Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో హత్యా రాజకీయాలు కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఒక నాయకుడు తూటాకు బలైన ఘటన గురువారం పాట్నా జిల్లాలోని మోకామా తాల్ ప్రాంతంలో వెలుగు చూసింది. జన్‌సురాజ్ అభ్యర్థి పియూష్ ప్రియదర్శి మద్దతుదారుడు ఆర్జేడీ మాజీ నాయకుడు దులార్‌చంద్ యాదవ్ గురువారం రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ కాల్పుల్లో కాల్చి చంపబడ్డాడు. దులార్‌చంద్ యాదవ్ పియూష్ ప్రియదర్శికి మద్దతుగా తన మద్దతుదారులతో ప్రచారం చేస్తుండగా ఈ సంఘటన […]
Abhishek Nayar: ఐపీఎల్ 2026 సీజన్‌కు జట్లు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాయి. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) నుంచి ముఖ్యమైన వార్త వచ్చింది. ఈ జట్టు తన కోచింగ్ సెటప్‌లో భారీ మార్పులు చేసింది. కేకేఆర్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌ను నియమించింది. గతంలో ఈ టీంకు చంద్రకాంత్ పండిట్ ప్రధాన కోచ్‌గా సేవలు అందించారు. ఆయన స్థానంలో కొత్తగా అభిషేక్ నాయర్ నియమితులయ్యారు. READ ALSO: Top Headlines @5PM : టాప్ […]
Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కొత్త పాత్రలోకి ప్రవేశించడానికి సిద్ధమౌతున్నట్లు సమాచారం. ఆయన ఐపీఎల్లో ఒక జట్టుకు చీఫ్ కోచ్‌గా మారనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జి) జట్టుకు ప్రధాన కోచ్‌గా ఆయనను నియమించడానికి యూవీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తన జట్టుకు భారతీయుడిని ప్రధాన కోచ్‌గా నియమించాలనుకుంటున్నట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఎల్ఎస్జి టీంకు ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా […]
Children Hostage Mumbai: ముంబైలో గురువారం సంచలన ఘటన వెలుగు చూసింది. నగరంలో పట్టపగలు పిల్లలను బందీలుగా తీసుకున్నట్లు కేసు నమోదు కావడం కలకలం రేపింది. ముంబైలోని ఆర్ఏ స్టూడియోలో మొదటి అంతస్తులో ఈ సంఘటన జరిగింది. స్టూడియోలో పనిచేస్తూ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రోహిత్ 20 మంది పిల్లలను బందీలుగా తీసుకున్నట్లు కేసు నమోదు అయ్యింది. మొత్తం 100 మంది పిల్లలు ఆడిషన్ల కోసం వచ్చినట్లు సమాచారం. READ ALSO: Hyderabad: 5.04 కి.మి మేర […]
Smriti Mandhana Wedding: టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన నవంబర్ 20న వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆమెకు కాబోయే వరుడు ఎవరో తెలుసా.. నటుడు-గాయకుడు-దర్శకుడు-సంగీతకారుడు పలాష్ ముచ్చల్ అని కథనాలు వెల్లడించాయి. స్మృతి మంధానకు బాలీవుడ్ నటుల కంటే తక్కువ అభిమానుల ఫాలోయింగ్ ఏం లేదు. ఆమె అందాన్ని ప్రశంసించడంలో ప్రజలు ముందు ఉంటారు. అలాగే ఆమె టీమిండియా మహిళా జట్టులో అత్యంత ముఖ్యమైన క్రీడాకారిణులలో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. […]
Russia Poseidon Drone: రష్యా ప్రపంచాన్ని కుదిపేసింది. తాజాగా మాస్కో నీటి అడుగున అణు జలాంతర్గామి డ్రోన్‌ను పరీక్షించింది. ఈ విషయాన్ని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. పుతిన్ ప్రకటన అమెరికా, యూరోపియన్ యూనియన్‌లో ప్రకంపనలు సృష్టించదని విశ్లేషకులు చెబుతున్నారు. పుతిన్ ప్రకటన ప్రభావం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్షణ అణు పరీక్షకు ఆదేశించేలా చేసిందని నిపుణులు పేర్కొన్నారు. READ ALSO: CP Sajjanar: వాట్సప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారంటూ ప్రచారం.. సీపీ […]
Female Terrorists: పాకిస్థాన్ కేంద్రంగా మసూద్ అజార్ భారీ కుట్రకు తెరలేపాడు. ఆపరేషన్ సింధూర్‌లో దాదాపు తన కుటుంబాన్ని కోల్పోయిన పాకిస్థాన్ ఉగ్రవాది మసూద్ అజార్ తన కుట్రలను ఇంకా ఆపలేదని నిఘావర్గాలు తెలిపాయి. ఆయన ఇప్పుడు దాయాది దేశంలో మహిళా దళాన్ని ఏర్పాటు చేస్తున్నాడని సమాచారం. మహిళలను నియమించిన తర్వాత, వారు పూర్తి శిక్షణ పొంది ఉగ్రవాద పనిని కొనసాగించనున్నారు. ఈ విధంగా మహిళలను నియమించి ఉగ్రవాద శిక్షణ ఇచ్చిన ఉగ్రసంస్థ కేవలం జైషే ఒక్కటే […]
Ginger Health Benefits: అల్లం సహజ ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అల్లంలో యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గిస్తాయని, ఇన్ఫెక్షన్ను నివారిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచించారు. అలాగే ఇది తీసుకోవడం వల్ల గుండెకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. అల్లం తరచుగా వచ్చే అనారోగ్యాలను నివారించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. శీతాకాలంలో శరీర అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అల్లం ఒక అద్భుతమైన సహజ పదార్ధంగా పని చేస్తుందని అంటున్నారు. […]
EPFO Latest Update: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన నియమాలలో కొత్త మార్పులు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే నెలల్లో EPF, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కు తప్పనిసరి ఉద్యోగి సహకారాల జీతం పరిమితిని నెలకు ₹25 వేలకు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం జీతం పరిమితి నెలకు రూ.15 వేలుగా ఉంది. అయితే EPFO నిర్వహించే EPF, EPS కు తప్పనిసరి సహకారాలకు ఇది చట్టబద్ధమైన పరిమితి. READ ALSO: Vijayanagaram: […]
Droupadi Murmu: హర్యానాలోని అంబాలా వైమానిక దళ స్టేషన్లో ఒక చారిత్రాత్మక క్షణానికి వేదిక కానుంది. రేపు (అక్టోబర్ 29, 2025న) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించనున్నారు. ఇది ఆమె అధ్యక్ష పదవిలో మరో ప్రధాన మైలురాయిని నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఇది భారతదేశంలో పెరుగుతున్న రక్షణ సామర్థ్యాలను ప్రదర్శిస్తుందని అంటున్నారు. రాష్ట్రపతి ముర్ము భారత సాయుధ దళాలకు సుప్రీం కమాండర్. READ ALSO: Montha Cyclone Effect: తీరాన్ని […]