తెలంగాణలో అధికారపార్టీ టీఆర్ఎస్లో ఒక్కసారిగా వేడి పుట్టింది. దీనికి కారణం రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్ రావడమే. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్‌ను రాజీనామా చేయించి.. ఎమ్మెల్సీని చేశారు. దీంతో ఆ రాజ్యసభ స్థానానికి 2024 ఏప్రిల్ వరకు పదవీకాలం ఉండిపోయింది. ఆ భర్తీ ప్రక్రియలో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దాంతో టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి ఎవరు అనే అంశం చుట్టూ చర్చ ఊపందుకుంటోంది. రెండేళ్లే పదవీకాలం ఉన్నప్పటికీ చాలామంది టీఆర్ఎస్ నేతలు […]
తెలంగాణలో మరింత విస్తరించాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఢిల్లీ నాయకత్వం పదే పదే రాష్ట్ర నాయకులకు చెబుతూ వస్తోంది. ప్రజా సమస్యలు.. రాజకీయ అంశాలపై అటెన్షన్ తీసుకొస్తూనే.. క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెరగడానికి వివిధ పార్టీల్లో శక్తికేంద్రాలుగా ఉన్న నాయకులకు కాషాయ కండువా కప్పాలని స్పష్టంగా సూచిస్తున్నారు. దాంతో బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. కానీ.. ఆ స్థాయిలో జాయినింగ్స్ లేవు. హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత వలసలు […]
అనంతపురం జిల్లా రాజకీయాల్లో తరచూ హైటెన్షన్ ఏర్పడే నియోజకవర్గాల్లో ఉరవకొండ కూడా ఒకటి. అదేదో ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య వార్‌తోనే కాదు. అధికార వైసీపీలో ఉన్న గ్రూపులతోనే తరచూ ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుంటాయి. కానీ ఈసారి సీన్ మారింది. ఒక చిన్న ఫ్లెక్సీ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మధ్య పెద్ద వార్‌కు దారితీసింది. కాకపోతే ఇక్కడ ఫ్లెక్సీలు కట్టింది వైసీపీ నేతలు. ఆ […]
తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ నిర్మాణంపై చర్చ జరుగుతుంది. రాహుల్ గాంధీ పర్యటన తర్వత డీసీసీ అధ్యక్షుల నియామకం చేపడతారు. ఇప్పటికే పీసీసీ కొంత కసరత్తు చేసిందని ప్రచారం నడుస్తోంది. రాహుల్ టూర్ ఉండటంతో ఆ కసరత్తుకు బ్రేక్ పడింది. కాకపోతే కమిటీపై మెలిక పంచాయితీ మాత్రం గ్రేటర్ మీద పడింది. గ్రేటర్ పరిధిలో పార్టీ బలంగానే ఉన్నా.. పాతికకు పైగా సెగ్మెంట్లు ఉన్నా నాయకత్వం అంతంత మాత్రమే. ప్రస్తుతం మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ పార్టీకి నాయకత్వం […]
తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పాదయాత్రలు చేయవచ్చన్నారు. అయితే దేని కోసం ఎక్కడ చేస్తున్నామన్నది ముఖ్యమని.. షర్మిలది అత్మ మీద కోపం దుత్తమీద అన్నట్లు.. అన్న మీద కోపం ఉంటే.. అక్కడ చూసుకోవాలి గానీ.. ఇక్కడేంటని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ బ్రతికున్నంత వరకూ తెలంగాణ వ్యతిరేకని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో షర్మిలా కాంట్రిబ్యూషన్ ఏముందని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా ఆర్ఎస్ […]
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్టీవీతో జరిగిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు 11 రాష్ట్రాలు కాపీ కొట్టాయని, మిషన్ భగీరథను అమలు చేస్తున్నాయన్నారు. రైతు బంధును పీఎం కిసాన్ అని, హర్ ఘర్ జల్ కూడా కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలకు నేడు తెలంగాణ దిక్సూచిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 8 ఏళ్లలో బీజేపీ ప్రజలకు చేసిందేమి లేదని, […]
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కత్తి పట్టుకుని కూర్చున్నారు. 32 జిల్లాల్లో పార్టీ నాయకత్వం పై భారీగానే మార్పులు చేర్పులు చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ సందర్భంగా కొందరికి కోత పెట్టడానికి కూడా సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చేదంతా ఎన్నికల సీజన్ కావడంతో.. మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేస్థాయి నాయకులకే పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో ఉన్నారట. ఎమ్మెల్యేలు ఉన్నచోట వారికే డీసీసీ పదవులు కట్టబెటడతారని తెలుస్తోంది. ..spot.. జిల్లాలో బలమైన నాయకుడు అనే ముద్ర ఉండటంతోపాటు.. […]
శుభమా అని కెటీఆర్ వస్తానంటే…ఆయనేదో మర్యాదగా భోజన ఏర్పాట్లు చేస్తానన్నారు…కానీ, ఆ విందు ఏర్పాట్లే సమస్యగా మారతాయని ఊహించి ఉండరు..ఇంత మంది పార్టీ నేతలు కాదంటున్న వరుసలో…కెటీఆర్ మాత్రం భోజనానికి కూర్చుంటారా ఏమిటి అని ప్రశ్నిస్తున్నాయి..పార్టీ వర్గాలు.. ఇంతకీ ఖమ్మం గుమ్మంలో కెటీఆర్ అడుగుపెట్టేదెపుడో మరి..? విందుభోజనమే కెటీఆర్ టూర్ వాయిదాకు కారణమ ఖమ్మం గులాబి నేతల మధ్య విభేదాలు మరింత పెరుగుతున్నాయా? ఖమ్మం జిల్లా కేంద్రంలో అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా మంత్రి కెటిఆర్ పర్యటించాల్సి ఉంది. […]
వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా? ఎన్నికల్లో పోటీ చేయగలమా? రాజకీయ భవిష్యత్ ఏంటి? ఈ ప్రశ్నల చుట్టూనే కొందరు టీఆర్ఎస్ నేతల ఆలోచనలు ఉన్నాయట. ఉన్నచోటే ఉంటే.. ఛాన్స్ రాకపోతే ఎలా అనే ఆందోళనలో మరోదారి వెతుక్కునే పనిలో ఉన్నట్టు టాక్. రాజకీయ అవకాశాల కోసం లెక్కలతో కుస్తీ పడుతున్నారట. జంపింగ్ జపాంగ్‌ల కాలం మొదలైందా? తెలంగాణలో రాజకీయ వేడి నెలకొంది. ఎన్నికలకు ఇంకా టైమ్ ఉన్నా.. ఇప్పటి నుంచే జాగ్రత్త పడే పనిలో బిజీ అవుతున్నారు […]
కాషాయ శిబిరంలో కషాయం డోస్ ఎక్కువైందా? కమలనాథుల్లో కలహాలు పెరిగాయా? నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బయట పడుతున్నాయా? పార్టీ సారథి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయా? ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు? క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకొనే ఆ జాతీయపార్టీలో అసలేం జరుగుతోంది? కమలం శిబిరంలో ఏం జరుగుతోంది? తెలంగాణలో బీజేపీ పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్టు ఉందా? నానాటికీ పార్టీ తీసికట్టుగా మారుతోందా? బీజేపీలోని ముఖ్య నాయకులు ఒకరి […]