Book My Show Fine: బుక్ మై షోకి 12 వేల ఫైన్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Book My Show Fine: సాధారణంగా సినిమాకు వెళ్లి అది ప్లాప్ అయితే డబ్బులు, సమయం వృధా అయ్యాయని బాధపడటం సహజం. కానీ, ఓ వ్యక్తి మాత్రం తాను బుక్ చేసుకున్న సినిమా క్యాన్సిల్ కావడంతో ఏకంగా బుక్ మై షో (BookMyShow) పై కేసు వేసి రూ.12,000 పరిహారం గెలుచుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. కొత్త సంవత్సరం (జనవరి 1) సందర్భంగా ఒక కస్టమర్ మోహన్ లాల్ నటించిన ‘#Barroz’ సినిమా చూసేందుకు BookMyShow లో టికెట్ బుక్ చేసుకున్నాడు. సినిమా చూడాలని ఎంతో ఉత్సాహంగా థియేటర్‌కి వెళ్తే అక్కడ అతనికి ఒక ట్విస్ట్ ఎదురైంది. బరోజ్ షో క్యాన్సిల్ చేసి, స్క్రీన్‌పై మరో సినిమా ప్రదర్శిస్తున్నారు థియేటర్ వాళ్లు. అయితే టికెట్ బుక్ చేసుకున్న ఆ కస్టమర్‌కి షో క్యాన్సిల్ అయినట్లు ముందుగా BookMyShow నుంచి కనీసం ఒక్క మెసేజ్ కూడా రాలేదు.
ఈ నిర్లక్ష్యానికి విసిగిపోయిన ఆ మూవీ లవర్ నేరుగా హైదరాబాద్ కన్స్యూమర్ కోర్ట్‌ను ఆశ్రయించి @bookmyshow పై ఫిర్యాదు చేశాడు. కోర్టు విచారణలో బుక్ మై షో తరుఫున న్యాయవాదులు వాదిస్తూ.. “బుక్ మై షో వాళ్లు కేవలం మధ్యవర్తులం మాత్రమే, కస్టమర్‌కి టికెట్ డబ్బులు రిఫండ్ చేసేశారు” అని తెలిపారు. అయితే బుక్ మై షో వాదనను కోర్టు తోసిపుచ్చింది. “కేవలం రిఫండ్ ఇచ్చాం అంటే సరిపోదు. కస్టమర్లకు సరైన సమయంలో సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉంది. కస్టమర్ వృధా చేసుకున్న సమయానికి, పడ్డ ఇబ్బందికి కూడా ప్లాట్ఫామ్దే బాధ్యత” అని స్పష్టం చేసింది. ఈ మేరకు కస్టమర్‌కు రూ.10,000 పరిహారంతో పాటు, రూ.2,000 కోర్టు ఖర్చులు కలిపి మొత్తం రూ.12,000 చెల్లించాలని BookMyShow కి సంచలన జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే భారీ అంచనాలతో వచ్చిన ‘#Barroz’ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఆ డిజాస్టర్ సినిమా చూడకపోవడంతో అతనికి రెండున్నర గంటల సమయం ఆదా అవ్వడంతో పాటు, కోర్టు ద్వారా రూ. 12 వేలు పరిహారం లభించిందని నెట్టింజ జోరుగా కామెంట్స్ వెల్లువెత్తున్నాయి. ఏదేమైనా డిజాస్టర్ చూడలేకపోయానని వేసిన కేసు చివరికి భారీ లాభంతోనే ముగిసిందని ఆ కస్టమర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తాజావార్తలు
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..