Balmuri Venkat Fires on KTR: కేటీఆర్‌కు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో బుధవారం కాంగ్రెస్‌కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. కేటీఆర్ విద్యార్థులను ఐటీ హబ్‌కు పిలిపించి అంతా బాగుందనే చూపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తే సన్నాసులు అని వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌కు వారి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నిరుద్యోగుల తిరుగుబాటుకు కేటీఆర్, కేసీఆర్ భయపడుతున్నారన్నారు. 15 పేపర్లు లేకేజీ చేశారు…నిరుద్యోగులను రోడ్డున పడేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి ఓట్లేస్తారని బయపడి నిరుద్యోగుల పట్ల కేటీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులు చనిపోతే కనీసం భరోసా ఇవ్వలేదని పేర్కొన్నారు. నిరుద్యోగుల పక్షాన అనునిత్యం ఎన్ఎస్‌యుఐ పోరాడిందని, వారి అండగ ఉందని చెప్పారు. నిరుద్యోగులు ఆలోచించి కాంగ్రెస్‌కు ఓటెయ్యాలని, నయవంచన చేసిన నాటి ప్రభుత్వంపై నిరుద్యోగుల పక్షాన ఏ విధంగానైతే పోరాడేమో ప్రభుత్వం వచ్చాక విద్యార్థి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను దగ్గరుండి అమలు చేయిస్తామని బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు.