శుభమా అని కెటీఆర్ వస్తానంటే…ఆయనేదో మర్యాదగా భోజన ఏర్పాట్లు చేస్తానన్నారు…కానీ, ఆ విందు ఏర్పాట్లే సమస్యగా మారతాయని ఊహించి ఉండరు..ఇంత మంది పార్టీ నేతలు కాదంటున్న వరుసలో…కెటీఆర్ మాత్రం భోజనానికి కూర్చుంటారా ఏమిటి అని ప్రశ్నిస్తున్నాయి..పార్టీ వర్గాలు.. ఇంతకీ ఖమ్మం గుమ్మంలో కెటీఆర్ అడుగుపెట్టేదెపుడో మరి..?
విందుభోజనమే కెటీఆర్ టూర్ వాయిదాకు కారణమ ఖమ్మం గులాబి నేతల మధ్య విభేదాలు మరింత పెరుగుతున్నాయా?
ఖమ్మం జిల్లా కేంద్రంలో అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా మంత్రి కెటిఆర్ పర్యటించాల్సి ఉంది. దాదాపు వంద కోట్ల విలువ చేసే పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగాల్సి ఉంది. గతంలోనే కెటిఆర్ పర్యటన ఒక్కసారి వాయుదా పడింది. కానీ, ఇప్పుడు కూడ మళ్లీ ప్రోగ్రామ్ షీట్ ఇచ్చి వాయిదా వేసుకున్నారు. అయితే,ఈ వాయుదాకు పార్టీ నేతల మధ్య విభేదాలే కారణమనే చర్చ నడుస్తోంది. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటిలో ఏర్పాటు చేస్తున్న భోజన కార్యక్రమమే ఈ పోస్ట్ పోన్ కు కారణమని చర్చ సాగుతుంది.
నిజానికి కెటిఆర్ ఖమ్మంలో ఈ నెల 16 న పర్యటించాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కెటిఆర్ అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇందులో భాగంగానే, లంచ్ మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటిలో ఏర్పాటు చేశారు. ఇదే ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామాల మధ్య, కెటిఆర్ పర్యటన మరోసారి వాయుదా పడింది. ఈ వాయిదాకు లంచ్ వివాదమే కారణమంటున్నారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పొసగని అధికార పార్టీ నేతలు ఆయన ఇంట్లో కెటీఆర్ లంచ్ ప్రోగ్రామ్ ను వివాదం చేస్తున్నారనే టాక్ ఉంది. ప్రధానంగా మొన్నటి ఎంఎల్ సి ఎన్నికల నుంచి తాతా మధు, పొంగులేటి మధ్య గ్యాప్ పెరిగింది. అటు సత్తుపల్లి ఎంఎల్ఎ సండ్ర వెంకటవీరయ్యకు, పొంగులేటి కి మద్య వివాదాలు సాగుతున్నాయి. అదే విదంగా మంత్రి పువ్వాడ అజయ్ కూడ పొంగులేటితో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు. అదే విదంగా పొంగులేటి సహకారంతో గెలిచిన వైరా ఎంఎల్ఎ రాముల్ నాయక్, పొంగులేటి మధ్య కూడా సత్సంబంధాలు లేవనే టాక్ ఉంది.
జిల్లా పార్టీలో ఇన్ని సమస్యల మధ్య, వీరంతా పొంగులేటి ఇంటికి కెటిఆర్ రావడాన్ని హర్షించ లేకపోతున్నారట. అంతే కాదు లంచ్ వరకే పరిమితం కాకుండా, అదే రోజు సాయంత్రం లకారం ట్యాంక్ బండ్ వద్ద జరిగే బహిరంగ సభలో కూడ పొంగులేటి పాల్గొంటారనే టాక్ వచ్చింది. ఇది కూడా పొంగులేటి వ్యతిరేక వర్గీయులకు ఏ మాత్రం రుచించడంలేదట. దీనిపై పొంగులేటి వ్యతిరేక వర్గీయులు రహస్యంగా సమావేశమయ్యారనే టాక్ ఉంది. హుటా హుటిన మంత్రి అజయ్ హైదరాబాద్ కు తరలి వెళ్లింది కూడా అధిష్టానంతో మాట్లాడడానికే అనే టాక్ నడుస్తోంది.
మొత్తానికి కారణాలేవైనా, కెటిఆర్ సభ రెండు రోజుల పాటు వాయుదా పడింది. అయితే ఈ వాయిదా వెనుక ఉన్నది లంచ్ వివాదమేనా కాదా అనే టాక్ మాత్రం గట్టిగానే ఉంది. పార్టీలో ఉన్న వర్గ విభేదాలను పరిష్కరించడానికి ఈ లంచ్ పనికొస్తుందనే పార్టీ నేతలు కొందరు భావించారు. నేతలందరు ఒకే వేదిక మీదకు రావడం పార్టీకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కార్యకర్తలు కూడా భావించారు. కానీ, లంచ్ వివాదంతో సీన్ రివర్సయింది. ఇప్పటికే రెండు సార్లు వాయుదా పడిన కెటిఆర్ సభ ఈసారైనా జరుగుతుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.
Watch Here : https://youtu.be/QzOiqrar3kc