హుస్నాబాద్‌ను మూడు ముక్కలు చేశామంటున్నారు.. కానీ, హుస్నాబాద్ మూడు దిక్కుల అభివృద్ధి చెందుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్‌కు మద్దతుగా హరీష్ రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ జరిగిన బీఆర్‌ఎస్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ మేరకు హరీష్ రావు మాట్లాడుతూ.. వంద అబద్ధాలు అడైనా కాంగ్రెస్ అధికారంలోని రావాలని చూస్తోందని, గతి, సుతి లేని కాంగ్రెస్ నున్నమితే […]
ఇందిరమ్మ రాజ్యం కోసం తెలంగాణ చూస్తోంది కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి తుమ్మల నాగేశ్వరరావు దర్శించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించిన తుమ్మల నాగేశ్వరావు భద్రాద్రి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పోదేం వీరయ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్ట్రీట్ కార్నర్ సభలో ఆయన మాట్లాడుతూ.. కోట్లు సంచలతో కొనాలని చూసినా […]
ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను చంపుతానంటూ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పేరుతో ఆ వ్యక్తి ముంబై పోలీసు కంట్రోల్ రూంకు బెదిరింపు కాల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సిగ్నల్ ద్వారా అతడిని ట్రేస్ చేసిన అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయం బయట పెట్టాడు. పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను […]
కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల్లో పెళ్లి అనగా కాబోయే భర్త ఇంటిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో సోమవారం జరిగింది. అయితే కాబోయే అత్తింటివారే తమ కూతురిని చంపారంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెపట్టారు. వివరాలు.. కర్ణాటకలోని విజయనగరం జిల్లాకు చెందిన ఐశ్యర్య, అశోక్ కుమార్‌లు పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మంచి ఉద్యోగంలో సెటిలైన ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ నిర్ణయాన్ని ఇంట్లో చెప్పారు. […]
నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్ళ బిఅర్ఎస్ ప్రభుత్వం.. నీళ్లకి నికరం లేదు, కన్నీళ్లకు కనికరం లేదు,నిధులు గులాబీ గదుల నిండా, నియామకాలు ఒక కెసిఅర్ కుటుంబం పండగలా అయ్యందని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ మీడియా విభాగం ఇంచార్జీ చేతన్ గోనాయక్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చిన్న గారి లక్ష్మారెడ్డికి మద్దతుగా కేఎల్‌ఆర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేతన్ […]
BJP Delhi Leaders Telangana Tour: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నిర్మల సీతారామన్, దేవేంద్ర ఫడ్నవిస్‌లు ఇక్కడి బీజేపీ అభ్యర్థులకు మద్ధతుగా ఒక్కొక్కొ రోజు ప్రచారం చేపట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వారి షెడ్యూల్‌ను ప్రకటించారు. సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రధాని మోదీతో సహా […]
ఐదు రోజుల తర్వాత జూబ్లీహిల్స్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. హెడ్‌కానిస్టేబుల్ నాగేశ్వరరావు కష్టం వల్లే బాలిక జాడ లభ్యమైంది. ఇటీవల తన 15 సంవత్సరాల కూతురు కనిపించడం లేదంటూ బాలిక తండ్రి ఐదు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తండ్రితో కలిసి నివసిస్తున్న మైనర్ బాలిక యూసఫ్ గూడలోని స్థానిక పాఠశాలలలో 10వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో 5 నెలల క్రితం బాలిక తల్లి చనిపోవడంతో ఒంటరైన ఆమె […]
బీజేపీకి ఓటు వేసినా.. మోరిలో ఓటు వేసిన ఒకటే అని ఆర్థిఖ శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. సోమవారం గజ్వేల్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ఈటెల రాజేందర్ తిన్నింటి వాసాలు లెక్కబెట్టారని, అన్నం పెట్టిన చెయ్యికి సున్నం పెట్టిండని మండిపడ్డారు. ఈటెలను ఎమ్మెల్యే చేసింది, మంత్రిని చేసింది.. శాసన సభ పక్ష లీడర్‌ను చేసింది సీఎం కేసీఆర్ అని గుర్తు […]
NSUI Protest At JNTU: కూకట్‌పల్లి జేఎన్టీయూ యూనివర్సటీ వద్ద ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. స్టూడెంట్ లీడర్ ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. యూనివర్సిటీ పరిధిలోని R17, R18, R22లో జరిగిన పరీక్షలకు సంబంధించి క్రెడిట్ విధానాల వల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కోవిడ్ సమయంలో సరైన తరగతులు జరగక విద్యార్థులకు ఇబ్బందులు పడడమే కాకుండా అవస్థలు […]
కాంగ్రెస్ ఆరు గ్యారెంటటీలంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతుందని కర్ణాటక మాజీ డిప్ఊటీ సీఎం, బీజేపీ నేత అశ్వత్ నారాయణ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజీపీ పార్టీ తరపున ఆయన రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా సోమవారం బీజేపీ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, అక్కడ ఇచ్చిన ఏ హామీనీ కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని అన్నారు. ఆర్భాటంగా ప్రకటించిన ఏ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదన్నారు. అమలుసాధ్యం కాని […]