తెలుగు సినిమా కథలను జపాన్‌తో లింక్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా జపాన్ కథతోనే రూపుదిద్దుకోనుంది. ఓజీ పూర్వీకులు ఇండియా నుంచి జపాన్ వెళ్లి సెటిలవుతారు. అక్కడే గురువు దగ్గర యుద్ధకళ విద్యలు నేర్చుకుంటాడు హీరో. చిన్నప్పుడే బాంబే వచ్చేసి గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు. ఇలా ఓజీ కథను జపాన్‌తో లింక్ చేసి స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక ఓజీ కంటే ముందే పుష్ప2 కోసం బన్నీ జపాన్ వెళ్లాడు. పుష్ప2 స్టార్టింగ్ సీనే జపాన్‌లో మొదలవుతుంది. పుష్ప3 చూస్తేగానీ జపాన్‌కు పుష్పరాజ్‌కు సంబంధం ఏమిటో తెలుస్తుంది. మన సినిమాలకు జపాన్‌లో క్రేజ్ ఎక్కువే.
Also Read : Bollywood : హిందీలో ఆరు సినిమాలతో షేకాడిస్తున్న పాల బ్యూటీ
రజనీకాంత్ నటించిన ముత్తు సినిమాతో జపాన్ లో సౌత్ సినిమాల ట్రెండ్ మొదలైంది. ముత్తు జపాన్‌లో భారీ వసూళ్లు రాబట్టింది. సూపర్‌స్టార్ స్టైలిష్ యాక్షన్‌కు జపనీస్ ఫిదా అయిపోయారు. మన పాటలకు రీల్స్ చేయడం.. ముత్తులోని థిల్లానా సాంగ్‌తో మొదలైంది. రజనీకాంత్ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ జపనీస్‌కు దగ్గరయ్యాడు. ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలను జపనీష్ భాషల్లో రీమేక్ చేసి మరి అక్కడి థియేటర్స్ లో రిలీజ్ చేస్తారు అది అక్కడ ఎన్టీఆర్ క్రేజ్. RRR ఈవెంట్ కోసం తారక్ జపాన్ వెళ్తే జపనీస్ ప్యాన్స్ తెలుగులో మాట్లాడి ఎన్టీఆర్‌కు షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్‌ను కలవడానికి జపాన్ నుంచి వచ్చిన వీరభిమానులూ వున్నారు. జపాన్ సెంటిమెంట్‌ను అల్లు అర్జున్ కంటిన్యూ చేస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో జపాన్ కొరియోగ్రాఫర్ హొకూతో కొనిషి ఓ స్పెషల్‌సాంగ్‌కు డ్యాన్స్ మూమెంట్స్ ఇస్తున్నాడు. దీపిక్ పదుకునే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్‌గా రూపొందుతోంది. ఇలా తెలుగు సినిమాలకు జపాన్ ఓ సెంటిమెంట్‌గా మారింది.