మార్లు ఈ పదాలు పలికి, చేసిన కామెడీని మరచిపోలేరు. ఇప్పటికీ కొందరు సమయోచితంగా “ఇందులో మమ్మల్ని ఇన్ వాల్వ్ […]
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ సినిమా ట్రైలర్ జనం ముందు నిలచింది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కింది. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవితో రామ్ చరణ్ కలసి గతంలో ‘మగధీర, బ్రూస్లీ, ఖైదీ నంబర్ 150’ చిత్రాలలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే, తండ్రితో కలసి […]
ఏప్రిల్ 11వ తేదీకి ఎన్టీయార్ వెండితెర నటుడిగా పాతికేళ్ళు పూర్తి చేసుకున్నాడు. చిత్రం ఏమంటే సిల్వర్ స్క్రీన్ పైకి రావడమే రాముడి పాత్రతో వచ్చాడు ఎన్టీయార్. ఆయన తాతయ్య నటరత్న ఎన్టీయార్ సైతం రాముడి పాత్రలతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరమైన స్థానం పొందారు. ఈ బాల రాముడు సైతం అందరితోనూ భళా అనిపించుకున్నాడు. చిన్నప్పటి నుండి శాస్త్రీయ నృత్యాన్ని సైతం నేర్చుకున్న ఎన్టీయార్ హీరోగా ఎదిగిన తర్వాత కూడా కొన్ని సినిమాలలో పౌరాణిక పాత్రల్లో మెరుపులా […]
ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకో శుభవార్త! అతి త్వరలోనే మహేశ్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కు చిత్ర బృందం గుమ్మడికాయ కొట్టేయబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట చిత్రీకరణ మినహా మొత్తం షూటింగ్ పూర్తయిపోయింది. ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మహేశ్ బాబు సరసన తొలిసారి కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. పరశురామ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో ఎన్నడూ చూడని మహేశ్ ను […]
మెగా ఫ్యామిలీ హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్రం శుక్రవారం జనం ముందుకు వచ్చింది. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ మూవీతో దర్శకుడిగా కిరణ్ కొర్రపాటి, హీరోయిన్ గా సాయీ మంజ్రేకర్ తెలుగువారికి పరిచయం అయ్యారు. ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, నదియా, నవీన్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ళు వరుణ్ తేజ్ కష్టపడ్డాడు. […]
ఏమది? ఎంతటి ఆశ్చర్యం!? దక్షిణాదిన నేడు తెలుగు సినిమారంగంతో పోటీ పడే స్థితి ఎవరికీ లేదే? అటువంటిది ఓ కన్నడ పాన్ ఇండియా మూవీ మన తెలుగు క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ రికార్డును అధిగమించుటయా!? ఎంతటి విడ్డూరమూ! రాజమౌళి భారీ ప్రాజెక్ట్ గా విడుదలైన ‘ట్రిపుల్ ఆర్’ మూవీ ఉత్తరాదిన మంచి వసూళ్ళు చూసిందని ఇటీవల హిందీ రైట్స్ తీసుకున్న వారు ముంబయ్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాను కూడా ఆహ్వానించి, తమ ఆనందం పంచుకున్నారు. […]
డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోందనగానే సదరు సినిమాపై ప్రేక్షకుల్లో పలు చర్చలు మొదలవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అంతటి స్టార్ డమ్ చూసిన డైరెక్టర్ మరొకరు కానరారు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-1’ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకోవడం, రాజమౌళి తరం దర్శకుల్లో ఆయనకు మాత్రమే ‘పద్మ’ పురస్కారం లభించడం ఇత్యాది అంశాలు సైతం రాజమౌళి అనగానే నేషనల్ లెవెల్లో ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి. రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ టిక్కెట్ […]
ఇటీవల కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సౌత్ రీజన్ ఆధ్వర్యంలో చెన్నయ్ లో ఘనంగా సమ్మెట్ జరిగింది. దాని నిర్వహణకు తనవంతు సహకారాన్ని సంపూర్ణంగా అందించింది సీనియర్ నటి ఖుష్బూ. ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తమిళనాడు సీఎం స్టాలిన్ ను సాదరంగా ఆహ్వానించి, తన తోటి నటీమణులతో కలిసి ఆయనతో ఫోటో కూడా దిగి సోషల్ మీడియాలో ఖుష్బూ పోస్ట్ చేసింది. చిత్రం ఏమంటే… ఆ మధ్య ఖుష్బూ భర్త సుందర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన […]
యంగ్ హీరో రాహుల్ విజయ్, బ్యూటిఫుల్ హీరోయిన్ మేఘ ఆకాష్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పకురాలు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతల్లో ఒకరైన సుశాంత్ రెడ్డి కథను అందించగా… అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా […]