Bhagyashri Borse : భాగ్యశ్రీ ఖాతాలో మరో ప్లాప్.. ఇక అయ్యగారే బ్రేక్ ఇవ్వాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిస్టర్ బచ్చన్‌తో ఓవర్ నైట్ కుర్రాళ్ల క్రష్ బ్యూటీగా మారిన భాగ్యశ్రీ బోర్సేకి క్రేజేతే ఉంది కానీ లక్ మాత్రం ఆమడ దూరంలో ఆగిపోతోంది. కెరీర్ స్టార్టింగ్ నుండి ప్లాపులు పలకరిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్‌లో సరైన ఐడెంటిటీ రాకపోవడంతో టాలీవుడ్‌లో పాతుకుపోవాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.. గ్లామర్ షోతో డామినేట్ చేస్తొంది కానీ హిట్ సౌండ్ వినలేకపోతోంది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయితే ఈ ఏడాది వచ్చిన కింగ్డమ్ ఆమెను నిరాశపర్చింది.
Also Read : Dacoit : డెకాయిట్ మేకింగ్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న అడివి శేష్
Also Read
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
ఆ సినిమాతో మరో ప్లాప్ ఆమె ఖాతాలో పడి కెరీర్ని డైలామాలో పడేసింది. దాంతో ఆశలన్నీ దుల్కర్ సల్మాన్ పైనే పెట్టుకుంది. రానా, దుల్కర్ కాంబోలో నటించిన కాంత ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక లేటెస్ట్ గా తన ఆశలన్నీ ఆంధ్ర కింగ్ తాలూకా పై పెట్టుకుంది. నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రీమియర్స్ నుండి హిట్ టాక్ వచ్చింది. ఓవర్సీస్ లో రామ్ – భాగ్యశ్రీ కాలికి బలపం కట్టి మరి ప్రమోషన్ చేశారు. ఓపెనింగ్ బాగా అందుకున్న ఈ సినిమా అంచనాలు తలకిందులు చేస్తూ ప్లాప్ దిశగా పయనిస్తుంది. ఇక తెలుగు స్టేట్స్ లో అయితే ఏకంగా డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా రిజల్ట్ తో భాగ్యశ్రీ ఖాతాలో మరో ప్లాప్ వచ్చి చేరింది. ఇక భాగ్యం ఆశలన్నీ అయ్యగారు లెనిన్ పైనే. మరి ఆయ్యగారు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!