TCongress Incharge Post: ఆయన తెలంగాణలో పని చేయలేనని చెప్పేశారా..? ఎందుకొచ్చిన తలనొప్పి అని తప్పుకున్నారా..? గాంధీ కుటుంబానికి దగ్గరని ప్రచారం ఉన్నప్పటికీ ఆ నాయకుడి విషయంలో ఏం జరిగింది? ఎవరైనా పొమ్మనలేక పొగ పెట్టారా? తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చగా మారిన ఆ రగడేంటి? లెట్స్ వాచ్..! తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కోసం ఏఐసీసీ ముగ్గురు కార్యదర్శులను నియమించింది. వారిలో సలీం అహ్మద్‌ని ఏడాది క్రితం కర్నాటక రాజకీయాల్లో కీలకం చేశారు. మిగిలింది బోస్ రాజు, శ్రీనివాస […]
తెలంగాణ రాజకీయం ప్రస్తుతం మూడు పార్టీల చుట్టూ తిరుగుతుంది. ప్రధానంగా TRS..కాంగ్రెస్ మధ్య పొలిటికల్ గేమ్ నడుస్తున్నా.. బీజేపీ తన సత్తా చాటే పనిలో ఉంది. పదవులు… జాతీయ కార్యవర్గ సమావేశాలు అంటూ… తెలంగాణలో హడావిడి చేస్తోంది. లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు కూడా ఇచ్చింది. బీజేపీ వ్యూహం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో ఏమో.. ఆ స్థాయిలో రాష్ట్రంలో కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెడుతుందా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల కొందరు […]
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వింత రాజకీయం నడుస్తోంది. పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాలు, భూపాలపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాలను కలుపుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్దే హవా. జడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించడంతో జక్కు శ్రీహర్షిణి ఆ పదవి చేపట్టారు. ఎంతో హుషారుగా ఆ పదవిలో కూర్చున్నా.. జిల్లాలోని రాజకీయ పరిస్థితులు ఆమె ఉత్సహాన్ని ఆవిరి చేస్తున్నట్టు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పుట్టా […]
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి కాంగ్రెస్‌లో వార్ పీక్స్‌కు చేరుకుంటోంది. సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి.. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డిలు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై ఆశలు పెట్టుకుని రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. యువతతో కలిసి వనపర్తిలో శివసేనారెడ్డి కార్యక్రమాలు స్పీడ్ పెంచడంతో చిన్నారెడ్డి వర్గం కలవర పడుతోందట.చిన్నారెడ్డి మాజీ మంత్రి. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గానూ ఉన్నారు. పార్టీ తనను కాదని వేరొకరికి టికెట్ ఇవ్వబోదనే ధీమాతో ఉన్నారు చిన్నారెడ్డి. దీంతో పాత, కొత్త […]
నన్నపనేని నరేందర్.. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే. ఇంకొకరు బస్వరాజు సారయ్య, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ. మూడో వ్యక్తి గుండు సుధారాణి, వరంగల్ మేయర్. ఈ ముగ్గురి మధ్య వరంగల్ తూర్ప టీఆర్ఎస్ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. కోల్డ్‌వార్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకరంటే ఒకరికి పడదు. ముగ్గురి మధ్య అనేక సందర్భాలలో అభిప్రాయభేదాలు బయటపడ్డాయి కూడా. గత ఏడాది దసరా సమయంలోనే రచ్చ రచ్చ అయింది. తాజాగా పట్టణ ప్రగతి కార్యక్రమం ఆ వర్గపోరును పీక్స్‌కు తీసుకెళ్లడంతో […]
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ టిఆర్ఎస్లో వర్గపోరు 2018 నుంచి అనేక మలుపులు తిరుగుతోంది. గడిచిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధి.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారారావు ఓడిపోగా.. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్‌రెడ్డి గెలిచారు. మారిన పొలిటికల్ ఈక్వేషన్స్‌తో ఎమ్మెల్యే బీరం కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి.. గులాబీ కండువా కప్పేసుకున్నారు. అప్పటినుంచి కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ రెండు గ్రూపులుగా చీలి, వర్గపోరు రకరకాలుగా బుసలు కొడుతోంది. ఈ సమస్యపై మొదట్లోనే పార్టీ పెద్దలు దృష్టి పెట్టి ఉంటే పరిస్థితి […]
వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికైన తరుణంలోనే ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. 2, 3 తేదాల్లో జరిగే సమావేశాల ఏర్పాట్లలో ఈటలకు కూడా బాధ్యతలు అప్పగించింది పార్టీ. కానీ.. కొన్నాళ్లుగా బీజేపీలో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే భావనలో మాజీ మంత్రి ఉన్నట్టు టాక్. ముందరి కాళ్లకు బంధాలేస్తున్నారనే ఫీలింగ్‌లో ఉన్నారట. బీజేపీలోని కొందరు నాయకుల వైఖరి పట్ల కినుకతో ఉన్నట్టు చెబుతున్నారు. దాంతో బీజేపీలో ఈటల […]
గోషామహల్. హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గాల్లో రాజకీయ వేడి ఎక్కువగా ఉన్న సెగ్మెంట్. గత ఎన్నికల్లో బిజెపి నుంచి రాజాసింగ్ గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలిచిన ఒకే ఒక్క సీటు ఇదే. అక్కడ ఓడిన టీఆర్ఎస్లో మాత్రం ఇప్పటికీ సీన్ మారలేదట. ఆ ఎన్నికల్లో నాయకులు ఏవిధంగా అయితే తన్నుకున్నారో.. ఇప్పుడూ అదే పరిస్థితి ఉందట. నేతలు ఎక్కువైపోయారు. కేడర్‌ను పట్టించుకోవడం లేదు. పైగా ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో టికెట్ తెచ్చుకోవాలని చూస్తున్నారే […]