Tollywood : హిట్ దర్శకులను రిపీట్ చేస్తున్న టాలీవుడ్ హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో రిపీట్ సీజన్ నడుస్తోంది . స్టార్ హీరోల్లో సగం మందికిపైగా కలిసొచ్చిన డైరెక్టర్స్‌తోనే వర్క్ చేస్తున్నారు. ఈ రిపీట్ కాంబినేషన్ మూవీస్‌కు వస్తున్న హైప్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ కెరీర్లో ‘వాల్తేరు వీరయ్య’ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇంతటి హిట్ ఇచ్చిన బాబీకి చిరు మరో ఛాన్స్ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ తీసిన ‘డాకు మహారాజ్’ కూడా సక్సెస్ కావడంతో.. హిట్ సెంటిమెంట్‌ను మెగాస్టార్ కంటిన్యూ చేస్తున్నాడు. కొత్తవాళ్లకు ఛాన్సులిచ్చి వరుస హిట్స్ కొట్టిన బాలయ్య మారిపోయాడు. ఈ హీరో సినిమాల లైనప్ చూస్తుంటే కొత్తవాళ్లకంటే హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్‌నే రిపీట్ చేస్తున్నాడు. వీరసింహారెడ్డి ఫేం గోపీచంద్ మలినేనికి మరో ఛాన్స్ ఇచ్చాడు. తనకు బాగా కలిసొచ్చిన వెంకటేశ్‌ను అనిల్ రావిపూడి వదిలిపెట్టే సమస్యే లేదంటున్నాడు. ఎఫ్2..ఎఫ్3.. సంక్రాంతి వస్తున్నాం తర్వాత అనిల్ తీస్తున్న ‘మన శంకరవరప్రసాద్’లో వెంకీకి క్యామియో రోల్ ఇచ్చాడు. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కథను రెడీ చేస్తాడు అనిల్.
Also Read : Akhanda2 Thaandavam : మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్.. ఇప్పటికి ఓపెన్ కానీ నైజాం బుకింగ్స్
Also Read
- Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్‌పాట్ తగిలినట్టేనా?
- Janga Glimpse : నోట్లో మందు బాటిల్.. వరలక్ష్మి తూటాల వర్షం
- Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. 'ఆకాశంలో ఒక తార'కు బన్నీ బూస్ట్!
- Dil Raju - Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్‌తోనే సినిమా!
ఇక బన్నీ త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు వచ్చాయి. రామ్‌చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చేస్తున్నాడు. ఆ తర్వాత కలిసొచ్చిన సుకుమార్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ సూపర్ హిట్ అయింది. జల్సా తర్వాత పవన్ కొన్నేళ్లపాటు సక్సెస్ చూడలేదు. ఇలాంటి టైంలో వచ్చిన గబ్బర్‌సింగ్ పవన్‌కు అదిరిపోయే హిట్ ఇచ్చింది. గబ్బర్‌సింగ్ కాంబో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రూపొందుతోంది. ఓజీ హిట్ కావడంతో సీక్వెల్‌కు డేట్స్ ఇస్తానని మాటిచ్చాడు. స్టార్సే కాదుయంగ్ హీరోలు సైతం హిట్ ఇచ్చిన డైరెక్టర్ని రిపీట్చేస్తున్నాడు. దసరా హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ చేస్తున్నారు. టాక్సీవాలా తర్వాత విజయ్ దేవరకొండ కలిసొచ్చిన సంకృత్యయాన్తో వర్క్ చేస్తున్నాడు.
తాజావార్తలు
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
-
Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్‌పాట్ తగిలినట్టేనా?
-
CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
-
Achanta: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేస్తే రూ. 2 కోట్లు ఇస్తా.. జనసేన నేత సంచలన ప్రతిపాదన..
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!