నిన్నుకోరి, మజిలి వంటి సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ ఖుషి ప్లాప్ తో కాస్త స్లో అయ్యాడు. కాస్త లాంగ్ గ్యాప్ తీసుకుని మరొక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ మహారాజ రవితేజ హీరోగా సినిమా చేయబోతున్నాడు. కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. థ్రిలర్ జానర్ లో ఈ సినిమా రాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతుంది. త్వరలోనే ఈ సినిమాకు […]
స్టార్ హీరోయిన్ కావాలంటే తెలుగులో నటించాల్సిందే. అలా చేస్తేనే స్టార్డమ్ దక్కుతుందని సంయుక్త మీనన్ కూడా నిరూపించింది. స్టార్డమ్మే కాదు. విచిత్రంగా స్టార్స్‌తో ఒక్కరితో జత కట్టకపోయినా క్రేజీ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది సంయుక్త. ఏదో అరకొర సినిమాతో సరిపెట్టుకోవడం లేదు. ఏకంగా 9 సినిమాలు చేస్తోంది. అందులో 7 సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కావడం గమనార్హం. Also Read : Kollywood : AVM స్టూడియోస్ సంస్థ అధినేత AVM శరవణన్ కన్నుమూత మలయాళం […]
తమిళ సినిమా చరిత్రలో AVM స్టూడియోస్ కు ప్రతీక గుర్తింపు ఉంది. AVM ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అంతటి పేరు ప్రఖ్యాతలు కలిగిన ఏవిఎమ్ ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరైన ప్రముఖ సినీ నిర్మాత M. శరవణన్ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. 86 సంవత్సరాల వయసులో వయోభారం కారణంగా చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు ఒక శకానికి ముగింపు పలికానట్టయింది. Also Read […]
తెలుగులో రిపీట్ సీజన్ నడుస్తోంది . స్టార్ హీరోల్లో సగం మందికిపైగా కలిసొచ్చిన డైరెక్టర్స్‌తోనే వర్క్ చేస్తున్నారు. ఈ రిపీట్ కాంబినేషన్ మూవీస్‌కు వస్తున్న హైప్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ కెరీర్లో ‘వాల్తేరు వీరయ్య’ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇంతటి హిట్ ఇచ్చిన బాబీకి చిరు మరో ఛాన్స్ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ తీసిన ‘డాకు మహారాజ్’ కూడా సక్సెస్ కావడంతో.. హిట్ సెంటిమెంట్‌ను మెగాస్టార్ కంటిన్యూ చేస్తున్నాడు. కొత్తవాళ్లకు ఛాన్సులిచ్చి వరుస […]
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరక్కేక్కిన చిత్రం ‘అఖండ-2′. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షోస్ తో రిలీజ్ కు రెడీ అయింది. అందుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా సాలిడ్ టికెట్స్ సెల్లింగ్స్ తో దూసుకెళ్తోంది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ముంబై, ఢిల్లీ […]
మిస్టర్ బచ్చన్‌తో ఓవర్ నైట్ కుర్రాళ్ల క్రష్ బ్యూటీగా మారిన భాగ్యశ్రీ బోర్సేకి క్రేజేతే ఉంది కానీ లక్ మాత్రం ఆమడ దూరంలో ఆగిపోతోంది. కెరీర్ స్టార్టింగ్ నుండి ప్లాపులు పలకరిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్లో సరైన ఐడెంటిటీ రాకపోవడంతో టాలీవుడ్లో పాతుకుపోవాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.. గ్లామర్ షోతో డామినేట్ చేస్తొంది కానీ హిట్ సౌండ్ వినలేకపోతోంది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయితే ఈ ఏడాది వచ్చిన కింగ్డమ్ ఆమెను నిరాశపర్చింది. Also Read : Dacoit : […]
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ బాగా నడుస్తోంది. కథలో విషయం లేకున్నా కూడా పక్క భాషాల నుండి నటీనటులను తీసుకువచ్చి దానికి పాన్ ఇండియా కలర్ పూస్తున్నారు మేకర్స్. ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శేష్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘ డెకాయిట్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. Also Read : TheRajaSaab […]
రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ సినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ కథానాయికలు కాగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా నుండి […]
ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ సినిమాలో హీరోయిన్గా ‘రుక్మిణి వసంత్‌ను తీసుకున్నారు. అయితే ఈ విషయం బైటకొచ్చాక రుక్మిణి నటించిన మదరాసి ఫ్లాప్ అయింది. అసలు ఈ అమ్మడికి ఈమధ్య కాలంలో హిట్టే లేదు. దీంతో ఈ అమ్మడిపై ఐరెన్ లెగ్ ముద్రపడింది. కోరి కోరి రుక్మిణిని హీరోయిన్గా తీసుకున్నారన్న భయం తారక్ ఫ్యాన్స్‌లో వుండిపోయింది. అయితే ఈ భయాన్ని కాంతార చాప్టర్ 1 హిట్ పోగొట్టింది. 2019లో వెండితెరపైకి అడుగుపెట్టిన రుక్మిణి, రక్షిత్‌శెట్టితో నటించిన ‘సప్త సముద్రాలు దాటి’ […]
తెలుగు సినిమా కథలను జపాన్‌తో లింక్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా జపాన్ కథతోనే రూపుదిద్దుకోనుంది. ఓజీ పూర్వీకులు ఇండియా నుంచి జపాన్ వెళ్లి సెటిలవుతారు. అక్కడే గురువు దగ్గర యుద్ధకళ విద్యలు నేర్చుకుంటాడు హీరో. చిన్నప్పుడే బాంబే వచ్చేసి గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు. ఇలా ఓజీ కథను జపాన్‌తో లింక్ చేసి స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక ఓజీ కంటే ముందే […]