Cloudflare Outage: మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్) మంగళవారం సాయంత్రం భారతదేశంలో పనిచేయలేదు. వేలాది మంది వినియోగదారులు తమ సొంత ఫీడ్‌లను వీక్షించడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. అవుట్‌టేజ్ మానిటరింగ్ వెబ్‌సైట్, డౌన్‌డెటెక్టర్ కూడా X డౌన్‌టైమ్‌ను నిర్ధారించింది. X వెబ్‌సైట్‌ను తెరవడం వల్ల పేజీ రిఫ్రెష్ కాలేదు, దీనితో వినియోగదారులు దాన్ని మళ్లీ రిఫ్రెష్ చేయవలసి వచ్చింది.
READ ALSO: Nandyal: బ్యాంక్ సిబ్బందిని నిర్బంధించిన రైతులు.. బయట పడిన నకిలీ బంగారం బాగోతం
అవుటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ నివేదికల ప్రకారం.. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో X పనిచేయడం లేదని ఫిర్యాదులు ప్రారంభమయ్యాయి. వినియోగదారులు తమ ఫీడ్‌లను వీక్షించడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. సాయంత్రం 5:06 గంటల నాటికి, డౌన్‌డెటెక్టర్ X పనిచేయడం లేదని 1,200 కంటే ఎక్కువ ఫిర్యాదులు నమోదు చేసింది. ఈ ఫిర్యాదుల్లో 49% ఫిర్యాదులు ఫీడ్‌కు సంబంధించినవి, 29% వెబ్‌సైట్‌కు సంబంధించినవి, 22% సర్వర్ కనెక్షన్ సమస్యలకు సంబంధించినవి అని వెల్లడించింది.
అమెరికాలో కూడా పని చేయని X ..
DownDetector ప్రకారం.. Xలో అంతరాయం మంగళవారం సాయంత్రం 5:20 గంటల వరకు గమనించారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల నుంచి వచ్చిన నివేదికలు ప్రకారం భారతదేశం, US, UKలలో కూడా అంతరాయాలను గమనించారు. ఈ సమయంలో Xని యాక్సెస్ చేయడంలో విఫలం అయిన US లోని వినియోగదారుల 10 వేల కంటే ఎక్కువ ఫిర్యాదులు DownDetector నమోదు చేసింది. USలోని మొబైల్ యాప్ అత్యధిక సమస్యలను ఎదుర్కొన్నట్లు ఈ డేటా చూపిస్తుంది. 61% ఫిర్యాదులు వెబ్‌సైట్‌కు సంబంధించినవి, 28% ఇంటర్నెట్‌కు సంబంధించినవి, 11% సర్వర్ కనెక్షన్ లోపాలకు సంబంధించినవిగా వెల్లడించింది.
క్లౌడ్‌ఫ్లేర్‌లో ప్రధాన అంతరాయం..
క్లౌడ్‌ఫ్లేర్‌లో పెద్ద అంతరాయం ఇంటర్నెట్‌లో ఎక్కువ భాగాన్ని ఆఫ్‌లైన్‌కు తీసుకెళ్లింది. దీని కారణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X, లెటర్‌బాక్స్‌డ్ వంటి ప్రసిద్ధ వెబ్‌సైట్‌లు లోడ్ కాలేదు. ఈ రోజు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X మాత్రమే కాకుండా, ChatGPT, Downdetectorతో సహా అనేక ఇతర ప్లాట్‌ఫారమ్‌లు కూడా పని చేయలేదు. ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అంతరాయం ప్రారంభమైంది. ఈ అంతరాయం Cloudflare మౌలిక సదుపాయాలపై ఆధారపడే అన్ని ప్లాట్‌ఫారమ్‌లకు త్వరగా వ్యాపించింది. OpenAI డౌన్‌డెటెక్టర్‌పై పనిచేయడం లేదని కొన్ని నివేదికలు పేర్కొ్న్నాయి. అలాగే డౌన్‌డెటెక్టర్ కూడా కొద్దిసేపు అంతరాయం ఎదుర్కొంది.
నేటి ఆధునిక ఇంటర్నెట్ ప్రపంచంలో క్లౌడ్‌ఫ్లేర్ ఒక కీలకమైన భాగంగా టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇది మిలియన్ల కొద్దీ వెబ్‌సైట్‌లకు కంటెంట్ డెలివరీ, భద్రతా రక్షణ, ట్రాఫిక్ నిర్వహణ వంటి సేవలను అందిస్తుంది. ఒక వెబ్‌సైట్ ట్రాఫిక్‌లో ఆకస్మిక పెరుగుదల లేదా సైబర్ దాడిని ఎదుర్కొన్నప్పుడు కూడా, క్లౌడ్‌ఫ్లేర్ వాటిని ఆన్‌లైన్‌లో ఉంచడానికి సహాయపడుతుంది. కానీ క్లౌడ్‌ఫ్లేర్ సాంకేతిక అంతరాయం ఎదుర్కొన్నప్పుడు, దాని ప్రభావం ఒక వెబ్‌సైట్‌పై మాత్రమే కాకుండా, మొత్తం ఇంటర్నెట్ అంతటా కనిపిస్తుంది. ఈ రోజు జరిగింది సరిగ్గా ఇదే. గత నెలలో AWS అంతరాయం సమయంలో అనేక వెబ్‌సైట్‌లు సంబంధం లేకుండా ఒకేసారి పని చేయలేకపోయాయి. క్లౌడ్‌ఫ్లేర్‌లో ఒక చిన్న సమస్య తలెత్తిన కూడా ఇంటర్నెట్‌కు విస్తృతమైన అంతరాయం కలుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Maoist Top Commanders: హిడ్మా ఔట్.. మావోయిస్టు పార్టీలో మిగిలిన టాప్ కమాండర్లు వీరే!