గురునాథ్‌రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న ఆయన.. కారులో ఇమడ లేకపోతున్నారట. టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికారపార్టీలో ఆయన సీనియారిటీకి తగిన గుర్తింపు, ప్రాధాన్యం దక్కడం లేదని కొంతకాలంగా మథన పడుతున్నారట గురునాథరెడ్డి. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ఇటీవల నియోజకవర్గంలోని కోస్గి పట్టణానికి మంత్రి కేటీఆర్ వచ్చారు. ఆ కార్యక్రమానికి గురునాథరెడ్డిని ఆహ్వానించలేదట. అయినప్పటికీ బహిరంగ సభ వద్దకు వచ్చిన […]
తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరే డిఫరెంట్. ఎవరు ఏం చెప్పారు అనే దానికంటే.. మాకు నచ్చింది మేము చేస్తాం అనే ధోరణి ఎక్కువ కనిపిస్తుంది. వరంగల్ వేదికగా..రైతు డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్. వచ్చే నెల రోజుల్లో క్షేత్ర స్థాయికి డిక్లరేషన్ తీసుకు వెళ్లాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. ఆ వెంటనే ప్రకటనలు చేసేసి.. సమావేశాలు నిర్వహించి షెడ్యూల్ ప్రకటించారు పార్టీ నేతలు. ఆ షెడ్యూల్ ప్రారంభించి వారం అయ్యిందో, లేదో… నాయకులు అంతా గాయబ్ అయ్యారు. కింది […]
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక రాజకీయ రగడగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును ఈ పథకానికి సంబంధించి నియోజకవర్గంలో ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినప్పటికీ.. లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలదే కావడంతో.. ఆయన రోల్ కీలకంగా మారిపోయింది. దీనిని మంథనిలోని టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారట. కాంగ్రెస్ కార్యకర్తలకే ఎమ్మెల్యే దళితబంధు ఇప్పిస్తున్నారని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్‌డివిజన్‌లో అధికారపార్టీ నేతలు రహస్య మీటింగ్ పెట్టుకున్నారట. ఈ పథకాన్ని ముందుగా టీఆర్ఎస్ […]
తమిళనాడులో సుపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతే ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో విజయ్. బాలనటుడిగా సినీ ప్రవేశం చేసిన విజయ్ తక్కువ కాలంలోనే స్టార్డమ్ సాధించారు. సేవా కార్యక్రమాల్లోనూ విరివిగా పాల్గొని ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి హీరో అడుగులు తమిళనాడుతోపాటు ప్రస్తుతం తెలంగాణలోనూ చర్చగా మారాయి. విజయ్ రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. జయలలిత మరణం తర్వాత విజయం రాజకీయ అరంగేట్రం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ.. దానికి ఇంకా సమయం ఉందని […]
తెలంగాణ కాంగ్రెస్‌లో నిత్యం ఏదో ఒక అలక సర్వ సాధారణమైంది. సభలు.. సమావేశాలు ఏది జరిగినా అలకలు.. అసంతృప్తులు తెరపైకి వస్తున్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో పార్టీ పరిస్థతి కాస్త మెరుగైందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్న తరుణంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రియాంకగాంధీ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ఓదెలుతోపాటు జడ్పీ ఛైర్పర్సన్ అయిన ఓదేలు భార్య భాగ్యలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. అధికారపార్టీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఈ తరహా చేరికలు పార్టీకి పాజిటివ్ సంకేతాలు […]
తెలంగాణ కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌ను సీరియస్‌గా తీసుకుంది. వచ్చే నెల రోజుల కార్యాచరణ ప్రకటించింది కూడా. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. రాహుల్ గాంధీ చెప్పిన షెడ్యూల్ ప్రకారం ప్రొగ్రామ్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసమే ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశాన్ని చాలామంది సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. ఇద్దరు ఎంపీలు.. ఎమ్మెల్యేలు రాలేదు. కొందరు ఉదయపూర్ చింతన్ శిబిర్‌కి వెళ్లడంతో రాలేదని చెబుతున్నా.. […]
ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా కుటుంబం ఒక్క వెలుగు వెలిగింది. భూమా నాగిరెడ్డి దంపతుల మరణం తర్వాత ఆళ్లగడ్డలో ఆ కుటుంబానికి పట్టు సడలింది. భూమా అఖిల నిత్యం ప్రత్యర్థులతోపాటు.. ఒకప్పటి సన్నిహితులతోను, సొంత బంధువులతోను పోరాడాల్సి వస్తోంది. ఒకవైపు కేసులు, మరోవైపు రాజకీయ వివాదాలు, పెదనాన్న కుమారుడు భూమా కిశోర్ రెడ్డితో తగాదాలు… వెరసి జనం సమస్యల కంటే సొంత సమస్యలే ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆమె దృష్టంతా వాటిపైనే పెట్టాల్సి […]
కొంతకాలంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటోంది తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కార్. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విధాన పరంగా పలు అంశాలపై కేంద్రాన్ని గట్టిగానే కార్నర్ చేస్తోంది రాష్ట్రంలోని అధికారపక్షం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రోడ్డోక్కి కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రైతుల కోసం స్వయంగా సీఎం కేసీఆర్ నిరసన చేపట్టారు. తెలంగాణలో పొటికల్ టెంపరేచర్ పెరిగిన తర్వాత రెండు పార్టీల మధ్య సెగలు మరింతగా రాజుకుంటున్నాయి. ఇప్పుడు రెండు […]
గ్రేటర్ వరంగల్ చుట్టూ ఇప్పటికే కొంత ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగింది. మిగతా రింగ్ రోడ్డును నిర్మించేందుకు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఈ రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్ పూలింగ్‌కి ప్లాన్ చేసింది. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో కలిపి మొత్తం 27 గ్రామాల్లో 21,517 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది. వరంగల్ రింగ్‌రోడ్డు వెంట, 27 గ్రామాల్లో భారీ భూ సేకరణకు జీవోను కూడా విడుదల చేసింది. ఆఫీసర్లు […]
ఉత్తమ్ కుమార్‌రెడ్డి. ప్రస్తుతం నల్లగొండ ఎంపీ. గతంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే. పీసీసీ మాజీ చీఫ్. ఎంపీగా కిక్కు ఇవ్వలేదో.. అసెంబ్లీనే ముద్దు అనుకుంటున్నారో కానీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతున్నారు. హుజూర్‌నగర్‌ను విడిచిపెట్టేది లేదని.. ఎమ్మెల్యేగా బరిలో దిగుతానని ఇటీవలే ఓపెస్ స్టేట్మెంట్ ఇచ్చారు ఉత్తమ్. నల్లగొండ ఎంపీగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ ఏం చేస్తారు అనేదానిపై పార్టీ కేడర్‌లో ఇన్నాళ్లూ కొంత సస్పెన్స్ ఉండేది. ఆ ఉత్కంఠకు ఆయన తెరదించేశారు. […]