రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నియోజకవ్గంలోని ప్రచారం చేపట్టిన ఆయన మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన మీ అందరి ఉత్సాహం చూస్తుంటే… గెలిచినంత ఆనందంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో తొంబై వేల ఓట్లు వచ్చాయి.. 9వేలకు పైగా మెజారిటీ వచ్చిందని పేర్కొన్నారు. కానీ ఈసారి మన ఓటింగ్ శాతం పెరిగింది… 50వేలకు పైగా మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని చెప్పారు. మా సైన్యాన్ని చూస్తుందంటే ఆ నమ్మకం ఉందని, ఈసారి గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Tamil Nadu: గొడ్డు మాంసం తిన్న విద్యార్థిని వేధించి, దాడి చేసిన ఉపాధ్యాయులు..
ఇక్కడ అసైన్డ్ భూములు మొత్తం సబితా ఇంద్రారెడ్డి కబ్జా చేశారని, అప్పటి కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు మినహాయించి నియోజకవర్గంలో ఎవరికైనా డబుల్ బెడ్ రూం వచ్చిందా?? కొత్త రేషన్ కార్డు లు వచ్చాయా?? ప్రశ్నించారు. రిజర్వేషన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటగా కులగణన చేయబోతుందని, 33 శాతం కాంగ్రెస్ అమలు చేస్తామని చెబుతున్నామన్నారు. ఇక బీఆర్ఎస్ చెప్పిన ఏ ఒక్క హామీలను పూర్తిగా నేరవేర్చలేదన్నారు. నిరుద్యోగ భృతి అన్నారు.. దాని ఊసే లేదని, నీళ్ళు, నిధులు, నియామకాలు అన్నారు అది నెరవేర్చలేదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే.. గడీల పాలన వద్దు… అందరి పాలన కావాలి అని పిలుపునిచ్చారు.