చాలా మంది ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగుతూ తమ రోజును ప్రారంభిస్తారు. దీంతో ఆరోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటామని భావిస్తుంటారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఈ అలవాటు దీర్ఘకాలంలో కొన్ని సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. నేటి బిజీ లైఫ్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అందుకే, ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగే బదులు, ఖాళీ కడుపుతో రెండు ఖర్జూరాలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని […]
ప్రకృతిలో లభించే పండ్లు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. అయితే పండిన అరటిపండ్లు, పుచ్చకాయ, ద్రాక్ష, మామిడి, లీచీ వంటి పండ్లలో సహజ చక్కెర శాతం ఎక్కువగా ఉండే కారణంగా, అవి రక్తంలో షుగర్ స్థాయిలను మరియు రక్తపోటును పెంచవచ్చని నిపుణులు చెప్పుతున్నారు. ఈ పరిస్థితులు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. పండ్లు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అనేక పోషకాలు కలిగి ఉన్నప్పటికీ, కొన్ని పండ్లను అధికంగా […]
బ్రెయిన్ స్ట్రోక్ అనేది అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. ఇది సంభవించిన వెంటనే చికిత్స అందించకపోతే, ప్రాణాలు కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ ప్రాణాంతక పరిస్థితిని ముందుగానే అరికట్టేందుకు స్విస్ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. రక్తనాళాల్లో ప్రయాణిస్తూ మెదడులో రక్తం గడ్డకట్టిన ప్రాంతాన్ని గుర్తించి తొలగించే మైక్రో రోబోట్లను వారు అభివృద్ధి చేశారు. ఈ మైక్రో రోబోట్లను చేతి భాగం లేదా తొడ ప్రాంతం ద్వారా చిన్న సూదితో రక్తనాళాల్లోకి పంపుతారు. రక్తప్రవాహంతో […]
ప్రస్తుతం యువతలో అనేక శారీరక, మానసిక మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో 60 ఏళ్ల వయస్సు దాటిన వారిలో మాత్రమే కనిపించే సమస్యలు ఇప్పుడు 10–20 ఏళ్ల మధ్య వయస్సులోనే బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. వెన్నునొప్పి, తీవ్రమైన అలసట, కీళ్ల బలహీనత, స్ట్రెస్ హార్మోన్ల పెరుగుదల, ఆందోళన, చిన్న వయస్సులోనే జుట్టు రాలడం, బట్టతల, డయాబెటిస్, థైరాయిడ్ వంటి జీవక్రియ సంబంధిత వ్యాధులు యువతను వేధిస్తున్నాయి. బయట కారణాలే కాదు, శరీరం లోపల జరిగే మార్పులు కూడా ఈ […]
చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో మన శరీరం చలికి వణికిపోవడం సాధారణం. ఈ సమయంలో కండరాలు గట్టిపడడం, కీళ్లలో ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, ఫైబ్రోమైయాల్జియా వంటి సమస్యలు ఉన్నవారికి ఈ కాలంలో నొప్పి మరింతగా ఉంటుంది. నిపుణుల ప్రకారం కొన్ని సులభమైన జీవనశైలి మార్పులతో ఈ సీజన్లో కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. వెచ్చగా ఉండే దుస్తులు ధరించండి చల్లని గాలి కండరాలు మరియు కీళ్లను గట్టిపరుస్తుంది.ఎప్పుడూ వెచ్చని […]
ఉద్యోగాలు లేదా వ్యాపారాల్లో పనిచేసే చాలా మంది రోజులో ఎక్కువ సమయం కూర్చునే ఉంటారు. దీర్ఘకాలం కదలకుండా కూర్చోవడం ఆరోగ్యానికి తీవ్ర హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశోధనలు చెబుతున్న దాని ప్రకారం, రెండు గంటలకు పైగా కదలకుండా అలాగే కూర్చోవడం—సిగరెట్ తాగడం కంటే కూడా ప్రమాదకరం. అందుకే దీనిని “నూతన ధూమపానం” (New Smoking) అని పిలుస్తున్నారు. ఎందుకు ఎక్కువ సేపు కూర్చోవడం ప్రమాదకరం? దీర్ఘకాలం కదలకుండా కూర్చోవడం వల్ల మన శరీరంలో మెటాబాలిజం తగ్గుతుంది. అంటే […]
చేపలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని హెల్త్ నిపుణులు చెబుతున్నారు. చేపల్లో ప్రోటీన్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ D, విటమిన్ B2 (రైబోఫ్లావిన్), ఐరన్, జింక్, అయోడిన్, మ్యాగ్నీషియం, పొటాషియం వంటి అత్యవసర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను నియంత్రించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాదు, మెదడు పనితీరును […]
సాధారణంగా చాలా మందికి పాములను చూసిన వెంటనే భయం పట్టేస్తుంది. కొందరే ధైర్యంగా వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇటీవల వర్షాలు భారీగా కురవడంతో పాములు చెట్లు, చెరువులు, పొదలు నీటమునగడం వల్ల మనుషుల నివాస ప్రాంతాల్లోకి చేరుతున్నాయి. అడవులు, చెట్లు, నీటి వనరులను మనుషులు అధికంగా వినియోగించడం వల్ల అడవుల్లో తిరగాల్సిన జంతువులు కూడా జనావాసాల్లోకి రావడం పెరిగింది. వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువ వర్షాకాలంలో ముఖ్యంగా పాములు ఇళ్ల ప్రాంగణాల్లో, చెట్ల కింద, గదుల్లో […]
మన వంటకాలలో సాధారణంగా చక్కెర, బెల్లం రెండింటినీ ఉపయోగిస్తుంటాం. కొందరు బెల్లం ఆరోగ్యానికి మంచిదని, చక్కెర మాత్రం అంత మంచిది కాదని అంటుంటారు. అయితే ఈ మాటలన్నిటిని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పాల్ మాణిక్యం తిప్పికొడుతున్నారు. బ్రౌన్ షుగర్ (బెల్లం) కానీ, తెల్ల చక్కెర కానీ—రెండూ తేడా లేకుండా ఒక్కటేనని ఆయన స్పష్టం చేస్తున్నారు. కాలిఫోర్నియాలోని ఒక క్లినిక్‌లో సర్టిఫైడ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా, అలాగే ప్రివెంటివ్ గ్యాస్ట్రోఎంటరాలజీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ పాల్ మాణిక్యం ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో […]
భారత పోస్టల్ డిపార్ట్మెంట్ సీనియర్ సిటిజన్ల కోసం సరికొత్త సేవింగ్స్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో 60 ఏళ్లు దాటిన వారికి 8.2% వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే ఇంకమ్ ట్యాక్స్ యాక్ట్ 80C సెక్షన్ కింద ₹1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. పోస్టల్ శాఖ సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి: పెట్టుబడి పరిమితులు కనీస పెట్టుబడి: ₹1,000 గరిష్ట పెట్టుబడి: ₹30 లక్షలు భార్యభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ […]