రాబోయే రోజుల్లో మహేశ్వరం నియోజకవర్గాన్ని మాదాపూర్, హై టెక్ సిటీ, కొండాపూర్‌లాగా కేఎల్ఆర్ అభివృద్ధి చేస్తారన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క్. బుధవారం కాంగ్రెస్ నేత కిచ్చాన్నగారి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఆయన మహేశ్వరం నియోజకవర్గంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కేఎల్ఆర్ అంటే నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్నారన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు భూములను ఆక్రమంచుకోడం తప్పా వేరే పనులేవీ చెయ్యడం లేదని సబిత ఇంద్రారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజల కోసం లక్ష్మారెడ్డి […]
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నియోజకవ్గంలోని ప్రచారం చేపట్టిన ఆయన మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన మీ అందరి ఉత్సాహం చూస్తుంటే… గెలిచినంత ఆనందంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో తొంబై వేల ఓట్లు వచ్చాయి.. 9వేలకు పైగా మెజారిటీ వచ్చిందని పేర్కొన్నారు. కానీ ఈసారి మన ఓటింగ్ శాతం పెరిగింది… 50వేలకు పైగా మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని చెప్పారు. మా సైన్యాన్ని చూస్తుందంటే […]
Balmuri Venkat Fires on KTR: కేటీఆర్‌కు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో బుధవారం కాంగ్రెస్‌కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. కేటీఆర్ విద్యార్థులను ఐటీ హబ్‌కు పిలిపించి అంతా బాగుందనే చూపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తే సన్నాసులు అని వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌కు వారి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నిరుద్యోగుల తిరుగుబాటుకు […]
ఏపీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘంతో మంగళవారం సమావేశమైంది. ఈసీతో భేటీ అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో దొంగ ఓట్ల చేర్పులు, ఓట్ల తొలగింపులు, టీడీపీ ఓట్లు టార్గెట్ గా తొలగించడం, వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడం వంటి అంశాలపై ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ‘అక్టోబర్ 27 వరకు ఓటర్ వెరిఫికేషన్ దేశమంతట జరిగింది. కానీ ఏపీ రాష్ట్రంలో […]
వాయి కాలుష్యంపై పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో రైతులను విలన్లుగా చిత్రీకరించడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యం పెరగడాన్ని అరికట్టాలని దాఖలైన పటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అయితే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంపై పంజాబ్ ప్రభుత్వం రైతులను కారణంగా చూపించింది. బహిరంగంగా పంట వ్యర్థాలను కాల్చడమే ఇందుకు కారణమని పేర్కొంది. దీంతో సుప్రీం కోర్టు రైతులకు మద్దతుగా వ్యవహరించింది. Also Read: […]
Delhi Father Kills His Son: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తన ఇద్దరు కొడుకుల గొంతు కోసి అనంతరం ఆత్మహత్యకు ఒడిగట్టాడు ఓ తండ్రి. ఈ ఘటనలో రెండేళ్ల బాలుడు మరణించగా.. మరో బాలుడు, ఆ తండ్రి విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. వాయుయ్య ఢిల్లీలోని భరత్ నగర్ వజీర్‌పూర్ జేజే కాలనీలో మెకానిక్‌గా పనిచేస్తున్న రాకేష్ (35) భార్య, ఇద్దరు కుమారులతో నివసిస్తున్నాడు. ఈ […]
RK Roja Filed Defamation Case: టీడీపీ నేత బండారు సత్యనారాయణపై వైఎస్సార్ సీపీ మంత్రి ఆర్కే రోజా కేసు ఫైల్ చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బండారుతో పాటు మరో ఇద్దరిపై మంగళవారం నగరి కోర్టులో ఆమె పరువు నష్టం దావా వేశారు. ఇటీవల మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనను కించపరిచే విధంగా వ్యవహరించిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, నగరి నియోజకవర్గ […]
కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెబుతూ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామాన్ ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో ఆమె మంగళవారం తెలంగాణలో పర్యటించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆమె అక్కడ ఏర్పాటు చేసిన మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లోటు బడ్జెట్‌కు తీసుకువచ్చిందన్నారు. 2014లో రాష్ట్రం విభజన సమయంలో తెలంగాణలో ధనిక రాష్ట్రమని, తొమ్మిదేళ్ల పాలనలో […]
Technical Issue in Air India: న్యూయార్క్ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అప్పటికే ఫ్లయిట్ టేకాఫ్ అవ్వడంతో తిరిగి ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ సంఘటన మంగళవారం ఉదయం ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లావారు జామున 2:19 గంటల సమయంలో ముంబై ఎయిర్‌పోర్టు నుంచి ఎయిర్ ఇండియా చెందిన ఫ్లైయిట్ నెంబర్ ఏఐ119 న్యూాయార్క్ బయలుదేరింది. Also Read: Student Open […]
Kerala Student Open Fire in School: పాఠశాలలో తూపాకితో మాజీ విద్యార్థి కలకలం సృష్టించాడు. ఎయిర్ పిస్టల్‌తో స్కూల్‌కు వచ్చి బెదిరింపులు దిగిన మాజీ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో వివేకోదయం బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. త్రిసూర్‌లోని వివేకోదయం మాజీ విద్యార్థి జగన్ మంగళవారంఉదయం 10 గంటల సమయంలో పాఠశాలలోకి ప్రవేశించాడు. నేరుగా స్టాఫ్ రూంకు వెళ్లిన జగన్ […]