Technical Issue in Air India: న్యూయార్క్ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అప్పటికే ఫ్లయిట్ టేకాఫ్ అవ్వడంతో తిరిగి ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ సంఘటన మంగళవారం ఉదయం ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లావారు జామున 2:19 గంటల సమయంలో ముంబై ఎయిర్‌పోర్టు నుంచి ఎయిర్ ఇండియా చెందిన ఫ్లైయిట్ నెంబర్ ఏఐ119 న్యూాయార్క్ బయలుదేరింది.
Also Read: Student Open Fire: స్కూల్లో తూపాకితో మాజీ విద్యార్థి కలకలం.. మూడు సార్లు కాల్పులు..
అయితే అది టేకాఫ్ అయిన తర్వాత ఇరాన్ గగనతలం వద్ద ప్లైయిట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలెట్ తిరిగి ముంబై ఎయిర్ పోర్టుకు విమానాన్ని మళ్లీంచాడు. అయితే విమానం ముంబై ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా సోషల్ మీడియాలో స్పందించింది.ప్రయాణికులకు అంతరాయం ఏర్పడినందుకు క్షమాపణలు కోరింది. వీలైనంత త్వరగా విమానాన్ని తిరిగి ప్రారంభించేందుకు లేదా ప్రత్నామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసే వరకు ప్రయాణికులంతా వేచి ఉండాలని విజ్జప్తి చేసింది.
Also Read: Pawan Kalyan: విశాఖ బోటు ప్రమాదం.. ఆర్థిక సాయం ప్రకటించిన జనసేనాని